For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్‌కాయిన్‌కు పోటీగా రిలయన్స్‌ జియో కాయిన్‌ రాబోతుందా!

బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీలో అనుభ‌వం ఉన్న 50 మంది ప్రొఫెష‌న‌ల్స్‌తో కూడిన బృందానికి ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ నేతృత్వం వ‌హిస్తున్న‌ట్టు తెలిసింది. ఈ ప్రాజ్టెకులో ప‌నిచేసే బృందం స‌గ‌టు వ‌

By P Krishnadivya
|

ఉచిత ఆఫ‌ర్లు, త‌క్కువ ధ‌ర‌కే డేటాను అందించి గతేడాది భార‌త టెలికాం రంగంలో పెను ప్ర‌కంప‌ల‌కు తెర‌తీసిన రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. అంత‌ర్జాతీయంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన క్రిప్టో క‌రెన్సీ బిట్‌కాయిన్ మాదిరిగా జియో కాయిన్ అభివృద్ధి చేయాల‌ని ఆలోచ‌న‌తో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీలో అనుభ‌వం ఉన్న 50 మంది ప్రొఫెష‌న‌ల్స్‌తో కూడిన బృందానికి ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ నేతృత్వం వ‌హిస్తున్న‌ట్టు తెలిసింది. ఈ ప్రాజ్టెకులో ప‌నిచేసే బృందం స‌గ‌టు వ‌య‌సు 25 అని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో జియో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న జియో కాయిన్ గురించి తెలుసుకుందాం.

1. పెరుగుతున్న గిరాకీ:

1. పెరుగుతున్న గిరాకీ:

క్రిప్టో క‌రెన్సీని సృష్టించేంద‌కు అవ‌స‌ర‌మైన బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీకి క్ర‌మంగా గిరాకీ పెరుగుతోంది. అంద‌రూ దీనివైపు ఆక‌ర్షితులు అవుతున్నారు. ఇందులో బ్లాక్స్ ఉంటాయి. వాటిని క్రిప్టోగ్ర‌ఫీతో సుర‌క్షితంగా సృష్టిస్తారు.

ప్ర‌తి బ్లాక్‌లో ఒక హ్యాష్ పాయింట‌ర్ ఉంటుంది. అది అంత‌కుముందు బ్లాక్‌, టైమ్ స్టాంప్‌, లావాదేవీల స‌మాచారానికి అనుసంధాన‌మై ఉంటుంది. డిజైన్ ప్ర‌కారం స‌మాచారాన్ని మార్పు చేర్పులు చేసేందుకు బ్లాక్‌చెయిన్ నిరాక‌రిస్తుంది. అంద‌రికీ అందుబాటులో ఉండే లెడ్జ‌ర్‌లో రెండు పార్టీలు శాశ్వ‌తంగా లావాదేవీల‌ను న‌మోదు చేయ‌వ‌చ్చు.

 2. జియో వ్యూహ‌మిదీ:

2. జియో వ్యూహ‌మిదీ:

ప్ర‌స్తుతానికి రిల‌య‌న్స్ జియో సొంత క్రిప్టో క‌రెన్సీపై ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు కానీ విభిన్న‌మైన బ్లాక్‌చెయిన్ టెక్నాల‌జీల‌పైన ప‌నిచేస్తున్నట్టు తెలిసింది. సంస్థ ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగంలోకి దిగింద‌ని దానికి బ్లాక్‌చెయిన్ టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి.

 3. మ‌ద్ద‌తివ్వ‌ని ప్ర‌భుత్వం:

3. మ‌ద్ద‌తివ్వ‌ని ప్ర‌భుత్వం:

ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిప్టో క‌రెన్సీకి ప్ర‌త్యేకంగా బిట్‌కాయిన్ మేనియా పెరిగిపోతున్నా ప్ర‌భుత్వం మాత్రం దీనికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు. ఈ త‌ర‌హా క‌రెన్సీని అవాంచిత ప‌నుల‌కు ఉప‌యోగించేందుకు ఆస్కారం ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. గ‌తేడాది ప్ర‌భుత్వం క్రిప్టోక‌రెన్సీకి సంబంధించిన స‌మ‌గ్ర వివ‌రాల‌ను అధ్య‌య‌నం చేసి నివేదిక అంద‌జేయాల‌ని ఒక క‌మిటీని నియ‌మించింది. ఇప్ప‌టికే అది నివేదిక అంద‌జేసింద‌ని న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో కొంద‌రు త‌మ న‌ల్ల‌ధ‌నాన్ని బిట్‌కాయిన్ త‌ర‌హా క్రిప్టో క‌రెన్సీలోకి మ‌ళ్లించారా అని ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంద‌ని న్యాయ వ్య‌వ‌హారాల శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి అన‌దీనాథ్ మిశ్రా వెల్ల‌డించారు.

4. ఆర్‌బీఐ హెచ్చరికలు:

4. ఆర్‌బీఐ హెచ్చరికలు:

బిట్‌కాయిన్ లేదా క్రిప్టో క‌రెన్సీకి భార‌త్‌లో ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేద‌ని చాలాసార్లు ప్ర‌భుత్వం, భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), మార్కెట్ నియంత్ర‌ణ సంస్థ సెబీ ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించింది. దేశంలో ఇది చెల్ల‌ద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్య‌స‌భ‌లోనూ ప్ర‌క‌టించారు. క్రిప్టో క‌రెన్సీతో కొన్ని పోంజీ ప‌థ‌కాలు న‌డుస్తున్నాయ‌ని వాటికి ర‌క్ష‌ణ లేద‌ని డిసెంబ‌ర్ 29న ప్ర‌భుత్వం మ‌దుప‌ర్ల‌ను హెచ్చ‌రించింది. ఆర్‌బీఐ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. బిట్‌కాయిన్ లేదా వ‌ర్చువ‌ల్ క‌రెన్సీలో ఉండే వినియోగ‌దారుల ఖాతాలు ఇంట‌ర్నెట్‌లో ఉంటాయ‌ని వాటికి పాస్‌వ‌ర్డులు హ్యాక్ చేసే ప్ర‌మాదం ఉంటుంద‌ని, ఆన్‌లైన్‌లో మీ డ‌బ్బులు పోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పింది. వీటితో లావాదేవీలు నిర్వ‌హించే వారు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పూర్తి బాధ్య‌త వారిదే అవుతుంద‌ని పేర్కొంది. బిట్‌కాయ‌న్‌/వ‌ర్ఛ్‌వ‌ల్ క‌రెన్సీల‌తో ప‌థ‌కాలు నిర్వ‌హించేందుకు తాము ఏం సంస్థ‌కు, వ్య‌క్తికీ అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Read more about: jio bit coin
English summary

బిట్‌కాయిన్‌కు పోటీగా రిలయన్స్‌ జియో కాయిన్‌ రాబోతుందా! | Reliance Jio’s cryptocurrency JioCoin

With an aim to develop applications such as smart contracts and supply chain management logistics, Jio Infocomm, a leading telecom major that disrupted the country’s telecom sector last year with its highly discounted data usage rates and free offers, is mulling over a plan to develop its own cryptocurrency JioCoin, LiveMint reported.
Story first published: Wednesday, January 17, 2018, 10:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X