క్యాన్స‌ర్ ర‌క్ష‌ణ కోసం అతి త‌క్కువ ప్రీమియంతో ఎల్ఐసీ క్యాన్స‌ర్ క‌వ‌రేజీ పాల‌సీ

క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల‌ను తొలి ద‌శాలో గుర్తించ‌లేక‌పోతున్నారు. మూడో ద‌శ‌లో గుర్తిస్తున్నారు. దీంతో ల‌క్ష‌ల రూపాయాల‌ను వైద్యం కోసం ఖ‌ర్చుచేయాల్సి వ‌స్తోంది. ఈ ఆర్థిక‌, మాన‌సిక న‌ష్టాన్ని త‌గ్గించేందుకు

ద‌శాబ్ద కాలం నుంచి విప‌రీతంగా వ్యాప్తిలోకి వ‌చ్చిన‌ వ్యాధి క్యాన్స‌ర్‌! ఒక‌ప్ప‌డు విలావంత‌మైన జీవ‌నం గ‌డిపే ఐశ్వ‌ర్య‌వంతులైన వారికి మాత్ర‌మే సోకిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల‌కూ పాకుతోంది. వారి జీవితాల‌ను, కుటుంబాల‌ను నాశ‌నం చేస్తోంది. కాలుష్యం పెరుగుద‌ల‌, ఆహార అల‌వాట్లు, జీవిన శైలిలో మార్పులు క్యాన్స‌ర్‌కు కార‌ణం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధిని తొలి ద‌శ‌లోనే గుర్తిస్తే వైద్య స‌హాయంతో పూర్తిగా న‌యం చేసుకోవ‌చ్చు. క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌, న‌టి మ‌నీశా కోయిరాల ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

చాలా సంద‌ర్భాల్లో క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల‌ను తొలి ద‌శాలో గుర్తించ‌లేక‌పోతున్నారు. మూడో ద‌శ‌లో గుర్తిస్తున్నారు. దీంతో ల‌క్ష‌ల రూపాయాల‌ను వైద్యం కోసం ఖ‌ర్చుచేయాల్సి వ‌స్తోంది. ఈ ఆర్థిక‌, మాన‌సిక న‌ష్టాన్ని త‌గ్గించేందుకు భార‌తీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కొత్త పాల‌సీని ఆవిష్క‌రించింది. అదే ఎల్ఐసీ క్యాన్స‌ర్ క‌వ‌ర్ (ప్లాన్ 905). ఈ ప‌థ‌కం క‌ల్పిస్తున్న ప్ర‌యోజ‌నాలు ఏమిటో తెలుసుకుందాం.

1. 'క్యాన్స‌ర్‌కు మాత్ర‌మే'

1. 'క్యాన్స‌ర్‌కు మాత్ర‌మే'

ఎల్ఐసీ క్యాన్స‌ర్ పాల‌సీ కేవ‌లం క్యాన్స‌ర్ రోగ‌స్థుల‌కు మాత్ర‌మే. ఇందులో ఏక‌కాలంలోనే చికిత్స కోసం డ‌బ్బ‌లు చెల్లిస్తారు. ఇదొక సంప్ర‌దాయ (నాన్ లింక్‌డ్‌) పాల‌సీ. ఎందుకంటే ప్రీమియాన్ని ఏడాదికోసారి చెల్లించాలి. ఏటా రెన్యువ‌ల్ చేయించుకోవాలి. క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లిస్తేనే క‌వ‌రేజ్ ఉంటుంది.

2. 'అర్హ‌త‌లు, క‌వ‌రేజీ'

2. 'అర్హ‌త‌లు, క‌వ‌రేజీ'

ఈ పాల‌సీని 20 నుంచి 65 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు తీసుకోవ‌చ్చు. క‌నీస కాల ప‌రిమితి 10 ఏళ్లు. గ‌రిష్ఠంగా 30 ఏళ్లు. 50 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు ఈ అవ‌కాశం ఎవ‌రైనా ఈ అవ‌కాశం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 65 ఏళ్ల వ్య‌క్తి పాల‌సీ తీసుకుంటే క‌వ‌రేజీ 10 ఏళ్లు ఉంటుంది. 75 ఏళ్ల వ్య‌క్తికి క‌వ‌రేజీ ఉండ‌దు. ఒక‌వేళ 55 ఏళ్ల వ్య‌క్తి పాల‌సీ తీసుకుంటే క‌వ‌రేజీ 20 ఏళ్లు అంటే 75 ఏళ్లు నిండే వ‌ర‌కు ఉంటుంది. ఇక క‌నీస క‌వ‌రేజీ మొత్తం రూ.10 లక్ష‌లు కాగా గ‌రిష్ఠ మొత్తం 50 ల‌క్ష‌ల రూపాయ‌లు.

3. 'ప్రీమియం వివ‌రాలు'

3. 'ప్రీమియం వివ‌రాలు'

ఎంచుకున్న మొత్తాన్ని (స‌మ్ అష్యూర్డ్‌) బ‌ట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తొలి ఐదేళ్ల‌లో ప్రీమియంలో మార్ప‌లుండ‌వు. ఒక‌వేళ క్లెయిమ్స్ అధికంగా ఉంటే ఎల్ఐసీ ఐదేళ్ల త‌ర్వాత ప్రీమియం పెంచ‌వ‌చ్చు. క‌నీస ప్రీమియాన్ని రూ.2,400గా నిర్ణ‌యించారు.

4. 'రెండు ర‌కాలుగా క‌వ‌రేజీ'

4. 'రెండు ర‌కాలుగా క‌వ‌రేజీ'

మొద‌టి ర‌కంలో పాల‌సీ కాలంలో ఇన్షూర్ చేసిన క‌వ‌రేజీ మొత్తం మార‌దు. ఇక రెండో దాంట్లో స‌మ్ అష్యూర్డ్‌ను పెంచుకోవ‌చ్చు. అంటే పాల‌సీ తీసుకున్న మొద‌టి ఏడాది నుంచి ఐదేళ్ల వర‌కు ఎంచుకున్న క‌వ‌రేజీ మొత్తం ఏటా 10 శాతం పెరుగుతుంది. లేదా పాల‌సీ క‌ట్టిన వ్య‌క్త‌కి క్యాన్స‌ర్ వ‌చ్చేంత వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఈ రెండింట్లో ఏది ముందు సంభ‌విస్తే దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తికి క్యాన్స‌ర్ రాలేద‌నుకోండి వారు వ‌రుస‌గా ఐదేళ్లు 10 శాతం పెంచుకుంటూ పోవ‌చ్చు. ఇలా 50 శాతం వ‌ర‌కు మాత్ర‌మే పెంచుతారు. లేదంటే నాలుగో సంవ‌త్స‌రం వ్యాధి సోకితే ఆ త‌ర్వాత పెంచుకోన‌క్క‌ర్లేదు.

5. 'ప్ర‌యోజ‌నాలు'

5. 'ప్ర‌యోజ‌నాలు'

క్యాన్స‌ర్ న‌ష్ట‌భ‌యాన్నిఎదుర్కోవ‌డ‌మే ఈ పాల‌సీ ఉద్దేశం. పాల‌సీ కాలంలో పాల‌సీదారుడికి క్యాన్స‌ర్ సోకితే చికిత్స కోసం క‌వ‌రేజీ మొత్తాన్ని అంద‌జేస్తారు. ఆ కాల ప‌రిమితి దాటితే మాత్రం క‌వ‌రేజీ ఉండ‌దు. మ‌ధ్య‌లో పాల‌సీని వ‌దిలేసే అవ‌కాశం ఉండ‌దు. రాబ‌డి ఉండ‌దు కాబ‌ట్టి ఎలాంటి రుణ స‌దుపాయం ఉండ‌దు.

6. 'తొలి ద‌శ క్యాన్స‌ర్ ష‌ర‌తులు'

6. 'తొలి ద‌శ క్యాన్స‌ర్ ష‌ర‌తులు'

వ్యాధిని తొలి ద‌శ‌లో గుర్తిస్తే 25 శాతం స‌మ్ అష్యూర్డ్ సొమ్ము పాల‌సీ దారుడికి చెల్లిస్తారు. త్వ‌ర‌గా క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే మూడేళ్ల వ‌ర‌కు ప్రీమియం క‌ట్ట‌న‌వ‌స‌రం లేదు. ఆ త‌ర్వాత ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్రీమియం చెల్లించాలి. తొలి ద‌శ‌లో గుర్తించిన త‌ర్వాత మిగ‌తా కాలంలో క‌వ‌రేజీ మ‌లి ద‌శ క్యాన్స‌ర్‌కు మాత్ర‌మే ఉంటుంది. ఇంకో ముఖ్య విష‌యం ఏమిటంటే తొలి ద‌శ క్యాన్స‌ర్‌కు రెండోసారి చికిత్స కోసం చెల్లింపులు చేయ‌రు. అదే విధంగా శ‌రీరంలో మ‌రోచోట క్యాన్స‌ర్ ను గుర్తించినా చెల్లింపులు చేయ‌రు.

7. 'మ‌లి ద‌శ క్యాన్స‌ర్ ష‌ర‌తులు'

7. 'మ‌లి ద‌శ క్యాన్స‌ర్ ష‌ర‌తులు'

వ్యాధిని మ‌లిద‌శ‌లో గుర్తించిన‌ట్ట‌యితే తొలి ద‌శ‌కు సంబంధించిన సొమ్ము చెల్లిస్తే దాన్ని మిన‌హాయించి మిగ‌తా మొత్తాన్ని చెల్లిస్తారు. మ‌లిద‌శ‌లో క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే కాల ప‌రిమితితో సంబంధం లేకుండా స‌మ్ అష్యూర్డ్ మొత్తంతో పాటు అందులో ఒక శాతానికి స‌మానంగా ప్ర‌తి నెలా ప‌దేళ్ల పాటు డ‌బ్బు చెల్లిస్తారు. దుర‌దృష్ట వ‌శాత్తు క్యాన్స‌ర్‌తో పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే నెల‌నెలా చెల్లించే సొమ్మును కుటుంబంలోని నామినీకి చెల్లిస్తారు. క్యాన్స‌ర్‌ను గుర్తించిన త‌ర్వాత ఏడాది ప్రీమియం చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఐతే వేర్వేరు ర‌కాల క్యాన్స‌ర్ సోకితే మాత్రం ఒకదానికే డ‌బ్బులు చెల్లిస్తారు.

 8. 'ప‌న్ను మిన‌హాయింపులు'

8. 'ప‌న్ను మిన‌హాయింపులు'

ఈ క్యాన్స‌ర్ క‌వ‌రేజీ పాల‌సీతో ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80డి ప్ర‌కారం మిన‌హాయింపులు పొందొచ్చు. గ‌రిష్ఠంగా రూ.55,000 వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంది. పాల‌సీకి సంబంధించిన క్లెయిమ్‌లు మాత్రం సెక్ష‌న్ 80సి కింద‌కు రావు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+