For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌నం పెట్టుబ‌డి లాభాల కోసం బిట్ కాయిన్ కొనుగోలు ఎలా చేయాలి?

ఏదేశంలో నైనా చెల్లుబాటు అవుతుంది. ఇది ఇంటర్నెట్ ద్వారా మార్చుకోవచ్చు. లేదా ఫోన్ ద్వారా నైనా మార్చుకోవచ్చు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొనుగోలు చేయ వచ్చు. ఇప్పుడు ఈ కింద బిట్ కాయిన్ కొనుగోలు ఎలా చే

|

బిట్ కాయిన్ల గురించి ఇప్పుడు చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు. అందులో డ‌బ్బు పెడితే లాభం ఉంటుంద‌నే మాట చాలా చోట్ల మీరు వినే ఉంటారు. దాని గురించి ప‌రిపూర్ణంగా అవ‌గాహ‌న ఉండ‌దు. కాని కొనాలని ఉంటుంది. బిట్ కాయిన్ ఆధునిక కాలపు కరెన్సీ. దీనిని అంతర్జాతీయంగా ఎక్కడైనా మార్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో మొత్తంగా ఇదే ఉపయోగ పడుతుంది. ఇది ఊహా ధనం అనవచ్చు. లేదా కనిపించని ధనం. కానీ ఇది అన్ని దేశాల కరెన్సీ లతో మారుబడి అవుతుంది. ఏదేశంలో నైనా చెల్లుబాటు అవుతుంది. ఇది ఇంటర్నెట్ ద్వారా మార్చుకోవచ్చు. లేదా ఫోన్ ద్వారా నైనా మార్చుకోవచ్చు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొనుగోలు చేయ వచ్చు. ఇప్పుడు ఈ కింద బిట్ కాయిన్ కొనుగోలు ఎలా చేయాలో వివ‌రంగా తెలుసుకుందాం.

1. పేరు ఇలా...

1. పేరు ఇలా...

బిట్ కాయిన్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారంటే, కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రపంచం అంతా బిట్లు, బైట్లతోనే నిర్మించబడి ఉంటుంది. అందుకని ఇంటర్నెట్ లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక దానిని బిట్ కాయిన్ అని పేరు పెట్టుకున్నారు.

బిట్ కాయిన్ కి మూలాధారం ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్ వేర్ ను మొదట 2008లో తయారు చేశారు. 2009 లో మరో వ్యక్తి దానిని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మొదటి బిట్ కాయిన్ సృష్టించారు. బిట్ కాయిన్ ను పీర్ టు పీర్ కరెన్సీగా వాడుకలోకి తెచ్చారు. అంటే మధ్యలో ఇంకెవరూ మధ్యవర్తులు లేకుండా నేరుగా అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంది.

 2. అక్ర‌మాల నివార‌ణ‌కు ఈ మార్గం

2. అక్ర‌మాల నివార‌ణ‌కు ఈ మార్గం

బిట్ కాయిన్ మార్పిడిలకు ఏకైక పూచీదారు పబ్లిక్ లెడ్జర్. ప్రతి ఒక్క మార్పిడిని ఇందులో నమోదు చేస్తారు. బిట్ కాయిన్ మార్పిడిలకు ఉద్దేశించిన సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ ను ఉంచుతారు. ప్రతి మార్పిడిని అతి తక్కువ సమయంలో పబ్లిక్ లెడ్జర్ లో నమోదయ్యేలా చూస్తారు. తద్వారా అక్రమాలు జరగకుండా నివారిస్తారు. చెల్లింపులను బిట్ కాయిన్ యూనిట్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ లో రికార్డు చేస్తారు.

 3. ఏ ఒక్క వ్య‌క్తీ నిర్వ‌హించ‌రు

3. ఏ ఒక్క వ్య‌క్తీ నిర్వ‌హించ‌రు

బిట్ కాయిన్ నిర్వహణ ఏ ఒక్క కేంద్రీకృత అథారిటీ కిందా ఉండదు. మార్పిడిలో పాల్గొనేవారే బిట్ కాయిన్ నిర్వాహకులు.

చెల్లింపుల ప్రాసెసెంగ్ పనికి బహుమతిగా కొత్త బిట్ కాయిన్ లను సృష్టిస్తారు. వినియోగదారులు తమ కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెల్లింపుల అధీకృత స్వభావాన్ని నిర్ధారించుకుని పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఇలా చేయడాన్ని మైనింగ్ అంటారు.

 4. నెట్ వ‌ర్క్ నిర్మాణం ఇలా...

4. నెట్ వ‌ర్క్ నిర్మాణం ఇలా...

మైనింగ్ చేసేవారిని మైనర్లు అంటారు. మైనర్లు తమకంటూ సొంత సర్వర్లు నెలకొల్పుకుని బిట్ కాయిన్ సాఫ్ట్ వేర్ ద్వారా నిర్వహణ పనిలో ఉంటారు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. తమ తమ సర్వర్లను ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా బిట్ కాయిన్ నెట్ వర్క్ ను నిర్మించారు. ఈ నెట్ వర్క్ లో తగిన సామర్ధ్యం, సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం, సమయం, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేరవచ్చు.

 5. కొనుగోలు-విక్ర‌యం సంబంధించిన లావాదేవీ జ‌రిగేదిలా

5. కొనుగోలు-విక్ర‌యం సంబంధించిన లావాదేవీ జ‌రిగేదిలా

ఇద్దరు వ్యక్తులు లేదా సంస్ధల మధ్య బిట్ కాయిన్ లలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సంబంధిత అప్లికేషన్ ద్వారా దానిని నెట్ వర్క్ లో ప్రసారం చేస్తారు. బిట్ కాయిన్ సర్వర్లు దీనిని validate చేసి పబ్లిక్ లెడ్జర్ లోకి కాపీ చేస్తాయి. లెడ్జర్ లో పోస్ట్ చేసిన వెంటనే దానిని ఇతర సర్వర్లలోకి కూడా కాపీ అవుతుంది. అంటే సర్వర్లలో ఉండే పబ్లిక్ లెడ్జర్లు ఎప్పటికప్పుడు సింక్ అవుతుంటాయన్న మాట.

 6. బిట్ కాయిన్ కొనుగోలు

6. బిట్ కాయిన్ కొనుగోలు

ప్ర‌స్తుతం బిట్ కాయిన్లు కొనాలంటే ఆన్‌లైన్ ఎక్స్చేంజీల‌ను ఆశ్ర‌యించాలి. దీని కోసం ఆయా ఎక్స్చేంజీల్లో ఒక ఖాతా సృష్టించుకుని, దాన్ని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలి. ఈ ఖాతాయే మ‌నం కొనే బిట్ కాయిన్ల‌ను దాచుకునే వాలెట్. మ‌న అకౌంట్ వెరిఫికేష‌న్ పూర్త‌య్యాక.. స‌రిప‌డే మొత్తాన్ని ఎక్స్చేంజీకి బ‌ద‌లాయిస్తే మ‌న వాలెట్లోకి బిట్ కాయిన్లు వ‌చ్చి చేర‌తాయి. అయితే ఈ వెరిఫికేష‌న్ ప్రక్రియ‌కు సుమారు 10 రోజులు పైగా ప‌డుతోంద‌ని, ఈలోగా బిట్ కాయిన్ మార‌కం విలువ భార‌గీ మారిపోవ‌డం వ‌ల్ల పెట్టుబ‌డి లాభాలు త‌గు స‌మ‌యంలో అందుకోలేమ‌ని ఆరోప‌ణ ఉన్న‌ది. ప్ర‌స్తుతం మ‌న దేశంలో దేనా బ్యాంకు, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు మాత్ర‌మే బిట్ కాయిన్ ఎక్స్చేంజీకి లింకయి ఖాతా లావాదావేలను అనుమ‌తిస్తున్న‌ట్లు కొంత మంది బిట్ కాయ‌న్ ఇన్వెస్ట‌ర్లు చెబుతున్నారు.

English summary

మ‌నం పెట్టుబ‌డి లాభాల కోసం బిట్ కాయిన్ కొనుగోలు ఎలా చేయాలి? | How to buy bitcoin in India

Sign up for Coinbase. This first step is to sign up for a Coinbase account. ...Connect Your Bank Account. After you sign up, connect your bank account. ...Buy and Sell Bitcoin.
Story first published: Monday, January 8, 2018, 13:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X