For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాటింగ్ ద్వారానే డ‌బ్బు బ‌దిలీకి పేటీఎమ్ కొత్త స‌దుపాయం

పేటీఎం ఇన్ బాక్స్ అనే సరికొత్త ఫీచర్ ను తన ఆప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మెసేజింగ్ సర్వీస్ ద్వారా యూజర్లు లావాదేవీలు జరుపుతూనే అదే సమయంలో ఛాట్ చేసే అవకాశం లభిస్తుంది. చాటింగ్ ద్వారా డ‌బ్బు

|

ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సప్' తమ ప్లాట్ ఫార్మ్ లో 'పే' ఫీచర్ ని ప్రవేశపెట్టాలని భావిస్తుండగా, భారత్ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం 'పేటీఎం' పేమెంట్స్ కి అలాగే సోషల్ మెసేజింగ్ కి మధ్యన వారధిగా నిలిచి భారత మార్కెట్ లోని సుస్థిర స్థానాన్ని పొందే ప్రణాళికలు రచిస్తోంది.
ఇదిలా ఉంటే వ్వాట్సాప్ కొన్ని ప్రముఖ భారతీయ బ్యాంకులతో భాగస్వామిగా మారింది. భారత్ లోని ఆయా బ్యాంకులకు సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ విధానం పేటీఎం బిజినెస్ ను అలాగే మరికొన్ని డిజిటల్ పేమెంట్ కంపినీలకు ప్రత్యక్షంగా దెబ్బతీస్తోంది.
ఈ పోటీని తట్టుకునేందుకు పేటీఎం ఇన్ బాక్స్ అనే సరికొత్త ఫీచర్ ను తన ఆప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మెసేజింగ్ సర్వీస్ ద్వారా యూజర్లు లావాదేవీలు జరుపుతూనే అదే సమయంలో ఛాట్ చేసే అవకాశం లభిస్తుంది. చాటింగ్ ద్వారా డ‌బ్బు పంపే స‌దుపాయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

సోషల్ పేమెంట్స్ ట్రెండ్

సోషల్ పేమెంట్స్ ట్రెండ్

టెక్స్టింగ్ అలాగే మీడియా షేరింగ్ వంటి సోషల్ మెసేజింగ్ ఫంక్షనాలిటీస్ అన్నీ ఇన్ బాక్స్ ఫీచర్ లో కలవు. ఈ విధానం దేశంలోనే సోషల్ పేమెంట్స్ ట్రెండ్లో ముఖ్యమైనదిగా భావించవచ్చు.

ఇందులోనున్న ఇంటర్ఫేస్ వివిధ మెసెంజెర్స్ లో ఉండే విధంగానే ఉంటుంది. ఫండ్స్ ని అందుకోవడానికి అలాగే ఫండ్స్ కోసం అభ్యర్ధనలు పంపడానికి (BHIM APP లో లాగా) చాట్ విండోలో ఆప్షన్స్ ఉన్నాయి.

తాజా ఆండ్రోయిడ్ అప్డేట్ లో పే టీఎం ఇన్ బాక్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే ఐఓఎస్ లలో కూడా అందుబాటులోకి రానుంది.

హైక్ త‌ర‌హాలోనే...

హైక్ త‌ర‌హాలోనే...

ఇప్పటికే, యూపీఐతో అనుసంధానమైనటువంటి ఛాట్ అండ్ పే ఫీచర్ హైక్ లో ఉంది. అయితే, దాదాపు 200 మిలియన్ యూజర్ల ఆదరణ కలిగిన పేటీఎంకి భారత్ లోనే సోషల్ పేమెంట్స్ విధానంలో ప్రముఖ స్థానం ఆక్రమించగలిగిన సత్తా కలిగి ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

దేశంలో సోషల్ పేమెంట్స్ ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి.మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ ఫార్మ్ లోకి డిజిటల్ పేమెంట్స్ తో పాటు మెసేజింగ్ ఫంక్షనాలిటీస్ ను మిళితం చేస్తే అవి కచ్చితంగా పేమెంట్స్ విధానంలో పెను సంచలనాన్ని సృష్టించే అవకాశం కలదు.

ఇది ప్రముఖమైన కాన్సెప్ట్

ఇది ప్రముఖమైన కాన్సెప్ట్

సోషల్ పేమెంట్స్ విధానానికి మార్గదర్శకంగా నిలిచిన 'వి చాట్' విధానాలని ని భారత్ లో అనుసరించాలని పేటీఎం భావిస్తోంది. చైనాలో, దాదాపు రెండేళ్ల క్రితం డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం 'అలీ పే' ని 'వి ఛాట్ ఇన్-ఆప్ పే' దడ దడ లాడించిన సంగతి తెలిసిందే.

ఆ విధంగా ఇన్ బాక్స్ ఫీచర్ ని యాప్ లో మిళితం చేస్తూ యూజర్లకు మరింత వెసులుబాటు కలిపించేందుకు పేటీఎం సిద్ధమైంది. వ్యాపారాలు ఆఫర్స్ ని ప్రకటించడానికి అలాగే ఆర్డర్ స్టేటస్ ని తమ కస్టమర్లకు నిజ సమయంలో తెలియచేయడానికి 'పేటీఎం' ఇన్ బాక్స్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే పేటీఎంకు అత్యధిక సెల్లెర్ బేస్ కలదు. అలాగే, పేటీఎం మాల్ అనేది దేశంలోనే అతి పెద్ద ఈ కామర్స్ కంపినీలలో ఒకటి.

తమ ప్లాట్ ఫార్మ్ లో వాణిజ్యపరంగా కమ్యూనికేట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ అందించింది. పేటీఎం కూడా ఇటువంటి కాన్సెప్ట్ నే క్రాస్ ప్లాట్ఫార్మ్ మోడల్ లో ప్రయత్నించవచ్చు.

అలాగే, యూజర్లకు 'డిలీట్ టెక్స్ట్' అనే ఆప్షన్ కూడా 'ఇన్ బాక్స్' ఫీచర్ లో కలదు. ఈ ఫీచర్ వాట్సప్ లోనున్న 'డిలీట్ ఫర్ ఆల్' అనే ఆప్షన్ ను పోలి ఉంటుంది.

 భ‌ద్ర‌తకు భ‌రోసా

భ‌ద్ర‌తకు భ‌రోసా

మెరుగైన భద్రత కోసం పేటీఎంలోని మెసేజింగ్ ప్లాట్ఫార్మ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చేయబడి ఉంటుంది. ప్రయివేట్ గా ఛాట్ చేసుకునే సౌలభ్యం యూజర్లకు కలదు. అలాగే గ్రూప్స్ ని కూడా క్రియేట్ చేసుకునే సౌలభ్యం ఉంది. మీడియా ని షేర్ చేయవచ్చు, అలాగే కెమెరాతో లైవ్ లో ఇన్స్టెంట్ షేరింగ్ చేయవచ్చు. అలాగే ఇమేజెస్ ని కూడా ఇన్స్టెంట్ గా షేర్ చేయవచ్చు.

ఈ-కామర్స్ ని, సోషల్ మెసేజింగ్ ని అలాగే పేమెంట్స్ ని మిళితం చేయడమే పేటీఎం యొక్క సక్సెస్ ఫార్ములాగా భావించవచ్చు.

యూపీఐ అనుసంధానంగా పేమెంట్ సేవలని అందిస్తున్న వాట్సాప్ కి పేటీఎం 'ఇన్ బాక్స్' ఫీచర్ గట్టి పోటీనే ఇస్తుందని పరిశీలకుల అభిప్రాయం. అయితే, అసలేం జరుగుతుందో తెలియాలంటే కాస్త వేచి చూడాలి.

Read more about: paytm money
English summary

చాటింగ్ ద్వారానే డ‌బ్బు బ‌దిలీకి పేటీఎమ్ కొత్త స‌దుపాయం | Paytm Inbox Launched – Now Make Payments While You Chat!

WhatsApp has partnered with some of the leading Indian banks and UPI for their payments feature in India. It is directly hitting Paytm’s business as well as other digital payments companies.To combat the thrust, Paytm has introduced a new ‘Inbox’ feature in their app. It is a messaging service which will allows its users to chat and transact simultaneously.
Story first published: Friday, December 8, 2017, 12:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X