ఓలా మనీ యాప్‌లో ఉండే సేవలు సైతం టీసవారీలో వాడే విధంగా మార్పు చేశారు. ఈ రెండు సంస్థల భాగస్వామ్యం కారణంగా ప్రయాణికులు మెట్రో స్మార్ట్ కార్డులను ఓలా మనీతో రీచార్జీ చేసుకునే సదుపాయాన్ని కల్పించ
మెట్రో రైలు ప్రయాణికులకు మరింత సుఖవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఓలా క్యాబ్స్‌తో ఎల్ అండ్ మెట్రో రైలు జట్టుకట్టింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారిక యాప్ టీసవారీ ఓలా సర్వీసెస్‌తో అనుసంధానం అయింది. ఇందులో భాగంగా ఓలా మనీ యాప్‌లో ఉండే సేవలు సైతం టీసవారీలో వాడే విధంగా మార్పు చేశారు. ఈ రెండు సంస్థల భాగస్వామ్యం కారణంగా ప్రయాణికులు మెట్రో స్మార్ట్ కార్డులను ఓలా మనీతో రీచార్జీ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ పరిణామానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఓలాతో జట్టు కట్టడం వల్ల ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు
ప్రయాణికులు ఓలా మనీ వాలెట్ సాయంతో టీసవారీ యాప్‌లో ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు.
టీసవారీ యాప్ నుంచే ఓలా క్యాబ్ లేదా ఓలా ఆటోను బుక్ చేసుకోవచ్చు.
స్టేషన్లలో ఉండే ఓలా కియోస్క్ ద్వారా సైతం ఓలా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.
కస్టమర్లకు సంబంధించి పిక్ అప్, డ్రాప్ పాయింట్లుగా ఓలా జోన్లు ఏర్పాటు అవుతాయి. వచ్చే కాలంలో ఇవి కీలకమవుతాయి.

ఓలా ప్రతినిధి మాట
ప్రజా రవాణా సాధనాలైన బస్సు స్టేషన్,రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టు, మెట్రో స్టేషన్లతో ఓలా మొబిలిటీ సొల్యూషన్లను జత చేస్తున్నారు.
ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం కూడా అదే వరుసలోనే అని ఓలా అలియెన్సెస్ డైరెక్టర్ సౌరభ్ మిశ్రా చెప్పారు.
దీని ద్వారా చివరి వరకూ ప్రయాణికుడి గమ్యానికి ఓలా మార్గం చూపినట్లు అవుతుంది.
లక్షల మంది మెట్రో ప్రయాణికులకు ఓలా చేరువయ్యేందుకు ఇది బాటలు వేస్తుంది

ఎల్ అండ్ టీ మెట్రో సీఈవో చెబుతున్నదిదే
హైదరాబాద్ నగరంలో 30 కి.మీ మెట్రో ద్వారా ఇప్పటికే రోజుకు 2.4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
మొదటి దశలో భాగంగా నాగోలు నుంచి మియాపూర్ వరకూ ప్రయాణికులు కాలుష్య రహిత, తక్కువ ధరల్లో సుఖమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.
ఓలా సంస్థతో భాగస్వామ్యం కారణంగా మెట్రో స్టేషన్ల నుంచి గమ్య స్థానాలకు, ఇల్లు, కార్యాలయాల నుంచి మెట్రో స్టేషన్ల వరకూ ఇబ్బంది లేకుండా ప్రయాణాలు సాగించవచ్చు

పట్టణాల్లో ఓలా సరికొత్త ప్రయత్నాలు
దేశీయ ప్రయాణాల్లో సరికొత్త ఓరవడిని సృష్టించేందుకు సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
ఇందులో భాగంగానే గతంలో ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల వద్ద ఓలా కియోస్క్‌లను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం మెట్రో రైలు మార్గాన్ని టార్గెట్ చేస్తూ ఓలా అందిస్తున్న సౌకర్యాన్ని వినియోగదారులు వాడుకోవడం ద్వారా వేగవంతమైన, సురక్షిత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుంచి మరో శాఖకు మార్చుకోవడం ఎలా?
ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుంచి మరో శాఖకు మార్చుకోవడం ఎలా?

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కు తెచ్చుకోవడం ఎలా?

ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా రూ.10 లక్షల వరకూ బ్యాంకు రుణం
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications