For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారు మృతిచెందితే..... సొమ్మును క్లెయిం చేసుకోవడం ఎలా?

మృతిచెందిన వ్యక్తి పేరిట మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి ఉన్నట్టయితే అందులోని సొమ్మును క్లెయిం చేయించడంలో నామినీ, హ‌క్కుదారు వార‌సులు కాకుండా వారి బంధువులు వారికి సాయ‌ప‌డొచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ మృతిదారు స

|

మన ఆప్తులు మనల్ని వీడి వెళితే ఆ వ్యథ వర్ణించరానిది. ఇలాంటి సమయంలోనే గుండె దిటవు చేసుకొని లేని వారి లోటును పూడ్చేందుకు కొంతైనా ప్రయత్నించాలి. అదే మనం వారికి అర్పించే గొప్ప నివాళి. మానసికంగా ధైర్యాన్ని అందించడంతోపాటు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు ఎన్నో అవకాశాలుంటాయి.
మృతిచెందిన వ్యక్తి పేరిట మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి ఉన్నట్టయితే అందులోని సొమ్మును క్లెయిం చేయించడంలో నామినీ, హ‌క్కుదారు వార‌సులు కాకుండా వారి బంధువులు వారికి సాయ‌ప‌డొచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ మృతిదారు సొమ్మును త‌ద‌నంత‌రం ఎలా క్లెయిం చేసుకోవాలో ఇక్క‌డ తెలుసుకుందాం.

నామినేషన్‌ చేసినట్టయితే...

నామినేషన్‌ చేసినట్టయితే...

* మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు ఒక్కరి పేరిటే ఉండి ఆ వ్యక్తి నామినీని నియమించినట్టయితే... సదరు నామినీ ఫండ్‌ సొమ్మును క్లెయిం చేసుకోవచ్చు లేదా తన ఖాతాలోకి బదిలీ చేయించుకోవచ్చు.

* క్లెయిం చేసుకునేందుకు నిర్ణీత పద్ధతిలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు లేఖ రాయాల్సి ఉంటుంది. ఈ లేఖతో పాటు జతచేయాల్సిన కొన్ని ముఖ్యమైన పత్రాలు.....

2.ముఖ్య‌మైన డాక్యుమెంట్లు

2.ముఖ్య‌మైన డాక్యుమెంట్లు

  • పెట్టుబడిదారు ఒరిజినల్‌ మరణ ధ్రువీకరణ పత్రం
  • ఒరిజినల్‌ పత్రం లేనట్టయితే నోటరీ చేయించిన నకలు ధ్రువీకరణ పత్రం లేదా కాపీపై గెజిటెడ్‌ ఉద్యోగి లేదా
  • బ్యాంకు మేనేజర్‌ సంతకం చేసి ఉండాలి.
  • నిర్ణీత విధానంలో రూపొందించి బ్యాంకు మేనేజర్‌ సంతకం చేసిన నామినీ బ్యాంకు ఖాతా వివరాల పత్రం
  • నామినీ పేరిట ఉన్న క్యాన్సిల్‌ చేసిన చెక్కు
  • నామినీ కేవైసీ ధ్రువీకరణ పత్రం
  • నామినీ మైనర్‌ అయినట్టయితే అదనంగా కొన్ని పత్రాలు జతచేయాలి. అవి మైనర్‌ జనన ధ్రువీకరణ పత్రం,
  • సంరక్షకుడి లేఖ
  • 3.నామినేషన్‌ లేనట్టయితే....

    3.నామినేషన్‌ లేనట్టయితే....

    • మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు ఒక్కరి పేరిటే ఉండి ఆ వ్యక్తి నామినీని నియమించకపోతే.. క్లెయిం క్లిష్టతరం అయ్యేందుకు అవకాశం ఉంది. పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలతోపాటు అదనంగా మరిన్ని రుజువులు సమర్పించాల్సి ఉంటుంది.
    • చట్టబద్ధ వారసుల నుంచి స్టాంపు కాగితంపై రాసిన ఇండెమ్నిటీ బాండు
    • చట్టబద్ధ వారసుల నుంచి స్టాంపు కాగితంపై అఫిడవిట్‌
    • క్లెయిం చేసుకునే చట్టబద్ధ వారసుల గుర్తింపు, చిరునామా పత్రాలు, బ్యాంకు వివరాలు
    •  4.ఉమ్మడి ఖాతా విషయంలో...

      4.ఉమ్మడి ఖాతా విషయంలో...

      * మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు సాధారణంగా ముగ్గురు వ్యక్తుల వరకూ ఉమ్మడి ఖాతాదారులుగా ఉండేందుకు అనుమతిస్తాయి. కుటుంబ సభ్యుల్లో భార్య, భర్త ఇద్దరూ కలిసి ఉమ్మడి ఖాతా తెరవడం వల్ల అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ లావాదేవీలు ఒకేసారి జరపే ప్రయోజనం ఉంటుంది. ఉమ్మడి ఖాతాదారుల్లో అనుకోకుండా ఎవరికైనా ఏదైనా జరిగితే మిగిలిన సభ్యులు మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను సులభంగా నిర్వహించే వీలుంటుంది.

      5. క్లెయిం చేసే వారిని బ‌ట్టి వివిధ సంద‌ర్భాలు

      5. క్లెయిం చేసే వారిని బ‌ట్టి వివిధ సంద‌ర్భాలు

      * మ్యూచువల్‌ ఫండ్‌ ఉమ్మడి ఖాతాలోని సొమ్మును క్లెయిం చేసుకునేవారు భిన్న సందర్భాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది.

      ప్రధాన ఖాతాదారు మృతిచెందితే...

      * ఉమ్మడి ఖాతా నిర్వహించే మిగతా సభ్యులు ఫండ్‌ సంస్థకు నిర్ణీత విధానంలో లేఖ రాయాల్సి ఉంటుంది.

      * ప్రధాన ఖాతాదారుడి ఒరిజినల్‌ మరణ ధ్రువీకరణ పత్రం

      * ఒరిజినల్‌ ధ్రువీకరణ లేనట్టయితే నోటరీ చేయించిన/గెజిటెడ్‌ సంతకం ఉన్న/బ్యాంకు మేనేజర్‌ సంతకంచేసిన నకలు

      * తదుపరి ఖాతాదారుడి చిరునామా, పాన్‌ సంఖ్య, బ్యాంకు వివరాలు

      * మిగతా ఖాతాదారుల కేవైసీ పత్రాలు

      6.మిగిలిన వారి విషయంలో...

      6.మిగిలిన వారి విషయంలో...

      * ఉమ్మడి ఖాతాల విషయంలో ప్రధాన ఖాతాదారు కాకుండా వేరే వ్యక్తి మృతిచెందితే... మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు ప్రధాన ఖాతాదారు పేరిట కొనసాగుతాయి.

      * కావాలంటే ప్రధాన ఖాతాదారు వేరే వ్యక్తిని ఉమ్మడి సభ్యుడిగా నియమించవచ్చు. ఇందుకోసం సమర్పించాల్సి పత్రాలు......

      ** ఉమ్మడి ఖాతాదారులో ఒకరు మృతిచెందినట్టు పేర్కొంటూ ఇతర సభ్యులు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు రాసే

      లేఖ

      * ఉమ్మడి ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం

      * కొత్త ఖాతాదారును నియమిస్తే ఆ వ్యక్తి పేరు, పాన్‌ సంఖ్య, బ్యాంకు వివరాలు

      *కొత్త ఖాతాదారుడి కేవైసీ పత్రం

       ముగింపు

      ముగింపు

      7. పైన పేర్కొన్న వివిధ సందర్భాలను బట్టి క్లెయిం చేసుకోదలిచే వ్యక్తులు ఆయా పత్రాలు, త‌గిన ఆధారాల‌ను సిద్దంగా ఉంచుకోవాలి. వాటిని క్లెయిం ఫారంతో పాటు క్రమపద్ధతిలో అమర్చి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు నేరుగా అందించవచ్చు. అలా కుదరని పక్షంలో ఏజెంటు ద్వారానో లేదా క్లెయిం ఫారంలను స్వీకరించే కేంద్రాల వద్ద అయినా సమర్పించేందుకు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు వెసులుబాటు కల్పిస్తున్నాయి.

      వివరాలన్నీ పరిశీలించి ... ఖాతాలోని మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను లెక్కించి, అప్పటి నికర ఆదాయ విలువను బట్టి మొత్తం సొమ్మును క్లెయిం చేసిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమచేస్తారు లేదా చెక్కు రూపంలో అందజేస్తారు.

Read more about: mutual funds investments
English summary

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారు మృతిచెందితే..... సొమ్మును క్లెయిం చేసుకోవడం ఎలా? | IF mutual fund holder dies, what to do? how to claim the money

Did you know that you can transfer your mutual fund (MF) units to another person, but most MFs don’t allow it? However, if the first holder dies, units can then be transferred to the surviving joint holders or to the nominee after some paperwork.
Story first published: Saturday, December 23, 2017, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X