For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ మ‌నీ బ్యాక్ పాల‌సీ ప్ర‌ధాన ఫీచ‌ర్లు,ప్ర‌యోజ‌నాలు ఏమిటి?

మ‌నీ బ్యాక్ పాల‌సీ విష‌యంలో ప్రతి ఐదేళ్లకోసారి 5వేల చొప్పున వెనక్కి ఇస్తూ గడువు తీరిన తర్వాత మిగిలిన రాబడి ఎంతుంటే అంత మొత్తాన్ని ఏకమొత్తంలో కంపెనీలు చెల్లిస్తాయి. ఈ విధ‌మైన పాల‌సీల్లో ఎస్బీఐ లైఫ్ ఎక్

|

ఎండోమెంట్ పాలసీల్లోనే మనీబ్యాక్ పాలసీలు కూడా ఉన్నాయి. మామూలు ఎండోమెంట్ పాలసీకి మనీ బ్యాక్ పాలసీకి మధ్య ఉన్న తేడా ఏమిటంటే.. బీమా రక్షణ, బోనస్ లతో పాటు పాలసీ వ్యవధి మధ్యలో కొంత మొత్తం ప్రతిఫలాన్ని ఇస్తూ వెళతాయి. ఉదాహరణకు 20 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి 50వేల రూపాయల పాలసీ తీసుకున్నాడనుకుందాం. ప్రతి ఐదేళ్లకోసారి పది వేల రూపాయలు చొప్పున వెనక్కి వస్తాయి. లేదా ప్రతి ఐదేళ్లకోసారి 5వేల చొప్పున వెనక్కి ఇస్తూ గడువు తీరిన తర్వాత మిగిలిన రాబడి ఎంతుంటే అంత మొత్తాన్ని ఏకమొత్తంలో కంపెనీలు చెల్లిస్తాయి. ఈ విధ‌మైన పాల‌సీల్లో ఎస్బీఐ లైఫ్ ఎక్కువ‌గా మ‌నీ బ్యాక్ పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెడుతూ ఉంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎస్‌బీఐ స్మార్ట్ మ‌నీ బ్యాక్ గోల్డ్ పాల‌సీ గురించి తెలుసుకుందాం.

పాల‌సీ అర్హ‌త‌-అన‌ర్హ‌తలు

పాల‌సీ అర్హ‌త‌-అన‌ర్హ‌తలు

క‌నీసం 27 ఏళ్ల వ‌య‌సు ఉంటేనే పాల‌సీ కొన‌గ‌లుగుతారు.

గ‌రిష్ట వ‌య‌సు 70 దాటితే పాల‌సీ తీసుకోలేరు.

 ప్రీమియం చెల్లింపు

ప్రీమియం చెల్లింపు

ఏ పాల‌సీక‌యినా వార్షిక చెల్లింపు చేసేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇంకా నెల‌వారీ, త్రైమాసికం, ఆరు నెల‌ల‌కొక‌సారి, ఏడాదికోసారి ప్రీమియం చెల్లించేలా పాల‌సీ సౌల‌భ్యం ఉంటుంది.

3. బీమా హామీ మొత్తం

3. బీమా హామీ మొత్తం

మీరు తీసుకున్న పాల‌సీ ఆప్ష‌న్ ఆధారంగా బీమా హామీ మొత్తం మారుతుంది.

బీమా హామీ మొత్తం క‌నీసం రూ.75,000 మొద‌లుకొని గరిష్టంగా ఎంతైనా ఉండొచ్చు.

4. పాల‌సీ కాల‌ప‌రిమితి

4. పాల‌సీ కాల‌ప‌రిమితి

ట‌ర్మ్ పాల‌సీలు సాధార‌ణంగా 30 నుంచి 35 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధిలో వ‌స్తాయి.

అదే మ‌నీ బ్యాక్ పాల‌సీల‌ను కాస్త త‌క్కువ వ్య‌వ‌ధికి సైతం కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఎస్బీఐ లైఫ్‌కు సంబంధించిన ఈ పాల‌సీలో 12,15,20,25 ఏళ్ల ట‌ర్మ్ ఎంచుకునేలా ఉంది.

5. అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు

5. అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు

పాల‌సీతో పాటు ఈ ర‌క‌మైన ప్ర‌యోజ‌నాలు ఎస్బీఐ లైఫ్ మీకు క‌ల్పిస్తోంది

ప్ర‌ధాన పాల‌సీతో పాటు ఇంకా అద‌న‌పు రైడ‌ర్ల‌ను తీసుకోవ‌చ్చు.

కేవ‌లం జీవితానికి ర‌క్ష‌ణ కాకుండా ఇంకా అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు ఈ రైడ‌ర్ల వ‌ల్ల క‌లుగుతాయి.

ఎస్‌బీఐ లైఫ్‌- ప్రిఫ‌ర్డ్ ట‌ర్మ్ రైడ‌ర్

ఎస్‌బీఐ లైఫ్‌- యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్ రైడ‌ర్

ఎస్‌బీఐ లైఫ్‌- యాక్సిడెంట‌ల్ టోట‌ల్ అండ్ ప‌ర్మినెంట్ డిసెబిలిటీ బెనిఫిట్ రైడ‌ర్

ఎస్‌బీఐ లైఫ్‌- క్రిటి కేర్ 13 నాన్ లింక్ డ్ రైడ‌ర్

6. ఏ కంపెనీ అయినా పాల‌సీ వ‌ర్తింపు ఎలా జ‌రుగుతుంది?

6. ఏ కంపెనీ అయినా పాల‌సీ వ‌ర్తింపు ఎలా జ‌రుగుతుంది?

20 ఏళ్ల వ్యక్తి 31 ఏళ్ల వయసులో మరణించిన సందర్భాల్లో ఈ పదకొండేళ్ల కాలంలో రెండు సార్లు నగదు వెనక్కి వచ్చి ఉంటుంది. మరణం సమయంలో బీమా మొత్తం 50వేలతోపాటు అదనంగా బోనస్ ల వంటి ప్రతిఫలం ఉంటే చెల్లించేస్తాయి. బీమా రక్షణతోపాటు మధ్య మధ్యలో అవసరాలకు నగదు కోరుకునేవారికి ఇవి సరిపోతాయి. పిల్లల విద్యావసరాలు ఇతరత్రా ఖర్చులన్నమాట. అయితే సాధారణ ఎండోమెంట్ పాలసీల కంటే కొంచెం ఎక్కువ ప్రీమియం ఉంటుంది. వీటిలోనూ రైడర్లు జోడించుకునే సదుపాయం ఉంది. హెడ్ డీఎఫ్ సీ లైఫ్ కంపెనీ అయితే మనీ బ్యాక్ పాలసీలకు క్రిటికల్ ఇల్ నెస్ రైడర్, అడిషినల్ టర్మ్ బెనిఫిట్, యాక్సిడెంటల్ బెనిఫిట్, ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్లను అందిస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మనీ బ్యాక్ పాలసీల్లో ప్రతిఫలం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కంటే తక్కువగా ఉంటుంది.

 7. డిస్ క్లెయిమ‌ర్

7. డిస్ క్లెయిమ‌ర్

పాల‌సీ ప్ర‌యోజ‌నాలు కంపెనీ నియ‌మ‌,నిబంధ‌న‌ల అనుసారం వ‌ర్తిస్తాయి.

పాల‌సీ కొనుగోలు చేసిన తర్వాత దాని వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు, లాభ‌,న‌ష్టాల‌తో ఈ వెబ్‌సైట్కు, ర‌చ‌యిత‌కు ఎటువంటి సంబంధం లేదు. అన్ని విష‌యాలు బేరీజు వేసుకున్న త‌ర్వాత పాల‌సీ కొనుగోలు చేయాల్సిందిగా సూచించ‌డ‌మైన‌ది.

పాల‌సీ వ‌ల్ల వ‌చ్చే న‌ష్టాల‌కు కానీ, బీమా కంపెనీ వ‌ల్ల త‌లెత్తే ఇబ్బందుల‌కు గుడ్ రిట‌ర్న్స్, వ‌న్ ఇండియా, గ్రేనియ‌మ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాజ‌మాన్యం ఎటువంటి బాధ్య‌త వ‌హించ‌దు.

Read more about: sbi life policy money back
English summary

ఎస్‌బీఐ మ‌నీ బ్యాక్ పాల‌సీ ప్ర‌ధాన ఫీచ‌ర్లు,ప్ర‌యోజ‌నాలు ఏమిటి? | features of sbi smart money back gold

Are you worried about meeting various financial obligations in the years to come? Do you wish to safeguard your family’s future?Invest in SBI Life – Smart Money Back Gold, a participating traditional money back insurance plan, and avail twin benefits of life cover as well as periodic income to meet your financial requirements at crucial points in life.
Story first published: Friday, December 29, 2017, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X