మొదట అన్ని ఉచితం అంటూనే క్రెడిట్ కార్డులు నెమ్మదిగా చార్జీల బాదుడు మొదలెడతాయి. ఈ క్రమంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి ఉండే వివిధ రుసుముల గురించి తెలుసుకుందాం.
డిజిటల్ చెల్లింపుల ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కార్డుల వాడకం అంత వేగంగా పెరగలేదు. అయితే నోట్ల రద్దు తర్వాత నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల,కార్డుల వాడకం కాస్త ఎక్కువైంది. దీంతో చాలా చోట్ల షాపింగ్‌ల కోసం కార్డులను వాడే వారి సంఖ్య ఎక్కువైంది. మొదట డెబిట్ కార్డులు కలిగిన వారు సైతం మళ్లీ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. అవసరమైన చోట క్రెడిట్ కార్డు తరచూ వాడటానికి సైతం వెనుకాడటం లేదు. మొదట అన్ని ఉచితం అంటూనే క్రెడిట్ కార్డులు నెమ్మదిగా చార్జీల బాదుడు మొదలెడతాయి. ఈ క్రమంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి ఉండే వివిధ రుసుముల గురించి తెలుసుకుందాం.

ప్రారంభ రుసుము:
క్రెడిట్ కార్డు జారీ చేసే సమయంలో విధించే రుసుము. మీ క్రెడిట్ కార్డు దరఖాస్తు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలైన వాటికి కంపెనీకి కొంచెం ఖర్చవుతుంది. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు దీన్ని వినియోగదారు నుంచే వసూలు చేస్తాయి.

వార్షిక నిర్వహణకై:
ముందుగా నిర్ణయించిన ప్రకారం సంవత్సరానికి కొంత రుసుము చెల్లించాలి. చాలా బ్యాంకులు ఉచిత క్రెడిట్ కార్డు అంటూ ఊరిస్తాయి. దీనర్థం ఏంటంటే ఏడాది పాటు జాయినింగ్ ఫీజు, వార్షిక నిర్వహణ రుసుముల్లాంటివి ఉండవు. తర్వాత రెండో ఏడాది నుంచి వార్షిక నిర్వహణ రుసుము కట్టాల్సిందే. దీన్ని మొదట్లోనే తెలుసుకోవాలి.

డూప్లికేట్ స్టేట్‌మెంట్ పొందినందుకు:
ఇంటికి స్టేట్‌మెంట్ తెప్పించుకున్నందుకు వసూలు చేసే రుసుమునే డూప్లికేట్ స్టేట్ మెంట్ ఫీజు అంటారు. సాధారణంగా మీరు ఇచ్చిన చిరునామాకు లేదా మెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్లను నెలవారీ పంపుతారు. పోస్టల్ అడ్రస్‌కు ఒకసారే ఉచితంగా స్టేట్ మెంట్ పంపుతారు. అది కాకుండా అదనంగా డూప్లికేట్ స్టేట్ మెంట్ అడిగారో దానికి రుసుము చెల్లించాల్సిందే.

4. ఆలస్య చెల్లింపులపై:
నిర్ణీత గడువులోగా చెల్లించని వాటికి ఆలస్య చెల్లింపు రుసుములను పెనాల్టీగా విధిస్తారు. సాధారణ వడ్డీలతో సంబంధం లేకుండా ఇది నిర్ణీత మొత్తంలో ఉంటుంది. రూ.500 నుంచి రూ.20 వేల మధ్య అయితే అదనంగా ఆలస్య చెల్లింపు రుసుముల రూపంలో రూ.100 నుంచి రూ.600 వరకూ చెల్లించాలి. ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.

5.నగదు తీసుకున్నందుకు:
ఏటీఎమ్‌ల నుంచి నగదు తీసుకుని వాడుకున్నందుకు చెల్లించే రుసుము
పరిమితికి మించి వాడుకున్నందుకు కొంత రుసుము చెల్లించాల్సిందే. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు మాత్రమే ఈ సేవను ఉచితంగా వాడుకునేందుకు అనుమతిస్తున్నాయి. దాదాపు అన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు ఏటీఎమ్ నుంచి నగదు తీసుకుంటే క్రెడిట్ కార్డుదారులపై రుసుముల భారం వేస్తున్నాయి.
ప్రతి క్రెడిట్ కార్డుకు పరిమితి ఉంటుంది. పరిమితికి మించి వాడుకుంటే అందుకు ప్రత్యేకమైన రుసుములను విధిస్తారు.

6. సేవా రుసుము:
క్రెడిట్ పరిమితి, వడ్డీ, ఇతర రుసుములన్నింటినీ కలుపుకుని వాటి మీద సేవా రుసుము ఉంటుంది.

7.ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తే:
మనం కార్డు తీసుకున్నప్పుడు ఏమో మీరు విదేశాల్లో సైతం ఈ క్రెడిట్ కార్డు వాడుకోవచ్చని చెబుతారు. విదేశాల్లో కార్డును వాడుకున్నందుకు చెల్లించే రుసుము గురించి చెప్పరు. ఈ విషయంలో కంపెనీ వాళ్లకు కాల్ చేసి కార్డు వాడేముందు స్పష్టత తీసుకుంటే మంచిది.

8. కార్డు రీప్లేస్‌మెంట్ కోసం
కంపెనీల్లో ఐడీ కార్డులు పోగొట్టుకుంటేనే కొత్త కార్డు ఇవ్వడానికి కంపెనీలు జీతంలో కోత వేస్తాయి. అలాంటిది క్రెడిట్ కార్డు పోగొట్టుకుపోతే చాలా కష్టం. కార్డు పోగొట్టుకుని మళ్లీ కార్డు కోసం అభ్యర్థించేందుకు కార్డు రీప్లేస్‌మెంట్ ఫీ కట్టాలి. ఒకవేళ కార్డు పాడైపోయి సరిగా పనిచేయకపోతే కొత్త కార్డు తీసుకునేందుకు సైతం డబ్బు చెల్లించాలి. ఇందుకోసం రూ.250 నుంచి రూ.300 వరకూ రుసుము ఉంటుంది

ప్రీమియం చెల్లించనందుకు బీమా పాలసీ రద్దయిందా... ఏం చేయాలి?

అప్పు తీసుకున్నారు.. తిరిగి కట్టకపోతే ఏమవుతుంది?
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications