చెల్లింపులకు నగదు వాడకం ఇష్టంలేని చాలా మంది డెబిట్,క్రెడిట్ కార్డుల సాయంతోనే చెల్లింపులు చేస్తున్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆఫర్లు ఆన్‌లైన్ పేమెంట్ సైట్లు క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగ
ఒకప్పుడు ధనవంతులు మాత్రమే ఆసక్తి చూపుతున్న క్రెడిట్ కార్డుల వాడకం ప్రస్తుతం మధ్యతరగతిలో సైతం ఎక్కువైపోయింది. చెల్లింపులకు నగదు వాడకం ఇష్టంలేని చాలా మంది డెబిట్,క్రెడిట్ కార్డుల సాయంతోనే చెల్లింపులు చేస్తున్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆఫర్లు ఆన్‌లైన్ పేమెంట్ సైట్లు క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లకు, చేసే చెల్లింపులకు ఆఫర్లు, రాయితీలు కల్పిస్తుండటంతో క్రెడిట్ కార్డు వాడకం సాధారణమైపోయింది. అయితే చిన్న విషయాల్లో జాగ్రత్తలు ముఖ్యం. ఇప్పుడు ప్రతి కంపెనీ రివార్డు పాయింట్లు ఇస్తోంది. వార్షిక రుసుము, రివార్డు పాయింట్ల పరంగా ప్రస్తుతం ఐదు ఉత్తమ క్రెడిట్ కార్డులేవో తెలుసుకుందాం.

1)ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు కార్డ్
షాపింగ్ బాగా ఇష్ట పడే వారికి ఇదే సరైన కార్డు
మొదటి ఏడాది వార్షిక రుసుము రూ. 499 కాగా, 2000 బోనస్ పాయింట్ల ద్వారా రూ. 500 విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ వోచర్ వస్తుంది.
పెట్రోలు, డీజిల్ సంబంధించి రూ.499 కంటే ఎక్కువ బిల్లు అయితే సర్‌చార్జీ ఉండదు.
ఈ కార్డుకు రెన్యువల్ ఫీజు ప్రతి ఏటా రూ.499 ఉంటుంది. ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ షాపింగ్ చేసిన వారికి రూ.499 వెనక్కు ఇస్తారు.
అమెజాన్, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఫుడ్ పాండా, అర్బన్ క్లాప్, జూమ్ కార్ వంటి వాటిల్లో షాపింగ్ చేస్తే 10 రివార్డు పాయింట్లు.
కార్డుకు సంబంధించిన మరింత సమాచారం, కార్డు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2) ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినమ్ చిప్ క్రెడిట్ కార్డ్
ఈ కార్డు పొందాలనుకునే వారు బ్యాంకు ఖాతాలో కనీసం రూ.20 వేల ఎఫ్‌డీ చేయాలి.
ఈ కార్డుకు సంబంధించి ఎటువంటి వార్షిక రుసుములు ఉండవు.
జాయినింగ్ ఫీజు మాత్రం రూ.199తో కలిపి సేవా పన్ను వసూలు చేస్తారు.
హెచ్‌పీసీఎల్ బంకుల్లో చేసే ఇంధన కొనుగోళ్లకు సర్‌చార్జ్ రాయితీ లాంటివి పొందే వీలుంది.
బుక్‌మైషోలో 2 సినిమా టిక్కెట్లపైన రూ. 100 వరకూ తగ్గింపు ఉంటుంది.
ఎంపిక చేసిన రెస్టారెంట్లలో క్యులినరీ ట్రీట్స్ కోసం 15% వరకూ రాయితీలు పొందే అవకాశం ఉంటుంది.
కార్డు తీసుకున్న మొదటి 60 రోజుల్లో షాపింగ్ రూ.2వేలకు మించితే జాయినింగ్ పీజు ఉండదు.
కార్డుకు సంబంధించిన మరింత సమాచారం, కార్డు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

3) సిటీ బ్యాంకు క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు
ఈ కార్డు తీసుకునే వారికి వార్షిక రుసుము రూ.500
ఆఫర్లు:
సినిమా టిక్కెట్ల పైన 5% క్యాష్ బ్యాక్
ఫోన్ బిల్లుల పైన 5% క్యాష్ బ్యాక్
యుటిలిటీ బిల్లు చెల్లింపులకు సంబంధించి 5% క్యాష్ బ్యాక్
ఎక్కువ ఖర్చు పెట్టేవారికి 0.5% క్యాష్ బ్యాక్ అదనంగా ఇస్తారు.
సిటీ బ్యాంకు అనుబంధ రెస్టారెంట్లలో 15% పొదుపు చేసుకోవచ్చు.
కార్డుకు సంబంధించిన మరింత సమాచారం, కార్డు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెగాలియా క్రెడిట్ కార్డ్
ఈ కార్డు వార్షిక రుసుము రూ.2500
మొదటి 90 రోజుల్లో రూ.40 వేల వరకూ ఖర్చు పెడితే వార్షిక రుసుము ఉండదు.
ఈ కార్డు పొందేందుకు వేతన ఉద్యోగులకు కనీస వయసు 21, స్వయం ఉపాధి కలిగిన వారికి 21 ఉండాలి.
వేతన ఉద్యోగులకు అయితే వార్షిక ఆదాయం రూ.1,20,000 ఉండాలి.
స్వయం ఉపాధి కలిగిన వారికి వార్షికాదాయం రూ.12 లక్షలు ఉండాలి.
రూ.150 ఖర్చు పెట్టిన ప్రతిసారి 4 రివార్డు పాయింట్లు పొందవచ్చు.
ఇంధన కొనుగోళ్లకు సంబంధించి కనీస లావాదేవీ రూ. 400 చేస్తే 1% ఫ్యూయల్ సర్‌చార్జీ ఉండదు.
అడ్వాన్స్ రూపంలో నగదు వాడితే రూ.300 లేదా 2.5% ఇందులో ఏది ఎక్కువైతే అది చార్జ్ చేస్తారు.
కార్డుకు సంబంధించిన మరింత సమాచారం, కార్డు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

5) సిటీ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డు
రివార్డు పాయింట్లను బాగా అందించడంలో ఇది మంచి క్రెడిట్ కార్డు
ఖర్చు పెట్టిన ప్రతి రూ.125 పైన 10 రివార్డు పాయింట్లు పొందవచ్చు.
కార్డు యాక్టివేషన్ అయిన పిమ్మటే 2500 రివార్డు పాయింట్లు వస్తాయి.
వార్షిక వడ్డీ 39% చొప్పున చార్జీ చేస్తారు. నెలవారీ అయితే 3.25%.
ఈ కార్డు వార్షిక రుసుము రూ.1000, సంవత్సరంలో రూ.30 వేలు ఖర్చు పెడితే ఇది ఉండదు.
కార్డుకు సంబంధించిన మరింత సమాచారం, కార్డు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications