English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

30 ఏళ్ల‌కే ధ‌న‌వంతుల‌య్యే పెట్టుబ‌డి వ్యూహాలు

Written By:
Subscribe to GoodReturns Telugu

మనందరికీ వివిధ రకాల ఆర్థిక లక్ష్యాలున్నాయి. 35-40 సంవత్సరాలు వచ్చేలోపు ఆర్థికంగా భద్రత కలిగి ఉండాలని అందరూ ఆశిస్తారు. అయితే, 20లలో ఉన్నప్పుడు జీవితాన్ని ఆహ్లాదంగా అనుభవిస్తూ భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకోకుండా ఉండడం సహజం. అయితే, సంపదను సృష్టించుకునేందుకు ఇది సరైన పద్దతి కాదు. అందువల్ల, మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నారని అలాగే మీరు మీ ధనాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటున్నారని నిర్థారించుకోవడానికి మీరు ఈ అయిదు ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ సూత్రాలను మీరు ముప్పై చేరేలోపు పాటించాలి.

1. పన్ను అదా కోసం పెట్టుబడులు:

1. పన్ను అదా కోసం పెట్టుబడులు:

పన్ను అదా కోసం మీరు ఇన్ కమ్ టాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 80సి లోని అందుబాటులోనున్న డిడక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని మీ టాక్స్ లయబిలిటీని అంచనా వేసుకోవాలి. మీరు మీ పనిలో సంపాదించే సొమ్మును సరైన టాక్స్ ప్లానింగ్ ద్వారా టాక్స్ లయబిలిటీని తగ్గించుకోవచ్చు. అంతే కాదు, మరికొంత సొమ్మును మీరు మిగతా ఆర్థిక లక్ష్యాలకై ఉపయోగించుకోవచ్చు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ (ELSS) అటువంటి టాక్స్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ లలో ఉత్తమమైనవి. ఇది ఒకరకమైన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. వీటిలో పెట్టుబడి పెట్టినట్లైతే సెక్షన్ 80సీ ప్రకారం ఒక ఫైనాన్షియల్ యియర్ లో దాదాపు లక్షా యాభైవేల రూపాయల వరకు టాక్స్ డిడక్షన్ ను పొందవచ్చని HapynessFactory.in యొక్క చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ అలాగే వ్య‌వ‌స్థాప‌కులు అయిన అమిత్ పండిట్ తెలిపారు.

2. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనుటకై పెట్టుబడులు:

2. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనుటకై పెట్టుబడులు:

ప్రమాదాలు, వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు ఊహించని సంఘటనలు జీవితంలో ఎదురవవచ్చు. ఇటువంటివి ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొనుటకై ఆర్ధిక భద్రత అవసరం. కొన్ని క్లిష్ట పరిస్థితులలో ఇటువంటి సంఘటనలు, ఒక వ్యక్తి యొక్క సంపాదనా సామర్థ్యంపై కూడా ప్రతీకూల ప్రభావం చూపిస్తాయి. అటువంటప్పుడు కొన్ని నెలల పాటు సంపాదన అనేది లేకుండా పోతుంది. అందువల్ల, దాదాపు అయిదు నుంచి ఆరు నెలల వరకు జీవనానికి సరిపడా అత్యవసర నిధిని ముందుగానే సమకూర్చుకోవడం ముఖ్యం. ఇంకా, అటువంటి అత్యవసర నిధి అత్యవసర పరిస్థితులలో సులభంగా అలాగే సురక్షితంగా అందుబాటులోకి వచ్చే విధంగా ఉండాలి. అందువల్ల సేవింగ్స్ బ్యాంకు అకౌంట్స్ తో పాటు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అనే రెండు ఆప్షన్స్ అత్యవసర నిధికై ఉపయోగపడే పెట్టుబడి విధానాలు. లిక్విడ్ మరియు అల్ట్రా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి టాక్స్ ఎఫిషియంట్ గా పరిగణించవచ్చు. అందువల్ల వీటిలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడి పెట్టడం మంచిదని పండిట్ అంటున్నారు.

3. దీర్ఘకాలిక లక్ష్యాలకై పెట్టుబడులు:

3. దీర్ఘకాలిక లక్ష్యాలకై పెట్టుబడులు:

పెళ్లికోసం అలాగే ఇల్లు కొనడం కోసం, రిటైర్మెంట్ మరియు ఏదైనా స్వంత వెంచర్ ని ప్రారంభించడం వంటి కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఆదా చేయడం ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్క దీర్ఘ కాలిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత అవసరమో మీరొక అంచనాకి రావాలి. అంచనాకి వచ్చిన తరువాత ఆయా లక్ష్యం నెరవేర్చడానికి అవసరమైనంత సొమ్ము సమకూరేవరకు క్రమం తప్పకుండా అదా చేస్తూ ఉండాలి. పెట్టుబడి వ్యూహాలతో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP)లో మీరు స్థిర నెలసరి పెట్టుబడులను ప్రారంభించండి. మీరు మీ లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడులు పెట్టేందుకై ఎంత త్వరగా ముందడుగు వేస్తారో మీరు అంతగా మీ పెట్టుబడుల నుంచి లబ్ధి పొందుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకై అభివృద్ధి ఆధారిత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ప్రాధాన్యత కలిగిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్.

4. స్వల్పకాలిక లక్ష్యాలకై పెట్టుబడులు:

4. స్వల్పకాలిక లక్ష్యాలకై పెట్టుబడులు:

దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు స్వల్ప కాలిక లక్ష్యాలు కూడా జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏదైనా వస్తువు కొనడం కావచ్చు, కారు కొనడం కావచ్చు లేదా యాన్యువల్ వెకేషన్ కావచ్చు ఇవన్నీ స్వల్ప కాలిక లక్ష్యాలే. ఇటువంటి లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవడం కోసం సేవింగ్స్ అకౌంట్ కి బదులు కొంత మొత్తాన్ని లిక్విడ్ లేదా ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్ లో పొందుపరచాలి. ఎందుకంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేవి సేవింగ్స్ అకౌంట్ తో పోలిస్తే టాక్స్ ఎఫిషియెంట్ కలిగినవి. అలాగే, వివిధ కాల పరిణామములకు సంబంధించి వివిధ రకాల ఫండ్స్ ఆప్షన్స్ అందుబాటులో కలవు. ఉదాహరణకు, మీ లక్ష్యం యొక్క నిడివి ఒక సంవత్సర కాలం అయినప్పుడు మీరు లిక్విడ్ లేదా అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు. మరోవైపు, నిడివి సంవత్సర కాలం కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ ని ఎంచుకోవచ్చు అని అంటున్నారు పండిట్.

5. చక్కటి ఆరోగ్యానికై అలాగే జీవిత బీమాకై పెట్టుబడులు:

5. చక్కటి ఆరోగ్యానికై అలాగే జీవిత బీమాకై పెట్టుబడులు:

హెల్త్ ఇన్సూరెన్సు తో పాటు జీవిత బీమాకై పొందుపరిచే మొత్తాన్ని పెట్టుబడులుగా పరిగణించకూడదు. అయినప్పటికీ, ఇవి ముఖ్యమైనవి కాబట్టి మీరు ముప్పై చేరేలోపు వీటిని అధిక ప్రాధాన్యతకా గుర్తించి ఆరోగ్యానికి అలాగే జీవిత బీమాకై కొంత సంపాదనని పక్కకి ఉంచాలి. మీ మీద ఆధారపడి కుటుంబ ఉన్నట్లయితే మీరు సరైన లైఫ్ ఇన్సూరెన్సు ని మీకోసం తీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్య ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోవాలి. అదృష్టవశాత్తు, వివిధ రకాల హెల్త్ కవర్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీకు మీ మీద ఆధారపడిన మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

 ఎల్ఐసీ పాలసీ హామీగా రుణాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

ఎల్ఐసీ పాలసీ హామీగా రుణాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

ఎల్ఐసీ పాలసీ హామీగా రుణాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

 ఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు

ఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు

ఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు

Read more about: investments, savings
English summary

5 amazing investment strategies to follow before you turn 30

All of us have various financial goals in life. Everyone wants to be financially secure and well off by the age of 35-40. However, when we are in our 20’s, we tend to live life in the moment and forget saving for the future. This is not the right approach towards creating wealth. Therefore, to ensure that you are financially secure and on the right track with your money, here are 5 important investments that you must make before you hit your 30-year milestone:
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns