English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మార్వాడీలు వ్యాపారంలో రాణించ‌డానికి కార‌ణాలేమిటి?

Written By:
Subscribe to GoodReturns Telugu

థామ‌స్ ఎ టింబ‌ర్గ్ రాసిన మార్వాడీస్ః ఫ్ర‌మ్ జ‌గ‌త్ సేథ్ టు బిర్లాస్ అనే పుస్త‌కంలో మార్వాడీలు పాటించే ఏడు వ్యాపార ర‌హ‌స్యాల గురించి వివరించ‌డం జ‌రిగింది. అవి ఇప్ప‌టికీ వ‌ర్తిస్తాయి. ఇక ముందు వ‌ర్తించ‌బోతాయి అని చెప్ప‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లే ఉన్నాయి.అవేంటో మీ కోసం...

1. ఆర్థిక లావాదేవీల‌ను ద‌గ్గ‌ర ఉండి మ‌రీ స‌మీక్షిస్తారు

1. ఆర్థిక లావాదేవీల‌ను ద‌గ్గ‌ర ఉండి మ‌రీ స‌మీక్షిస్తారు

మార్వాడీలు త‌మ వ్యాపారంలో భాగంగా రెండు విష‌యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడ‌తారు. ఒకటి వ్యూహాత్మ‌కంగా పెట్టుబ‌డులు, నిధుల నిర్వ‌హ‌ణ చేసేలా చూస్తూ దాన్ని దీర్ఘ‌కాల ఉత్పాద‌క‌త‌కు ప‌నికివ‌చ్చేలా చేసుకుంటారు. ఇక రెండోది త‌మ‌కు వాటా ఉన్న వ్యాపార విభాగాల్లో ఆర్థిక లావాదేవీలు ఎలా న‌డుస్తున్నాయ‌న్న‌ది ఎప్ప‌టికప్పుడు ద‌గ్గ‌ర నుంచి స‌మీక్షిస్తుంటారు.

హ‌ర్ష గోయెంకా, కుమార మంగ‌ళం బిర్లాల త‌మ త‌మ వ్యాపార స‌ర‌ళిలో తీసుకొచ్చిన మార్పులే ఇప్ప‌టి ఆర్థిక వ్యూహాత్మ‌క‌మైన వ్యాపార ధోర‌ణికి పునాదులుగా నిలుస్తున్నాయంటే వారి ఆలోచ‌న విధానం ఎంత గొప్ప‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

 2. ప్రాతినిధ్యంతో పాటే ప‌ర్య‌వేక్ష‌ణ‌

2. ప్రాతినిధ్యంతో పాటే ప‌ర్య‌వేక్ష‌ణ‌

విజ‌య‌వంత‌మైన వ్యాపారులు ప్రాతినిధ్యం ఎలా వ‌హించాలో తెలిసి ఉండాలి. లేక‌పోతే ఆర్థిక చ‌ర్య నెమ్మ‌దిస్తుంది.

వ్యాపార సంబంధ విష‌యాల్లో త‌మ ప్ర‌మేయం ఉండేలా చూసుకుంటారు. త‌మ ప్ర‌మేయం లేక‌పోతే త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మంచి పనితీరు లేని ఉద్యోగిని బ‌ల‌వంతంగా ప‌నిచేయించే కంటే తొల‌గించ‌డం చాలా సులువు. ప‌నితీరు బాగా లేని కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా ఇత‌ర చిన్న చిన్న ప‌నుల కోసం నియ‌మిస్తుంటారు.

3. వారి ప్ర‌ణాళిక‌లో ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది

3. వారి ప్ర‌ణాళిక‌లో ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది

వారి ప్ర‌ణాళిక అంద‌రి మాదిరిగా ఉండ‌దు. దాని కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. అయితే ఇది అందిపుచ్చుకోవ‌డంలో త‌మ సంస్థ స్థాప‌కుల‌ను అనుస‌రిస్తార‌ని అంటారు. వాళ్ల నుంచి ఇలాంటి స‌ద్గుణాల‌ను పుణికిపుచ్చుకున్నార‌ని చెబుతారు.

4. విస్త‌రించే ధోర‌ణి వారిది

4. విస్త‌రించే ధోర‌ణి వారిది

విజ‌య‌వంత‌మైన వ్యాపారులు ల‌క్ష‌ణం వ్యాపారాన్ని ఎప్పుడూ విస్త‌రించాల‌ని చూడ‌డ‌మే. ఇది మార్వాడీలు త‌మ ర‌క్తంలో పుణికిపుచ్చుకున్నారు. ఎంతో మంది వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకుంటారు కొంద‌రు మాత్ర‌మే విజ‌యం సాధిస్తారు.

5. స‌రైన‌ కార్పొరేట్ సంస్కృతి

5. స‌రైన‌ కార్పొరేట్ సంస్కృతి

సంస్థ లేదా వ్యాపార బృందం దాని మార్కెట్ మరియు సమయాలకు తగిన శైలిని కలిగి ఉండాలి. మార్పులు లేదా సర్దుబాట్లు అత్యంత కష్టమైన పనిలో ఒకటి.

ఒక సంస్థలో కార్పొరేట్ సంస్కృతి స్పూర్తినిచ్చేలా సమర్థ నిర్వాహకులు ఉండాలి. ఆర్ధిక ప్రోత్సాహకాల‌ను వారు ఇస్తుంటారు. ఇలాంటి వాటిలో మార్వాడీలు త‌మ‌దైన శైలిని అందిపుచ్చుకోవ‌డం విశేషం.

6) ఆచ‌ర‌ణాత్మ‌కత‌ను చూస్తారు

6) ఆచ‌ర‌ణాత్మ‌కత‌ను చూస్తారు

ప్ర‌ఖ్యాత బిజినెస్ స్కూళ్ల ప్రొఫెస‌ర్లు ఎన్నో ర‌కాల ఆక‌ర్ష‌ణీయ సిద్ధాంతాల‌ను రూపొందించి వాటికి వ్యాపారానికి అన్వ‌యించ‌మ‌ని చెబుతుంటారు. అయితే అవేవీ వ్యాపార విజ‌యానికి ప‌నికిరావు అని చాలా సంద‌ర్భాల్లో తేలింది.

బాధ్యతాయుత వ్యాపార నిర్వ‌హ‌కుడు ప్ర‌తీది ఆచ‌రణాత్మ‌కంగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని ర‌కాల‌ ప్ర‌శ్న‌ల‌కు రెండు సమాధానాలు ఉన్న‌ట్టే ప్ర‌తి స‌మ‌స్య‌కు రెండు ర‌కాల ప‌రిష్కారాలు ఉంటాయి. అయితే సంద‌ర్భాన్ని బ‌ట్టి స‌రైన దాన్ని ఎంచుకోవ‌డ‌మే ఇక్క‌డ విజ‌య ర‌హ‌స్యం. అదే మార్వాడీలు పాటిస్తారు.

7) కొత్త‌ పరిణామాలను వదులుకోరు

7) కొత్త‌ పరిణామాలను వదులుకోరు

కొంద‌రు వ్యాపారులు త‌మ వ్యాపార స‌ర‌ళిని జ్ఞాన వ్యాపారాలుగా అభివ‌ర్ణించుకుంటాయి. వాస్త‌వానికి అన్నీ అలానే ఉంటాయి, అలా ఉండాలి కూడా. చాలా కుటుంబ వ్యాపారాల్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. అలాగే ఎన్నో ప‌రాజ‌యం పాల‌య్యాయి. ప‌రాజ‌యం అయిన‌వాళ్లు కేవ‌లం అవ‌కాశాల‌ను, ప‌రిణామాల‌ను వ‌దులుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం అని చెప్పాలి. మార్వాడీలు త‌మ వ్యాపార అభివృద్ధికి పాటుప‌డే కొత్త ప‌రిణామాలేవీ వ‌దులుకోరు.

 పెద్ద‌గా సొంత పెట్టుబ‌డి అక్క‌ర్లేకుండానే వ్యాపారం చేసేందుకు 11 బిజినెస్ ఐడియాలు

పెద్ద‌గా సొంత పెట్టుబ‌డి అక్క‌ర్లేకుండానే వ్యాపారం చేసేందుకు 11 బిజినెస్ ఐడియాలు

త‌క్కువ‌ పెట్టుబ‌డితో 11 బిజినెస్ ఐడియాలు

 ఎస్‌బీఐ ఖాతా ఉంటే మొబైల్లో ఉండాల్సిన యాప్‌లు

ఎస్‌బీఐ ఖాతా ఉంటే మొబైల్లో ఉండాల్సిన యాప్‌లు

ఎస్‌బీఐ ఖాతాదారులకు ఉప‌యోగ‌ప‌డే యాప్‌లు

 ఎక్కువ వ‌డ్డీ రాబ‌డికి మంచి పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

ఎక్కువ వ‌డ్డీ రాబ‌డికి మంచి పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

దేశంలో సుర‌క్షిత‌మైన‌ 8 పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

Read more about: marwaris, business, money
English summary

7 secrets that make Marwaris so good in business

According to Thomas A Timberg’s book, The Marwaris: From Jagath Seth to the Birlas, there are seven secrets of Marwari businessmen which are still valid "and perhaps will remain so".
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC