For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ (Paytm) ద్వారా బంగారు కొనుగోలు చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు

"బంగారు ఆభరణాల" నుండి బంగారాన్ని కొనుగోలు చేయటంలో కూడా పేటీఎమ్ కి మీరు మేకింగ్ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉంది. నాణెం యొక్క బరువు మరియు రూపకల్పన ఆధారంగా ప్రతి నాణెంకు వేర్వేరు తయారీ ఛార్జీలను కల

|

"పేటీఎమ్ గోల్డ్" తో మీరు రోజులో ఎప్పుడైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. మీ పేటీఎమ్ ఖాతా నుండి తక్కువ మొత్తం అయిన రూ.1 మొద‌లుకొని ఎంత‌కైనా బంగారం కొనుగోలు చేయడానికి గోల్డ్ అక్యుమలేషన్ ప్రోగ్రామ్ (GAP) అనుమతిస్తుంది. పేటీఎమ్ గోల్డ్ లో, కస్టమర్ బంగారం యొక్క ధరను ప్రత్యక్షంగా చూడవచ్చు మరియు ఈ బంగారాన్ని ముద్రించిన నాణేల రూపంలో కూడా ఈ బంగారాన్ని మీ ఇంటికి డెలివరీ ఇవ్వడానికి మీరు అభ్యర్థించవచ్చు, ఎందుకంటే ఆన్లైన్లో తిరిగి విక్రయించడానికి అనువుగా ఉండేందుకు. పేటీఎమ్ ద్వారా బంగారు కొనుగోలు గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

 పేటీఎమ్ యొక్క డిజిటల్ గోల్డ్ యొక్క లక్షణాలు :

పేటీఎమ్ యొక్క డిజిటల్ గోల్డ్ యొక్క లక్షణాలు :

• మీ సౌలభ్యం ప్రకారం మీరు బంగారాన్ని, నగదు (లేదా) గ్రాముల ప్రకారం కొనుగోలు చేయవచ్చు.

• మీరు రూ.1/- కనీస విలువ గల బంగారాన్ని (లేదా) 0.001 గ్రాము నుండి మొదలైన కనీస మొత్తం గల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

• పబ్లిక్ మరియు బ్యాంక్ సెలవులలో కూడా మీరు ఎప్పుడైనా బంగారంను కొనవచ్చు లేదా అమ్మవచ్చు.

• పన్నులు, విదేశీ మారక మార్పిడి, కస్టమ్స్ డ్యూటీ మరియు ఇతర కార్యాచరణ ఖర్చులతో సహా ఒక గ్రాము బంగారానికి ప్రత్యక్ష ధరలను బంగారానికి అందిస్తారు, కానీ వాటిలో ఉత్పత్తి తయారీ / మేకింగ్ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలు ప్రత్యేకంగా ఉంటాయి. ధరలు తరచుగా అప్డేట్ గా ఉంటుంది.

• మీరు డిజిటల్ బంగారు కొనుగోలుకు (లేదా) అమ్మడానికి ఎంచుకున్న ధర, కేవలం 6 నిమిషాల వ్యవధిని మాత్రమే చెల్లుబాటును కలిగి ఉంటుంది.

• డిజిటల్ బంగారమును, బంగారు నాణేలుగా విక్రయించడానికి కనీస పరిమాణం గల బంగారం - 1 గ్రాము.

స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్లో

స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్లో "గోల్డ్ రష్" యొక్క ఫీచర్లు ఇవ్వబడ్డాయి :

• మీరు బంగారం ధర రూ.1,000/- మరియు రూ.100/- యొక్క గుణిజాల తర్వాత, ఒక లావాదేవీలో కొనుగోలు చేయగల గరిష్ట మొత్తం రూ.49,999/-.

• మీరు ఆన్లైన్లో ఎప్పుడైనా అనగా : రోజులో - 24 గంటలు, వారంలో - 7 రోజులు, సంవత్సరంలో - 365 రోజులలో ఎప్పుడైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు (లేదా) ఉపసంహరించుకోవచ్చు.

• యూఎస్ (US) డాలర్లను భారతీయ రూపాయిలోకి మార్చడం ద్వారా బంగారం ధరలు రూపాయి పరంగా అందించబడుతున్నాయి.

• భౌతికంగా మీరు కొన్న బంగారాన్ని, మీరు సరఫరాకు చేసేందుకు కావలసిన కనీస బంగారు పరిమాణం - 1 గ్రాము.

• ధరలు రోజువారిగా చూస్తే అప్డేట్ గా ఉంటాయి.

ముఖ్యమైన మరియు అర్హతమైన పత్రాలు అవసరం :

ముఖ్యమైన మరియు అర్హతమైన పత్రాలు అవసరం :

పేటీఎమ్ (Paytm) లో GAP ఇచ్చిన ఆఫర్స్ కేవలం భారతదేశ నివాసితులకు మాత్రమే అందుబాటులో ఉంది. వారితో GAP ఖాతాను తెరవడానికి, కింది షరతులను సంతృప్తి పరచడం మరియు ఈ పత్రాలను సమర్పించడం అవసరం:

అవ‌స‌ర‌మ‌య్యే ప‌త్రాలు

అవ‌స‌ర‌మ‌య్యే ప‌త్రాలు

• చెల్లుబాటు అయ్యే లాగ్-ఇన్ ఐడి (ID) మరియు పాస్వర్డ్తో, పేటీఎమ్ యూజర్గా రిజిస్టర్ అవ్వాలి.

• మీరు పేరు మరియు డెలివరీ పిన్కోడ్ తో వేగంగా ఎంటర్ చేయబడతారు. ఎంటర్ చేసిన పిన్కోడ్ పేటీఎమ్ ద్వారా సర్వీస్ చేయబడినట్లయితే, అప్పుడు మాత్రమే మీరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

• మీ పేటీఎమ్ ఖాతాలో సంచిత లావాదేవీ విలువ రూ. 50,000 దాటితే, మీరు ప్రస్తుత KYC నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

• ఒక లావాదేవీ విలువ రూ.2 లక్షలు దాటితే, మీరు మీ పాన్ (PAN) వివరాలను సమర్పించాలి.

 ఎన్ఆర్‌ఐల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి

ఎన్ఆర్‌ఐల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి

గోల్డ్-రష్ కింద అయితే, ఏదైనా నివాసి, మరియు నాన్-రెసిడెంట్ (NRI), మరియు మైనర్ నమోదు చేసుకోవచ్చు. స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్తో ఒక "లోహపు ఖాతా" (మెటల్ అకౌంట్) ను మీరు ఓపెన్ చేయవలసి ఉంటుంది, కానీ దానికన్నా ముందుగా రిజిస్ట్రేషన్ విధానానికి అనుగుణంగా ఈ క్రింది పత్రాలను మీరు సమర్పించాల్సిన అవసరం ఉంది. అవి, గుర్తింపు మరియు చిరునామా యొక్క రుజువు పత్రము, ఎన్ఆర్ఐల కోసం పాన్ (PAN) తప్పనిసరి.

బంగారం కేవలం రూ.1/- కూడా :

బంగారం కేవలం రూ.1/- కూడా :

'భారతదేశం యొక్క మొట్టమొదటి మరియు ఏకైక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బంగారు మరియు వెండి రిఫైనరీ అయిన, గ్లోబల్ బులియన్ మార్కెట్లో భారతదేశంను - తనకున్న నాయకత్వ స్థానాల్లో నిలిపేందుకు గర్వపడుతున్నామని' "మెహ్ది బార్కర్దార్", ఎంఎంటీసీ-పిఎఎంపి (MMTC-PAMP) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చెప్పారు. "అధిక నాణ్యత, అంటే 24K - 999.9 వంటి స్వచ్ఛమైన సౌకర్యవంతమైన బంగారంను మరియు పారదర్శక పద్ధతిలో వినియోగదారులకు అందిస్తున్నామని" తెలిపారు.

 ఎంఎంటీసీ ప్ర‌తినిధి చెప్పిన మాట‌లు

ఎంఎంటీసీ ప్ర‌తినిధి చెప్పిన మాట‌లు

ఈ రకమైన డిజిటల్ బంగారు ఉత్పత్తి రెండు అంశాలపై మార్గదర్శకంగా ఉందని "అర్జున్ రాయ చౌదరి", హెడ్-స్ట్రాటజీ & డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఎంఎంటీసీ-పిఎఎంపి (MMTC-PAMP) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది.

1) రూ.1/- తో తక్కువ డబ్బుతో రావచ్చు మరియు

2) మొబైల్ ఫోన్ ద్వారా యాక్సస్ కావచ్చు.

బంగారంను ఎలా కొనుగోలు చెయ్యాలి ?

బంగారంను ఎలా కొనుగోలు చెయ్యాలి ?

పేటీఎమ్ ప్లాట్ఫారమ్లో రూపాయలలో (లేదా) గ్రాముల వద్ద చూపించబడిన ధర వద్ద గోల్డ్ను కొనుగోలు చేయడానికి కస్టమర్ ప్రతిపాదన చేయవచ్చు. ఉదాహరణకు, మీరు రూ.1/- (లేదా) దానిపైన గల మొత్తానికి, మరియు 0.1 గ్రాము మరియు దానిపైన ఉన్న బంగారంను కొనుగోలు చేయవచ్చు.

ఇన్వాయిస్ :

ఇన్వాయిస్ :

పేటీఎమ్ లో ఇన్వాయిస్ను డౌన్లోడ్ చేయడానికి:

మీరు పేటీఎమ్ వెబ్ (లేదా) యాప్ లోని 'మై ఆర్డర్స్' విభాగంలో ఆర్డర్ పేజీని సందర్శించి 'ఇన్వాయిస్' పై క్లిక్ చేయాలి. ఇన్వాయిస్ కూడా "ఆర్డర్ నిర్ధారణ" కాపీని మీ ఇమెయిల్ కు అటాచ్మెంట్గా పంపబడుతుంది.

నేరుగా మీ ఇంటికి డెలివరీ చెయ్యబడతాయి :

నేరుగా మీ ఇంటికి డెలివరీ చెయ్యబడతాయి :

బంగారం యొక్క "పరిమాణం" మరియు 'కొలతలను' ఎంచుకున్న తర్వాత, మీరు పేటీఎమ్ ప్లాట్ఫారమ్లో 'నాణాల లభ్యత' ఎంపికల నుండి పంపిణీ చేయాలనుకుంటే, ఆ లావాదేవీని నిర్ధారించుకోవచ్చు. డెలివరీ ఛార్జీలను, అదనపు ఛార్జీలుగా చెల్లించాలి. పేటీఎమ్ చేత ఏర్పాటు చేయబడిన లాజిస్టిక్స్ ప్రొవైడర్ ద్వారా నోటిఫైడ్ చేసిన చిరునామాకి, మీ ఉత్పత్తిని - పంపిణీ చేయబడుతుంది. కస్టమర్ పేటీఎమ్ నమోదులో సూచించిన మొబైల్కు ఒక నిర్ధారణ మెసేజ్ ను అందుకుంటారు. కస్టమర్ ఎప్పటికప్పుడు తన ఖాతాకు "లాగింగ్ ఆన్" చెయ్యడం ద్వారా తన డెలివరీని ట్రాక్ చేయవచ్చు.

మేకింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి :

మేకింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి :

"బంగారు ఆభరణాల" నుండి బంగారాన్ని కొనుగోలు చేయటంలో కూడా పేటీఎమ్ కి మీరు

మేకింగ్ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉంది. నాణెం యొక్క బరువు మరియు రూపకల్పన ఆధారంగా ప్రతి నాణెంకు వేర్వేరు తయారీ ఛార్జీలను కలిగి ఉంటుంది. కస్టమర్ అదనపు మేకింగ్ ఖర్చులను చెల్లించాలి.

డెలివరీ సమయం :

డెలివరీ సమయం :

మీరు ఆర్డర్ ను ఇచ్చే సమయంలోనే, మీరు ఏ సమయానికి అందజేయబడుతుందో అనే ఒక అంచనా సమయాన్ని గురించి తెలియజేయబడుతుంది. పేటీఎమ్ ప్లాట్ఫారమ్లో, పేటీఎమ్ ప్రకారం "14 రోజుల్లోనే మీ ఉత్పత్తిన్ని మీకు అందచేయబడుతుందని తెలిపింది. ఈ సమయం ఊహించలేని పరిస్థితుల కారణంగా మీకు మరింత ఆలస్యం కావచ్చు అని గమనించడం ముఖ్యం. మీరు రిజిస్ట్రేటెడ్ మొబైల్ నంబర్కు మరియు మీ ఖాతాలోని గల ఇ-మెయిల్ అడ్రస్కు రవాణా మార్గంలో ఉందని నోటిఫికేషన్లను అందించబడతాయి.

Read more about: paytm gold
English summary

పేటీఎమ్ (Paytm) ద్వారా బంగారు కొనుగోలు చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు | Things to know before buying gold through paytm

One97 Communications Pvt. Ltd, the company behind payments app Paytm, on Thursday introduced its first wealth management product targeted at lower-middle and middle class Indians. The product, named Digital Gold, will allow users to buy, store and sell gold through Paytm.
Story first published: Tuesday, October 24, 2017, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X