కేంద్ర ప్రభుత్వ డిజిటల్ వేగానికి తగ్గట్లుగా రైల్వే సైతం కదులుతోంది. ఆ దిశలో దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడూ ముందు ఉంటుంది. తమ సిబ్బంది కోసం దక్షిణ మధ్య రైల్వే వినూత్న మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చ
కేంద్ర ప్రభుత్వ డిజిటల్ వేగానికి తగ్గట్లుగా రైల్వే సైతం కదులుతోంది. ఆ దిశలో దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడూ ముందు ఉంటుంది. తమ సిబ్బంది కోసం దక్షిణ మధ్య రైల్వే వినూత్న మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ యాప్‌ను బుధవారం సికిందరాబాద్‌లోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్ మధుసూదన్ ప్రారంభించారు. రైల్వే ఆపరేషన్స్, కమర్షియల్ విభాగంలో పనిచేసే సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రైల్వేశాఖలోని కింది స్థాయి సిబ్బందికి తక్షణ సమాచారం కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్‌తో వివిధ విభాగాలకు చెందిన సమాచారం తక్షణమే తెలుసుకోవచ్చని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటలీకరణలో భాగంగా రైల్వేశాఖను కూడా డిజిటలైజేషన్ చేసేందుకు జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎలాంటి ఫోన్లోకైనా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. రైల్వే రిజర్వేషన్లు, రిజిస్టర్లు, సిగ్నల్ వ్యవస్థ, ప్రైవేట్ నెంబర్ల ఎక్ఛేంజ్ రిజిస్టర్లు డిజిటలైజేషన్ చేసే యోచనలో ఉన్నట్టు మధుసూదన్ తెలిపారు. రైల్వే సిబ్బంది ఈ యాప్‌తో తమ స్కిల్స్, నాలెడ్జ్‌ను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కెవి రావు, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications