అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ 1874లో అక్టోబర్9న ఏర్పడిన సందర్భంగా ఆ రోజునే అంతర్జాతీయ పోస్టల్ డేగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు, తపాలా వ్యవహారాల గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందా
ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ 1874లో అక్టోబర్9న ఏర్పడిన సందర్భంగా ఆ రోజునే అంతర్జాతీయ పోస్టల్ డేగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు, తపాలా వ్యవహారాల గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

1. 1,50,00కు పైగా తపాలా కార్యాలయాలు
ప్రపంచంలోని తపాలా శాఖలన్నింటిలో భారత తపాలా రారాజు లాంటిది. భారత దేశంలో మార్చి 31,2015 నాటికి దేశవ్యాప్తంగా 1,54,939 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 1,39,222(89.86%) గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న తపాలా కార్యాలయాలు 23,344 మాత్రమే.

2. తపాలా శాఖ ఏర్పాటు
భారత తపాలా శాఖను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అక్టోబర్ 1,1854న ఏర్పాటు చేసింది.
భారత తపాలా శాఖ వరల్డ్ పోస్టల్ వారాన్ని అక్టోబర్ 9 నుంచి 14 మధ్య జరుపుకుంటుంది
పోస్టల్ వ్యవస్థ సక్రమంగా ఏర్పాటు కాకముందే భారత్‌లో మొదటిసారి వారెన్ హెస్టింగ్స్ కోల్‌కత కార్యాలయంలో 1774లో మొదట తపాలా కార్యాలయాన్ని తెరిచారు.

3. భారత తపాలా వ్యవస్థ
భారతదేశంలో తపాలా వ్యవస్థను 18వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో ప్రారంభించారు.
1776లో లార్డ్ క్లైవ్ తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1774లో వారన్ హేస్టింగ్స్ కలకత్తా ఆఫీసును ప్రారంభించగా తర్వాత 1786లో మద్రాస్ జనరల్ పోస్టాఫీసును, 1793లో బొంబాయి జనరల్ పోస్ట్ ఆఫీస్‌లను ఏర్పాటు చేశారు.

4. అప్పుడలా... ఇప్పుడిలా...
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో 23,344 తపాలా కార్యాలయాలు ఉండేవి. అందులో 19,184 గ్రామీణ ప్రాంతాల్లో , 4160పట్టణ ప్రాంతాల్లో ఉండేవి. ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థ ఉన్న దేశంగా భారత్ రికార్డు సాధించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 1.55 లక్షలకు పైగా కార్యాలయాలు ఉన్నాయి. దేశంలో ప్రతి 21.16 చదరపు కిలోమీటర్లకు ఒక పోస్టాఫీసు ఉంది. ప్రతి 6623 మందికి ఒక పోస్టాఫీసు అందుబాటులో ఉన్నట్లు లెక్క

6. పోస్టల్ స్టాంప్-ప్రపంచవ్యాప్తంగా
మిర్రర్ పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలో అన్నిటి కంటే విలువైన స్టాంప్ 5,550,000 పెన్నీ(బ్రిటీష్ పెన్నీ)
ఇటీవలి కాలంలో బ్రిటీష్ మెజెంటా స్టాంప్ విలువ మునుపటి కంటే ఎక్కువగా 95 లక్షల డాలర్లలో ఉంది

6. పోస్టల్ స్టాంప్-ప్రపంచవ్యాప్తంగా
మిర్రర్ పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలో అన్నిటి కంటే విలువైన స్టాంప్ 5,550,000 పెన్నీ(బ్రిటీష్ పెన్నీ)
ఇటీవలి కాలంలో బ్రిటీష్ మెజెంటా స్టాంప్ విలువ మునుపటి కంటే ఎక్కువగా 95 లక్షల డాలర్లలో ఉంది

7. ఈ-పోస్ట్ సదుపాయం
మారుతున్న సాంకేతికతకు తగ్గట్లుగా భారత తపాలా శాఖ ఈ-పోస్ట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ఈ-పోస్ట్ అనేది దేశంలో 1,56,000 పోస్టాఫీసుల ద్వారా ప్రజలు తాము స్కాన్ చేసిన బొమ్మలను ఈ-మెయిల్ ద్వారా పంపించేందుకు ఉద్దేశించింది. దీని ప్రత్యేకత అవతలి వ్యక్తికి అదే రోజున దాన్ని అందజేయడం.
ఇది ఇంటర్నెట్, ఈ-మెయిల్ లేని ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
దీని ద్వారా ప్రజా సమాచార వ్యవస్తలో డిజిటల్ అంతరాలను తగ్గించవచ్చు.

8. మన దగ్గర పోస్టల్ స్టాంప్
మొదటిసారి మన దేశంలో పోస్టల్ స్టాంప్‌ను 1852లో విడుదల చేశారు.
ఏదైనా బొమ్మ కలిగినదైతే క్వీన్ విక్టోరియా చిత్రంతో మొదటి సచిత్ర పోస్టల్ స్టాంప్ 1,అక్టోబర్ 1854ల విడుదలయింది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి పోస్టల్ స్టాంప్‌ను నవంబరు 21,1947న విడుదల చేశారు.
అప్పుడు విడుదల చేసిన ఈ పోస్టల్ స్టాంప్ విలువ 1.5 అణాలు.
దేశంలో అతిపెద్ద పోస్టల్ స్టాంప్ మాత్రం ఆగస్ట్ 20,1991న విడుదల అయింది.

9. గాంధీజీ చిత్రంతో కూడిన పోస్టల్ స్టాంప్ వేలంలో 5లక్షల పౌండ్లకు
ఇంగ్లండ్‌లో అరుదైన పోస్టల్ స్టాంప్‌లను ఈ ఏడాది ఏప్రిల్‌లో వేలం వేశారు.
అక్కడ 10రూపాయల విలువ కలిగిన గాంధీ బొమ్మ ఉన్న నాలుగు స్టాంప్‌లను 5 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు.

10. మన దేశంలో పిన్ కోడ్ విధానం
ఉత్తరాల బట్వాడాలో వేగం, కచ్చితత్వాన్ని సాధించడానికి 1972 ఆగస్టు 15న పిన్ కోడ్(P.I.N పోస్టల్ ఇండెక్స్ నంబర్) విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టారు. పిన్ కోడ్లో ఆరు అంకెలు ఉంటాయి. మొదటి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్ జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడంకెలు డెలివరీ పోస్టాఫీసును తెలియజేస్తాయి.
దేశాన్ని మొత్తం 9 పిన్ కోడ్ జోన్లుగా విభజించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications