For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ పాలసీ హామీగా రుణాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

ఆన్‌లైన్‌లోనే పాలసీపై రుణం పొందే వెసులుబాటును ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ముఖ్య విష‌యాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

|

ఎల్ఐసీ నుంచి ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపేది ఎండోమెంట్ పాల‌సీల‌నే. అత్య‌వ‌సరాల్లో ఈ త‌ర‌హా పాల‌సీలు హామీగా రుణం సైతం పొంద‌వ‌చ్చు. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ పాలసీపై రుణం తీసుకోవాలంటే కార్యాలయం వరకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇదంతా కాస్త స‌మ‌యం ప‌ట్టే వ్య‌వ‌హార‌మే. ఈ ఇబ్బందికి విముక్తి కల్పిస్తూ ఆన్‌లైన్‌లోనే పాలసీపై రుణం పొందే వెసులుబాటును ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ముఖ్య విష‌యాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

అర్హతలు

అర్హతలు

పాలసీని స్వాధీన‌ప‌రిస్తే ఎంత అయితే వస్తుందో ఆ విలువలో 90 శాతాన్ని ఎల్‌ఐసీ రుణంగా ఇస్తుంది. పెయిడప్‌ పాలసీలు అయితే ఇది 85 శాతం. సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలపైనే గానీ, టర్మ్‌ ప్లాన్లపై రుణం రాదు. ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తూ పాలసీ గడువు ముగిసే వరకూ అసలు చెల్లించకుండా రుణాన్ని కొనసాగించుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నుంచి ఎల్‌ఐసీ అసలును మినహాయించుకుంటుంది. లేదా పాలసీదారుడు మరణిస్తే పరిహారం నుంచి ఆ మేరకు తగ్గించుకుంటుంది. ఒకవేళ వడ్డీ కూడా చెల్లించకుంటే మాత్రం పాలసీని ముందే ట‌ర్మినేట్‌ చేసే హక్కు ఎల్‌ఐసీకి ఉంది. రుణ కనీస కాల వ్యవధి ఆరు నెలలు. ఆ లోపు రుణం తీర్చేయాలనుకుంటే ఆరు నెలల వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసకున్న తర్వాత ఆరు నెలల్లోపే పాలసీదారుడు మరణిస్తే లేదా కాల వ్యవధి తీరితే అప్పటి వరకే వడ్డీని ఎల్‌ఐసీ లెక్కకడుతుంది. రుణం తీసుకోవాలంటే పాలసీ తీసుకుని కనీసం మూడేళ్లు పూర్తయి సరెండర్‌ వ్యాల్యూ కలిగి ఉండాలి. పాలసీ బాండ్‌ను ఎల్‌ఐసీకి ఇవ్వాలి. ఇంకా అర్హత ఉంటే అదే పాలసీపై రెండో రుణం కూడా తీసుకునేందుకు వీలుంది. ఎల్‌ఐసీ కాకుండా ఇతర ఆర్థిక సంస్థల నుంచి సైతం బీమా పాలసీపై రుణం తీసుకోవచ్చు. కాకపోతే ఎల్‌ఐసీ సరెండర్‌ విలువలో 90 శాతం రుణంగా ఇస్తే, ఇతర సంస్థలు ఇంతకంటే తక్కువ మేరే రుణమిస్తాయి.

దరఖాస్తు విధానం:

దరఖాస్తు విధానం:

ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ కాలమ్‌లో ‘ఆన్‌లైన్‌ లోన్‌' ఆప్షన్‌ ఎంచుకోవాలి. మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడే రిక్వెస్ట్‌ ఫర్‌ ద లోన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటే దీన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పటికే రుణం తీసుకుని వడ్డీ, అసలు చెల్లించాలనుకునే వారి కోసం మరో ఆప్షన్‌ కూడా ఈ పేజీలోనే కనిపిస్తుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్‌ఐసీ పాలసీదారుడి బ్యాంకు ఖాతాలో రుణం మొత్తం జమ చేస్తుంది. అందుకే దీనికంటే ముందు ఎల్‌ఐసీకి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలు సరిగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించాలి.

సానుకూలతలు

సానుకూలతలు

అత్యవసరాల్లో వేగంగా రుణం పొందొచ్చు. పర్సనల్‌ లోన్‌ కంటే వడ్డీ రేటు చాలా తక్కువ. ఆన్‌లైన్‌లోనే చెల్లించే వెసులుబాటు. క్రెడిట్‌ స్కోరుతో అవసరం లేదు. ఏ ఇతర అర్హత పత్రాలను ఇవ్వాల్సిన పని లేదు. అలాగే, పాలసీదారుడు అకాల మరణం చెందితే ఆధారపడిన వారికి పరిహారం తక్కువగా వస్తుంది. ఎందుకంటే అందులో నుంచి రుణాన్ని ఎల్‌ఐసీ మినహాయించుకుంటుంది.

ప్ర‌తికూల‌త‌లు

ప్ర‌తికూల‌త‌లు

అత్య‌వ‌స‌రాల్లో పాల‌సీ ఆధారిత రుణం ఉప‌యోగ‌ప‌డినప్ప‌టికీ, రుణం చాలా తక్కువగా లభించడం, పన్ను ప్రయోజనాలు లేకపోవడం గమనించాల్సిన అంశాలు. స్వాధీన‌త విలువ ఆధారంగా రుణం మొత్తాన్ని నిర్ణ‌యిస్తున్నందున పాల‌సీ కొనుగోలు చేసిన మొద‌టి కొన్ని సంవ‌త్స‌రాలు ఎక్కువ మొత్తం డ‌బ్బు అవ‌స‌రం ఉంటే కేవ‌లం ఈ త‌ర‌హా రుణంపై ఆధార‌ప‌డి మ‌న‌లేం.

Read more about: lic policy loan
English summary

ఎల్ఐసీ పాలసీ హామీగా రుణాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా? | Loan against lic policy in Online

To avail the loan you have to visit the servicing branch and avail the loan by submitting few forms. It is a cumbersome process if the person is not staying in the same locality.However, recently LIC started the facility to apply or avail Loan Against LIC Policy online. Before jumping into this, let us find out the loan features of LIC policies.
Story first published: Wednesday, October 4, 2017, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X