ఇలాంటి సమయంలో దీని ద్వారా మనకు ఏమైనా వ్యాపారం జరుగుతుందేమో అని ఆలోచించేవారు ఉండకపోలేదు. అలా జియో డీటీహెచ్ డీలర్‌షిప్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలు సైతం చూస్తున్నారు. ఆ ఆలోచన ఉన్నవారి కోస
భారత టెలికాం రంగంలో 4జీ సేవలతో రిలయన్స్ జియో ప్రవేశించడం ఒక సంచలనం. ఆ సేవ ఎలా ఉన్నది అనేది పక్కన బెడితే టారిఫ్ విధానాల్ని సమూలంగా మార్చేందుకు జియో తోడ్పాటునిచ్చింది. అయితే దాదాపు 4జీ సేవల్లో అన్ని టెల్కోలకు ముచ్చెమటలు పట్టించిన రిలయన్స్ జియో ఇకపై డీటీహెచ్ రంగాన్ని సైతం ఒక చూపు చూస్తుందంటున్న వార్తలు వస్తున్నాయి. వినియోగదారులు ఇచ్చిన ప్రోత్సహాంతో రెట్టించిన సంతోషంతో జియో డీటీహెచ్, బ్రాడ్ బ్యాండ్లలోనూ సంచలనాలకు తెరతీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో దీని ద్వారా మనకు ఏమైనా వ్యాపారం జరుగుతుందేమో అని ఆలోచించేవారు ఉండకపోలేదు. అలా జియో డీటీహెచ్ డీలర్‌షిప్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలు సైతం చూస్తున్నారు. ఆ ఆలోచన ఉన్నవారి కోసమే ఈ కథనం.

జియో డీటీహెచ్ సేవల ప్రారంభం
వీలైనంత త్వరలోనే జియో డీటీహెచ్(డైరెక్ట్ టు హోం) సేవలు ప్రారంభమవుతాయని అంటున్నారు. రిలయన్స్ జియో సైతం తమ డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్‌ల వ్యాపారంలో భాగస్వాములు అయ్యే వారి కొరకు ఎదురుచూస్తోంది. భారతదేశం అంతటా 1100 జియో డీటీహెచ్ వర్క్ స్టేషన్లు పెట్టాలని జియో భావిస్తోంది. మొదట వచ్చిన వారికి మొదట కేటాయించే పద్దతిలో డిస్ట్రిబ్యూషన్‌షిప్ ఇస్తారని చెబుతున్నారు. ఇందుకోసం రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ చూస్తే మరింత సమాచారం తెలుస్తుంది.

పెట్టుబడి కోసం ఎంత డబ్బు అవసరం?
ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం రిలయన్స్ జియో డీటీహెచ్ డిస్ట్రిబ్యూటర్ కావాలంటే
* 250 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా
* కార్యాలయం నెలకొల్పేందుకు రూ.3 నుంచి రూ.5 లక్షలు
* ఎన్‌లిస్ట్ అయ్యేందుకు మరో 50 వేల రూపాయలు

జియో డీటీహెచ్ ఫ్రాంచైజ్, డీలర్‌షిప్ తీసుకోవడం ఎలా?
How to get jio DTH frachise OR Dealership ?
టెలికాం రంగంలో పెను సంచలనాలు సృష్టించి అప్పటివరకే ఉన్న పాత విధానాల్ని సమూలంగా మార్చేలా చేసి టారిఫ్లు తగ్గేలా జియో ప్రజలకు మేలు చేసింది. మొబైల్ కంపెనీలకు బాగా షాక్ ఇచ్చిన జియో ఇప్పుడు డీటీహెచ్ రంగాన్ని ఏలేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జియో డీటీహెచ్ డీలర్‌షిప్లో రెండు రకాలు ఉంటాయి.
1. మొదటి దాంట్లో సిమ్ కార్డుల నిర్వహణ, యాక్టివేషన్, అన్ని సేవలు అందించడం- అంటే రీచార్జీలు, ఇతరాలు
2. రెండో రకంలో కేవలం జియో హార్డ్‌వేర్ ఉత్పత్తులు అమ్మడం
జియో డీటీహెచ్ డీలర్‌షిప్ కోసం ఆన్లైన్లో ఫారం లభిస్తుంది. ఫారం నింపేసి దాన్ని పోస్ట్్‌లో పంపాలి.
మీరు డీలర్‌షిప్ కోసం ఎంపికైతే మీకు మెయిల్ లేదా ఫోన్‌కు తదుపరి ప్రక్రియ సమాచారాన్ని పంపుతారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications