For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ ఖాతాను ఆన్‌లైన్‌లో ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు మార్చుకోవ‌డమెలా?

ఎస్బీఐ ప్ర‌వేశ‌పెట్టిన స‌రికొత్త సేవ‌తో ఆన్‌లైన్‌లోనే ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అదెలాగో ఈ కింద తెలుసుకుందాం.

|

ప్రైవేటు బ్యాంకుల‌కు పోటీ ఇచ్చే విధంగా ఒక్కో ఆన్‌లైన్ సేవ‌ను స‌రికొత్త‌గా ప్ర‌వేశ‌పెడుతున్న‌ది. సాధార‌ణంగా ఏ బ్యాంకులోనైనా ఉన్న ఖాతాను మ‌రో శాఖ‌కు మార్చుకోవాలంటే ఆ మాతృశాఖ‌కు వెళ్లి అర్జీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎస్బీఐ ప్ర‌వేశ‌పెట్టిన స‌రికొత్త సేవ‌తో ఆన్‌లైన్‌లోనే ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అదెలాగో ఈ కింద తెలుసుకుందాం.

1. కాగిత ర‌హితంగా

1. కాగిత ర‌హితంగా

ఇదివ‌ర‌కూ ఎస్బీఐ శాఖ‌ల్లో ఖాతా బ‌దిలీ అవాలంటే బ్రాంచి మేనేజర్‌ను అభ్య‌ర్థిస్తూ లేఖ ఇవ్వాల్సి వ‌చ్చేది. ఇక‌పై స్టేట్ బ్యాంకులో ఉన్న ఖాతాను టెక్నాల‌జీ తెలిసిన వారంతా ఆన్లైన్‌లో ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. దీని ప్ర‌కారం ఎటువంటి ఖ‌ర్చే లేకుండా వారం రోజుల లోపు ఖాతా బ‌దిలీ పూర్త‌వుతుంది.

2. బ‌దిలీ విధానం

2. బ‌దిలీ విధానం

మొద‌ట www.onlinesbi.com వీక్షించండి

అందులో ప‌ర్స‌న‌ల్ బ్యాకింగ్‌ను ఎంచుకుని లాగిన్ వివ‌రాల‌ను న‌మోదు చేయండి

నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయిన త‌ర్వాత ఈ-స‌ర్వీసెస్ ఎంచుకోండి

అక్క‌డ అందుబాటులో ఉన్న సేవ‌ల్లో ట్రాన్స్‌ఫ‌ర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్‌పై నొక్కండి.

ఇప్పుడు మీ ఖాతా నంబ‌రు, బ్రాంచీ వివ‌రాలు వంటివి ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.

 3. శాఖ కోడ్‌

3. శాఖ కోడ్‌

ఒక‌వేళ ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలున్నా ఆ వివ‌రాల‌న్నీ మీ ముందుంటాయి.

ఏ అకౌంట్‌ను వేరే బ్రాంచీకి మార్చాల‌నుకుంటున్నారో అక్క‌డ కొత్త‌ బ్రాంచీ కోడ్ ఎంట‌ర్ చేయండి.

కోడ్ ఆధారంగా బ్రాంచీ పేరు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.

క‌న్‌ఫ‌ర్మ్ బ‌ట‌న్‌పై నొక్కితే, మీ న‌మోదిత మొబైల్ నంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.

త‌ర్వాతి పేజీలో ఓటీపీ ఎంట‌ర్ చేసి క‌న్‌ఫ‌ర్మ్ నొక్కండి. అక్క‌డ తెర‌పై వ‌చ్చే సందేశంలో మీ బ్రాంచీ ట్రాన్స్‌ఫ‌ర్ అభ్యర్థ‌న విజ‌యవంతం అయిన‌ట్లు తెలుస్తుంది.

4. ప్రాసెస్ మొద‌లుపెట్టేముందు

4. ప్రాసెస్ మొద‌లుపెట్టేముందు

పొదుపు ఖాతాల్లో మొబైల్ నంబ‌రు రిజిస్ట‌ర్ అయి ఉంటేనే ఖాతా బ‌దిలీ సాధ్య‌మ‌వుతుంది.

ఖాతా బ‌దిలీ ఆన్‌లైన్‌లో చేయాలంటే మీకు క‌చ్చితంగా నెట్ బ్యాంకింగ్ సౌక‌ర్యం ఉండాలి.

కేవైసీ వివ‌రాల వెరిఫికేష‌న్ కాని, ఇన్ఆప‌రేటివ్ ఖాతాల‌కు ఇది సాధ్య‌ప‌డ‌దు.

బ్రాంచీ కోడ్‌ను మొద‌టే సిద్దంగా ఉంచుకోవాలి.

ఇది తెలియ‌క‌పోతే https://www.sbi.co.in/corporate/branchlocator.htm. తెలుసుకోవచ్చు.

 ప్ర‌ధాన మంత్రి ముద్రా యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ రుణం ప్ర‌ధాన మంత్రి ముద్రా యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ రుణం

5. కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్

5. కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్

ఖాతా బ‌దిలీ అవాలంటే దాదాపు వారం రోజులు ప‌డుతుంది.

ఒక‌వేళ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు,ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు బ‌దిలీ చేస్తున్న ఖాతా వివ‌రాలు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఇచ్చి ఉంటే అక్క‌డ కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను అప్‌డేట్ చేయ‌డం మ‌ర‌వ‌కండి.

ఈసీఎస్‌, స్టాండింగ్ ఇన్‌స్ట్ర‌క్ష‌న్ విష‌యంలో సైతం కొత్త కోడ్‌ను మార్చాల్సి ఉంటుంది. ఇంటి వ‌ద్దే కూర్చొని ఆన్‌లైన్ ద్వారా డ‌బ్బు సంపాదించే 10 ఉత్త‌మ మార్గాలు

ఎస్‌బీఐ ఫ్లెక్సీ హం లోన్- త‌క్కువ జీతం ఉన్న వారి కోసంఎస్‌బీఐ ఫ్లెక్సీ హం లోన్- త‌క్కువ జీతం ఉన్న వారి కోసం

బిట్ కాయిన్స్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలుబిట్ కాయిన్స్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు

English summary

ఎస్‌బీఐ ఖాతాను ఆన్‌లైన్‌లో ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు మార్చుకోవ‌డమెలా? | How to transfer SBI savings account one branch to another in Online

Now you can transfer your saving account in sbi from one branch to another branch in Online. Here is how
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X