English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఆర్థిక స్వాతంత్రం సాధించాలంటే నాలుగు విలువైన సూచ‌నలు

Written By:
Subscribe to GoodReturns Telugu

కొంత కాలం త‌ర్వాత ఎక్కువ డ‌బ్బు మీ దగ్గ‌ర ఉండాలంటే మొద‌ట చేయాల్సింది పొదుపు. త‌ర్వాత పెట్టుబ‌డులు పెట్టాలి. ప్ర‌తి ఒక్క‌రూ ఆర్థికంగా విజ‌యవంతం కావాలంటే ఇదే మార్గం. ఈ ద‌శ‌కు చేరుకునే ముందు అంటే ఆర్థిక ల‌క్ష్యాలు సాధించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ 4 ద‌శ‌లు దాటి వెళ్లాలి. అవేంటో ఇక్క‌డ తెలుసుకుందాం. (ఆర్థికంగా ఎద‌గాలంటే పాటించాల్సిన 4 సూచ‌న‌లు)

1. అవ‌గాహ‌న‌

1. అవ‌గాహ‌న‌

మీ అవ‌స‌రాల‌కు ఎంత డ‌బ్బు అవ‌స‌ర‌మో తెలియ‌డం ఎంతైనా ముఖ్యం. అయితే ఏ స్థితిలోనైనా క్ర‌మంగా ఆర్థికంగా మెరుగ‌య్యేందుకు క్ర‌మ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటూ ఉండాలి. అందుకోసం ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక స్థితిని విశ్లేషించి ఎక్క‌డ మెరుగుప‌డాలో క‌చ్చితంగా తెలిసి ఉండాలి. ఇందుకోసం ల‌క్ష్యాల‌ను ఏర్ప‌రుచుకుని అందుకోసం క‌ష్ట‌ప‌డొచ్చు. వెంటనే దృష్టి సారించాల్సిన అంశాలేమిటో తెలుసుకుని మొద‌ట వాటిమీద ప‌ట్టు పెంచుకోవాలి. ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి నెర‌వేర్చుకుంటూ వెళ్లాలి.

2. నియంత్ర‌ణ

2. నియంత్ర‌ణ

ఇప్పుడు మొద‌ట ల‌క్ష్యాలేమిటో తెలిసి వ‌చ్చాయి. ఇక ల‌క్ష్యాలు సాధించే దిశ‌గా ఏమేం ప‌నులు చేయాలో వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌కుండా గ‌మ‌నించుకోవాలి. కొంత సొమ్మును అప్పులు క‌ట్టేందుకు కేటాయించ‌డం, మ‌రికొంత నెల‌వారీ పొదుపుకోసం ప‌క్క‌న పెట్ట‌డం చేయాలి. ఈ ద‌శ‌లో ఏ విధంగానైనా అన‌స‌వ‌ర ఖ‌ర్చుల‌ను నియంత్రణ చేయాల్సిందే. క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌తో మీ పొదుపు విలువ పెరుగుతుంది. త‌ద్వారా మీ ఆర్థిక స్థితి మెరుగ‌వుతుంది. మీరు వెళుతున్న దారిలో ఆటంకాలు ఎదురైనా మ‌ళ్లీ మీరు అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించేందుకు గాడిలో ప‌డేందుకు కృషి చేయండి.

3. ఆర్థిక ర‌క్ష‌ణ‌

3. ఆర్థిక ర‌క్ష‌ణ‌

మీ కోసం ఆర్థిక భ‌ద్ర‌త ఏర్ప‌రుచుకునే విధంగా ప‌నిచేయండి. అదే విధంగా మీపైన ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యుల ఆర్థిక ర‌క్ష‌ణ కోసం ఏర్పాట్లు చేయండి. రోజువారీ, నెల‌వారీ ఖ‌ర్చుల‌పై ప‌ట్టు వ‌చ్చిన త‌ర్వాత ఆర్థిక భ‌ద్ర‌త‌పై దృష్టి పెట్టాల‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తుంటారు. దీర్ఘ‌కాలంలో ఎక్కువ సంప‌ద పోగుప‌డేందుకు స‌రైన పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే ఆర్థిక భ‌ద్ర‌త‌కు సోపానం. అదే విధంగా మీకు అత్య‌వ‌స‌రం ఉన్న‌ప్పుడు కొంత డ‌బ్బు ఖ‌ర్చుల‌కు అందుబాటులో ఉండేలా చూసుకోవ‌డం ముఖ్యం. ఇందుకోసం లిక్విడ్ ఫండ్ల‌ను ఆశ్రయించ‌వ‌చ్చు. దీన్ని అత్య‌వ‌స‌ర నిధిలాగా కూడా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.

 4. ఆర్థిక స్వాతంత్రం

4. ఆర్థిక స్వాతంత్రం

ప్ర‌స్తుత ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఆర్థిక స్థితి ఆధారంగా రోజువారీ నిర్ణ‌యాలు తీసుకుంటే ఆర్థిక స్వాతంత్రం అదంట అదే వస్తుంది. ఇందుకోసం రెండు ర‌కాల మార్గాలు ఉంటాయి.

అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం

ఎవ‌రికైనా అప్పు ఉందంటే కాస్త కంగారే. ఆర్థిక స్వాతంత్రం సాధించేముందు ఇదివ‌ర‌కే ఉన్న అప్పులు తీర్చ‌డం తెలివైన నిర్ణ‌యం. అది ఎంత సొమ్ము అయినా మొద‌ట అప్పు తీర్చేందుకు ప్రాధాన్య‌తం ఇవ్వండి.

పెట్టుబ‌డి

అప్పు చేసి పెట్టుబ‌డి పెట్ట‌కూడ‌ద‌ని చాలా మంది చెబుతారు. దీర్ఘ‌కాలంలో సంప‌న్నుడవ్వాలంటే పెట్టుబ‌డులు పెట్ట‌క త‌ప్ప‌దు. ఆర్థిక భ‌విష్య‌త్తును నిర్ణ‌యించ‌డంలో ఇది ఒక సూచీగా ఉంటుంది. పెట్టుబ‌డులు అన‌గానే క‌చ్చితంగా అంత డ‌బ్బును అధిక రాబ‌డుల‌నిచ్చే వాటిలో ఉంచాల‌నేమీ లేదు. మీ ఆర్థిక స్థితి, న‌ష్ట భ‌యాన్ని త‌ట్టుకునే సామ‌ర్థ్యాన్ని బ‌ట్ట పెట్టుబ‌డుల‌ను నిర్ణ‌యించుకోండి.

English summary

To get financial success follow these 4 steps

Everyone aims to achieve some degree of financial success, even though it may seem like an uphill task. But worry not! We’re here to help you get there by guiding you through the 4 stages that will help you achieve your financial goals.
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns