1. గడువు లోపు అనుసంధానించాలి
డిసెంబరు 31 లోపు అన్ని బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్ సంఖ్యతో అనుసంధానించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయకపోతే బ్యాంకు ఖాతాలు పనిచేయవని చెప్పింది. కొత్తగా ఖాతా తెరిచేవారు, ఇంకా రూ.50 వేల కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరిపేవారు ఆధార్ తప్పక సమర్పించాలని నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పటికి మీ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానపరచకపోతే ఇకైనా చేయాల్సిందే. ఇక్కడ వివిధ పద్దతుల్లో ఎస్‌బీఐ ఖాతాకు అనుసంధానించే విధానాలు ఉన్నాయి.
2. ఎస్‌బీఐ శాఖకు వెళ్లడం ద్వారా...
మీ ఆధార్ నంబరుతో ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచీకి వెళ్లాలి.
ఆధార్ జిరాక్స్‌తో పాటు అనుసంధానానికి సంబంధించి ఒక లేఖను బ్రాంచీలో ఇవ్వాలి.
వెరిఫికేషన్ తర్వాత ఎస్‌బీఐ యాజమాన్యం ఆధార్ అనుసంధానాన్ని పూర్తిచేస్తుంది. అనుసంధానం పూర్తయితే అదే విషయం మీ మొబైల్‌కు సంక్షిప్త సందేశం వస్తుంది.
3. ఎస్ఎంఎస్ ద్వారా
మీ మొబైల్ నంబరు ఎస్‌బీఐ వద్ద రిజిస్టర్ అయి ఉంటే, ఎస్ఎంఎస్ ద్వారా సైతం అనుసంధానం చేయొచ్చు.
యూఐడీ(స్పేస్)ఆధార్ నంబరు(స్పేస్)అకౌంట్ నంబరును 567676 నంబరుకు మెసేజ్ పంపాలి.
మీ మొబైల్ నంబరు రిజిస్టర్ కాకపోయినా లేదా ఇదివరకే ఆధార్ లింక్ అయినా, మెసేజ్ వస్తుంది.
మొబైల్ నంబరు బ్యాంకులో రిజిస్టరై ఉంటే ఆధార్ అనుసంధాన సందేశం వస్తుంది.
యూఐడీఏఐ వద్ద ఆధార్ నంబరును బ్యాంకు వెరిఫై చేస్తుంది. ఈ దశలో వెరిఫికేషన్ విఫలం అయితే, ఏదేని ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచీకి వెళ్లాలని సందేశం అందుకుంటారు.
4. ఏటీఎమ్ ద్వారా
ఏదైనా ఎస్‌బీఐ ఏటీఎమ్ వెళ్లడం ద్వారా సైతం ఆధార్ అనుసంధానం చేయవచ్చు.
ఏటీఎమ్ కార్డు స్వైప్ చేసి, పిన్ ఎంటర్ చేయాలి.
తర్వాత వచ్చిన ఆప్షన్లలోని సర్వీస్ సెక్షన్‌లో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
అక్కడ ఆధార్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని ఎంచుకోవాలి.
ఖాతా రకాన్ని ఎంచుకోవాలి.
ఇక్కడ ఆ తర్వాత ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. మళ్లీ రెండోసారి ఎంటర్‌చేయాలి.
ప్రక్రియ పూర్తయినట్లు తెరపై సందేశం ప్రత్యక్షమవుతుంది.
5. ఇంటర్నెట్ బ్యాంకింగ్ చానల్‌లో
ఇప్పట్లో చాలా మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు. మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే ఆధార్ అనుసంధానం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది.
మొదట onlinesbi.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయిన తర్వాత హోంస్క్రీన్‌లో కనిపించే ఆప్షన్లలో నుంచి 'Link your Aadhaar number' అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇది My Accounts సెక్షన్ కింద ఉంటుంది.
ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ నంబరును ఎంచుకుని, ఆధార్ నంబరు ఇవ్వాలి. సబ్‌మిట్ నొక్కాలి.
ఇప్పుడు మీ మొబైల్ నంబరులో చివరి 2అంకెలు కనిపిస్తాయి.
అనుసంధానం స్థితిగతిని బ్యాంకు వినియోగదారు మొబైల్ నంబరుకు సందేశం పంపుతుంది.