బీఎస్ఎన్ఎల్ నంబ‌రుతో ఆధార్ అనుసంధానించ‌డం ఎలా?

ఈ-కేవైసీ సాయంతో సైతం మొబైల్ క‌స్ట‌మ‌ర్లు ఆధార్ లింక్ చేసుకునేందుకు బీఎస్ఎన్ఎల్ వీలు క‌ల్పిస్తోంది. ఈ విధానంలో లింక్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందాం.

ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం మొబైల్ నంబ‌రును ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించ‌డం తప్ప‌నిస‌రి. అదే విధంగా బీఎస్ఎన్ఎల్ త‌న క‌స్ట‌మ‌ర్లంద‌రికీ అనుసంధానం చేసుకోవాల్సిందిగా సందేశాలు పంపుతోంది. ఇందుకోసం వినియోగ‌దారులు సేవా కేంద్రాలు, రిటైల్ అవుట్‌లెట్లు, ఫ్రాంచైజీల్లో సంప్ర‌దించ‌వ‌చ్చు. ఈ-కేవైసీ సాయంతో సైతం మొబైల్ క‌స్ట‌మ‌ర్లు ఆధార్ లింక్ చేసుకునేందుకు బీఎస్ఎన్ఎల్ వీలు క‌ల్పిస్తోంది. ఈ విధానంలో లింక్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందాం.

ఆధార్‌తో మొబైల్ నంబ‌రు అనుసంధానం ఎలా?

ఆధార్‌తో మొబైల్ నంబ‌రు అనుసంధానం ఎలా?

క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లి మీ మొబైల్ నంబ‌రుతో పాటు, ఆధార్ నంబ‌రు చెబితే ఈ-కేవైసీ ఉంటే ఆధార్ అనుసంధానం పూర్తిచేస్తారు. బయోమెట్రిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ బీఎస్ఎన్ఎల్ ఆథ‌రైజ్‌డ్ ఏజెంట్ల ద‌గ్గ‌ర ఉంటే మొబైల్ నంబ‌రుతో ఆధార్ సంఖ్య‌ను అనుసంధానిస్తారు.

ఈ-కేవైసీ యాప్

ఈ-కేవైసీ యాప్

బీఎస్ఎన్ఎల్ అవుట్‌లెట్లో ఆధార్‌, ఫోన్ నంబ‌ర్లు ఇవ్వాలి. బీఎస్ఎన్ఎల్ స్విఫ్ట్ యాప్ లేదా బీఎస్ఎన్ఎల్ ఈ-కేవైసీ అప్లికేష‌న్‌లో వివ‌రాల‌ను న‌మోదు చేసిన త‌ర్వాత బీఎస్ఎన్ఎల్ స్టోర్ ప్ర‌తినిధి మొబైల్ నంబ‌రులో ఫోర్ డిజిట్ వెరిఫికేష‌న్ నంబ‌రును చెప్ప‌మ‌ని అడుగుతారు.

బొట‌న‌వేలు ముద్ర‌

బొట‌న‌వేలు ముద్ర‌

4 డిజిట్ల పిన్‌, ఆధార్ నంబ‌రును బీఎస్ఎన్ఎల్ ప్ర‌తినిధికి ఇవ్వాలి. త‌ర్వాత స్కాన‌ర్‌లో మీ బొట‌న‌వేలి ముద్ర ఉంచ‌మ‌ని అడుగుతారు. అప్పుడు బీఎస్ఎన్ఎల్ ఈ-కేవైసీ అప్లికేష‌న్‌లో ఆధార్ వివ‌రాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. వివ‌రాల‌న్నీ స‌రిచూసుకుని రూఢీ ప‌ర‌చాలి. త‌ర్వాత మ‌ళ్లీ స్కాన‌ర్‌లో బొట‌న‌వేలు పెట్టాలి.

 మొబైల్‌కు సందేశం

మొబైల్‌కు సందేశం

24 గంట‌ల త‌ర్వాత లింకింగ్ పూర్త‌యి, మీ మొబైల్‌కు క‌న్‌ఫ‌ర్మేష‌న్ సందేశాన్ని పంపుతారు. వ‌చ్చే సందేశంలో లింకింగ్ గురించి మీకు టెలికాం సంస్థ తెలియ‌జేస్తుంది. అప్పుడు వినియోగ‌దారు 3 రోజుల్లోగా రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ 'REV YES' or 'REV NO' to 53734 నంబ‌రుకు పంపాలి.

వెరిఫికేష‌న్

వెరిఫికేష‌న్

స‌రైన స‌మ‌యంలోగా వినియోగ‌దారు రెస్పాండ్ అవ్వ‌క‌పోయినా ఆధార్ రిజిస్ట్రేష‌న్ పూర్త‌యిన‌ట్లుగా భావిస్తారు. రెస్పాన్స్ నో అని పంపితే రీవెరిఫికేష‌న్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు క‌స్ట‌మ‌ర్ మొద‌టి నుంచి అనుసంధాన ప్ర‌క్రియ తిరిగి చేయాల్సి ఉంటుంది. రీరిజిస్ట్రేష‌న్‌ను రెండుసార్లు మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

ఆధార్ రిజిస్ట్రేష‌న్ వివ‌రాల చెకింగ్‌

ఆధార్ రిజిస్ట్రేష‌న్ వివ‌రాల చెకింగ్‌

బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారులు ఆధార్‌-బీఎస్ఎన్ఎల్ అనుసంధానాన్ని చెక్ చేసుకోవ‌చ్చు. ఆధార్ రిజిస్ట్రేష‌న్ స్థితిని తెలుసుకోవాల‌నుకుంటే 53734 నంబ‌రుకు REV NAME అనే సందేశాన్ని పంపాలి.

Read in English:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+