రిటైల్ ఇన్వెస్టర్లంతా పెట్టుబడులు సులువుగా పెట్టేందుకు వీలుగా బేసిన్ డీమ్యాట్ ఖాతాలను ప్రారంభించాల్సిందిగా సెబీ ఆదేశించింది.
రిటైల్ ఇన్వెస్టర్లంతా పెట్టుబడులు సులువుగా పెట్టేందుకు వీలుగా బేసిన్ డీమ్యాట్ ఖాతాలను ప్రారంభించాల్సిందిగా సెబీ ఆదేశించింది. నోఫ్రిల్స్ బ్యాంకు పొదుపు ఖాతాల తరహాలోనే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం నో-ఫ్రిల్స్ డీమ్యాట్ అకౌంట్లను ప్రవేశపెట్టారు. బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్ (బీఎస్‌డీఏ)గా వ్యవహరించే ఈ ప్రాథమిక ట్రేడింగ్ అకౌంట్లలో రూ. 2 లక్షల దాకా విలువ గల సెక్యూరిటీలను ఉంచుకోవచ్చు.

ఖాతాలో ఉన్న సెక్యూరిటీల విలువ రూ.50,000 కన్నా తక్కువగా ఉంటే గనుక ఎటువంటి వార్షిక నిర్వహణ రుసుములు ఉండవు. రూ.50,001 నుండి రూ. 2లక్షల లోపు విలువ చేసే సెక్యూరిటీలను ఉంచితే వార్షిక నిర్వహణ రుసుములు రూ.100 వరకు ఉండనుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ రూ.2 లక్షల పైబడి ఈ ఖాతాల్లో హోల్డింగ్స్ ఉంటే రెగ్యులర్ డీమ్యాట్ ఖాతాలకు విధించే రుసుములనే వాటికీ విధించేందుకు సెబీ అనుమతించింది. బీఎస్‌డీఏ ఖాతాల్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సెక్యూరిటీస్‌ను ఉంచుకోవచ్చు.
డీమ్యాట్ స్టేట్‌మెంట్లు
మీకు ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్లు కావాలంటే ఎటువంటి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అక్కర్లేదు. అదే మీకు చిరునామాకు భౌతిక(పేపర్) రూపంలో స్టేట్‌మెంట్లు కావాలంటే మాత్రం ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు రెండు స్టేట్‌మెంట్ల వరకూ ఉచితంగా ఇస్తారు. అదనపు స్టేట్‌మెంట్లకు సైతం రూ.25కు మించకుండా రుసుము వసూలు చేస్తారు. ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక లావాదేవీ అయినా జరిపి ఉంటే మీకు మూడు నెలలకు ఒక ఉచిత స్టేట్మెంట్‌ను పంపుతారు. అదే వార్షిక స్టేట్‌మెంట్ మాత్రం మీ ఎంపికకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ రూపంలో లేదా భౌతిక రూపంలో అందుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications