For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ ఫ్లెక్సీపే హోంలోన్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

ఫ్లెక్సీ పే పథకాన్ని ఎంచుకుంటే అర్హత కంటే ఎక్కువ రుణాన్ని పొందొచ్చు. అప్పుడే ఉద్యోగంలో చేరిన యువతీ యువకుల జీతాలు తక్కువగా ఉండటంతో వీరు విశాలమైన గృహాలను తీసుకోవడానికి వీలుండటం లేదని, రానున్న కాలంలో పె

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో 'ఫ్లెక్సీపే' పేరుతో కొత్త గృహ రుణ‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. సాధారణ గృహ రుణాల్లో ఉద్యోగుల జీతం ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు.
కానీ ఈ ఫ్లెక్సీ పే పథకాన్ని ఎంచుకుంటే అర్హత కంటే ఎక్కువ రుణాన్ని పొందొచ్చు. అప్పుడే ఉద్యోగంలో చేరిన యువతీ యువకుల జీతాలు తక్కువగా ఉండటంతో వీరు విశాలమైన గృహాలను తీసుకోవడానికి వీలుండటం లేదని, రానున్న కాలంలో పెరిగే వారి జీతాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని రూపొందించినట్లు ఎస్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇలా అర్హత కంటే మంజూరు చేసిన అధిక మొత్తాన్ని చెల్లించడానికి మూడు నుంచి ఐదేళ్ల మారిటోరియం కల్పిస్తోంది. ఈ మారిటోరియం సమయంలో ఈ అధిక మొత్తానికి కేవలం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత తీసుకున్న రుణ మొత్తానికి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లెక్సీపే హోంలోన్ గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకుందాం.

ఫ్లెక్సీ పే ల‌క్ష‌ణాలు

ఫ్లెక్సీ పే ల‌క్ష‌ణాలు

త‌క్కువ వ‌డ్డీ రేట్లు

త‌క్కువ ప్రాసెసింగ్ రుసుము

ప్రీ పేమెంట్ పెనాల్టీ ఉండ‌దు

30 ఏళ్ల వ‌ర‌కూ రీపేమెంట్ చేసే వీలు

అర్హ‌త‌

అర్హ‌త‌

భార‌త పౌరులై ఉండాలి

క‌నీస వ‌య‌సు 21 నుంచి 40 ఏళ్ల వ‌ర‌కూ ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలు

70 ఏళ్ల వ‌ర‌కూ చెల్లింపులు జ‌రిపే వీలు

రుణ కాల‌ప‌రిమితి- 30 ఏళ్లు

వ‌డ్డీ రేట్లు, రుసుములు

వ‌డ్డీ రేట్లు, రుసుములు

రూ. 20 ల‌క్ష‌ల నుంచి మొద‌లుకొని రూ.75 లక్ష‌ల వ‌ర‌కూ 8.60%(మ‌హిళ‌ల‌కు), ఇత‌రుల‌కు రూ.8.65%

రూ. 75 లక్ష‌ల పైబ‌డిన రుణాల‌కు 8.65%(మ‌హిళ‌ల‌కు), ఇత‌రుల‌కు 8.70%

ప్రాసెసింగ్ రుసుము రూ.2000 నుంచి మొదలుకొని రూ.10 వేల వ‌ర‌కూ ఉండొచ్చు.

 కావాల్సిన పేప‌ర్లు

కావాల్సిన పేప‌ర్లు

రుణ ద‌ర‌ఖాస్తు ఫారం

వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం

చిరునామా గుర్తింపు

ప్రాప‌ర్టీ(స్థిరాస్తి)కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు

బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్లు

ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

గ‌త 3 సంవ‌త్స‌రాల ఐటీ రిట‌ర్నులు

Read more about: sbi home loan
English summary

ఎస్‌బీఐ ఫ్లెక్సీపే హోంలోన్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు | what is sbi flexipay home loan and what are the features in it?

SBI Flexipay Home loan provides an eligibility for a higher loan amount exclusively for the salaried borrowers. It offers customer the option to pay only interest during the moratorium (pre-EMI) period, and thereafter, pay moderated EMIs. The EMIs will be stepped-up during the subsequent years. This variant of SBI home loan is very useful for young earners. The SBI Flexipay home loan has the potential to lure a large section of home loan buyer towards SBI.
Story first published: Wednesday, August 2, 2017, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X