పొదుపు ఖాతా క‌లిగిన వారికి ఐసీఐసీఐ త‌క్ష‌ణ‌మే క్రెడిట్ కార్డు

కొంత మంది ఎంపిక చేసిన ఐసీఐసీఐ పొదుపు ఖాతాదారుల‌కు త‌క్ష‌ణ‌మే క్రెడిట్ కార్డు జారీ చేసే సౌల‌భ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ప్ర‌వేశ‌పెట్టింది. వీటికి ఎటువంటి రుజువులు లేదా త‌క్ష‌ణ అనుమ‌తులు అవ‌స‌రం లేదు. ఎ

కొంత మంది ఎంపిక చేసిన ఐసీఐసీఐ పొదుపు ఖాతాదారుల‌కు త‌క్ష‌ణ‌మే క్రెడిట్ కార్డు జారీ చేసే సౌల‌భ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ప్ర‌వేశ‌పెట్టింది. వీటికి ఎటువంటి రుజువులు లేదా త‌క్ష‌ణ అనుమ‌తులు అవ‌స‌రం లేదు. ఎంపిక చేసిన వినియోగ‌దారుల‌కు క్ష‌ణాల్లో క్రెడిట్ కార్డు నంబ‌రు వ‌స్తుంది. అంటే కార్డు మీ చేతికి వ‌చ్చే ముందే నంబ‌రు వ‌చ్చేస్తుంది.

ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ క్రెడిట్ కార్డు

ఈ త‌ర‌హా ఇన్‌స్టంట్ క్రెడిట్ కార్డుల‌కు రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌రిమితి ఉంటుంది. అయితే కార్డు ర‌కాన్ని బ‌ట్టి ప‌రిమితి మారుతుంది. మొత్తం ఉన్న వాటిలో కోర‌ల్, రుబిక్స్‌, స‌ఫైరో, ఫెరారీ సిగ్నేచ‌ర్‌, ప్లాటిన‌మ్, యునిఫేర్ కార్డులు దేశ‌వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డుల‌న్నీ కేవ‌లం ఐసీఐసీఐ సేవింగ్ అకౌంట్ ఖాతా క‌లిగిన వారిలో కొంత మందికి మాత్ర‌మే అని గుర్తుంచుకోవాలి. "మీ కోసం త‌యారీ, రేప‌టికి త‌యారీ" అనే నినాదంతో ఐసీఐసీఐ బ్యాంకు సృజ‌నాత్మ‌క ఉత్ప‌త్తుల‌ను తీసుకువ‌స్తుంద‌ని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అనూప్ బాచీ చెప్పారు.

ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌
1. మొద‌ట ఐసీఐసీఐ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వాలి.
2. ఎడ‌మ వైపు ప్రీక్వాలిఫైడ్ ఆఫ‌ర్స్ అనే సెక్ష‌న్ క‌నిపిస్తుంది.
3. ప్రీ క్వాలిఫైడ్ ఆఫ‌ర్స్ కింద వ్య‌క్తిగ‌త రుణం(ప‌ర్స‌న‌ల్ లోన్‌), క్రెడిట్ కార్డు వంటివి ఉంటాయి.
4. ఒక‌వేళ మీకు అర్హ‌త ఉంటే అది యాక్టివ్‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.
5. మీ వ్య‌క్తిగ‌త గుర్తింపుకు సంబంధించి అవ‌స‌ర‌మైన ముఖ్య వివ‌రాలు ఇక్క‌డ ఇవ్వాల్సి ఉంటుంది.
6. నియ‌మ నిబంధ‌న‌ల‌ను అంగీక‌రిస్తూ టిక్ కొట్టిన త‌ర్వాత‌, మీ మొబైల్ నంబర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయాలి.
7. జ‌న‌రేట్ ఇన్‌స్టంట్ క్రెడిట్ కార్డు అనే దానిపై నొక్కాలి. అప్పుడు మీకు ద‌గ్గ‌ర ఫిజిక‌ల్ కార్డు లేకుండా సైతం క్రెడిట్ కార్డు ఉప‌యోగించే వెసులుబాటు క‌లుగుతుంది.
8. తర్వాత కొన్ని రోజుల‌కు పోస్ట్‌లో మామూలు క్రెడిట్ కార్డు మీ అడ్ర‌స్‌కు వ‌స్తుంది.
మ‌రిన్ని వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+