పదవీ విరమణ తర్వాత క్రమమైన ఆదాయం ఉండదు. అందుకే బీమా కంపెనీలన్నీ పెన్షన్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. అలాంటి వాటిలో ఎస్‌బీఐ సైతం ఒక పాలసీని తీసుకొచ్చింది. ఎస్‌బీఐ లైఫ్-సరళ్ పెన్షన్ అనేది
పదవీ విరమణ తర్వాత క్రమమైన ఆదాయం ఉండదు. అందుకే బీమా కంపెనీలన్నీ పెన్షన్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. అలాంటి వాటిలో ఎస్‌బీఐ సైతం ఒక పాలసీని తీసుకొచ్చింది. ఎస్‌బీఐ లైఫ్-సరళ్ పెన్షన్ అనేది వ్యక్తిగత, లాభాలతో కూడిన, సాంప్రదాయమైన పెన్షన్ ప్లాన్. ఇది మీకు భద్రతతో కూడిన భవిష్యత్తు, సంతోషకరమైన పదవీవిరమణ ప్రయోజనాలను అందించి మార్కెట్ ఒడిదుడుకుల నుంచి పూర్తి భద్రత కలిగిస్తుంది. అలాంటి ఎస్‌బీఐ పింఛను పాలసీ లక్షణాలను గురించి తెలుసుకుందాం.

అర్హత:
ఈ పథకంలో చేరేందుకు కనీస వయసు:18, గరిష్ట వయసు సింగిల్ ప్రీమియం పాలసీకయితే 65 ఏళ్లు, రెగ్యులర్ ప్రీమియంకు 60 ఏళ్లు ఉండాలి.

పాలసీ కాలపరిమితి:
సింగిల్ ప్రీమియం పాలసీలకు కనీసం 5 ఏళ్లు మొదలుకొని గరిష్ట టర్మ్ 40 ఏళ్లు ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియంకు 10 నుంచి 40 ఏళ్లుగా ఉంటుంది.

పాలసీ బోనస్
మొదటి 5 సంవత్సరాలకు హామీపూరిత సులభమైన బోనస్‌లు వస్తాయి. మొదటి మూడు సంవత్సరాలకు బీమాపై 2.50 శాతం, ఆ తర్వాతి రెండు సంవత్సరాలకు గాను 2.75 శాతం బోనస్ లభిస్తుంది. అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే హామీపూరిత బోనస్ వర్తిస్తుంది.

మెచ్యూరిటీ తీరిన తర్వాత పాలసీ ముగిసిన తర్వాత
పాలసీలో జమ అయిన బోనస్, బోనస్‌లు ముగింపు, ఏవైనా ఉంటే, బీమాపై 0.25 శాతం చొప్పున ప్రతి సంవత్సరం చక్రవడ్డీ కూడా కలుపబడుతుంది.

పాలసీదారు మరణిస్తే
అనుకోని పరిస్థితుల్లో పాలసీదారు మరణిస్తే (చెల్లించిన ప్రీమియం మొత్తం 0.25% చక్రవడ్డీతో కలిపి + బోనస్) లేదా కనీసంగా చెలిలంచిన మొత్తంపై 105శాతంగా లభిస్తుంది.

జీవిత భద్రత:
ఎస్బీఐ లైఫ్ - అదనపు జీవిత భద్రత ఎంపిక. పెన్షన్ ప్రారంభ తేదీనాడు, మెచ్యూరిటీ మొత్తంతో తక్షణ పెన్షన్ పాలసీ కొనుగోలు చేసుకొనవచ్చు లేదా 1/3వ వంతు నగదు రూపంలో తీసుకుని, మిగిలిన మొత్తంతో పెన్షన్ పాలసీ కొనుగోలు చేయవచ్చు.
సౌకర్యం: మీ గడవు ముగింపు తేదిని 70 సంవత్సరాల వయసు వరకు పొడిగించుకోవచ్చు లేదా మీ పాలసీ జమలను/ముగింపు వ్యవధిని పొడిగించుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications