For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ ఏ వ్యాపారాల‌కు రుణాలిస్తుంది?

లఘు పరిశ్రమలను, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను విస్తృత పరిచేందుకు, సేవారంగాలను మెరుగుపరిచేందుకు, ఆర్ధిక రుణాలను మజూరు చేసే సంస్ధగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక సంస్ధ ఉద్భవించింది. భారతదేశ పారిశ

|

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్
లఘు పరిశ్రమలను, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను విస్తృత పరిచేందుకు, సేవారంగాలను మెరుగుపరిచేందుకు, ఆర్ధిక రుణాలను మజూరు చేసే సంస్ధగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక సంస్ధ ఉద్భవించింది. భారతదేశ పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెప్పుకోతగ్గ స్ధానాన్ని సంపాదించి పెట్టడంలో, రాష్ట్ర ఆర్ధిక సంస్ధ కీలకపాత్ర పోషిస్తుంది. భూమి, భవనాలు, యంత్రాల వంటి స్ధిరాసులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ఆర్ధిక సంస్ధ ఆర్ధిక సాయాన్ని అందిస్తుంది. రూ.10 వేల నుండి రూ. 150 లక్షల వరకూ ఒక్కో యూనిట్‌కు టెర్మ్‌లోన్‌గా కార్పొరేషన్ నుండి లభించే అవకాశాలు చాలా ఉన్నాయి. అది కాకుండా సులభమైన వాయిదాల్లో రుణం తీర్చవచ్చు. గత నలభై సంవత్సరాలకు పైగా కొన్ని వేల, లక్షల పరిశ్రమలకు రుణాలను అందించింది. 5 జోనల్ ఆఫీసులను, 25 బ్రాంచి ఆఫీసులతోను మరియు 2 ఫీల్డు ఆఫీసులను కలిగి ఉండి, రాష్ట్రంలోని మూలమూలలకూ ప్రయాణిస్తూ పారిశ్రామికుడి ఇంటి తలుపు తట్టి మరీ ఆర్ధిక సహాయం చేస్తోంది.

అది ఏ ఏ సంద‌ర్భాల్లో రుణాలిస్తుందో తెలుసుకుందాం.

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్

రుణ‌ మంజూరు అధికారాలు:
బ్రాంచి ఆఫీసులు: రూ. 10 లక్షల వరకూ మంజూరు చేయవచ్చు.

జోనల్ ఆఫీసులు: రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య మంజూరు చేయవచ్చు.

హెడ్ అఫీసు(ప్ర‌ధాన కార్యాల‌యం): రూ. 20 లక్షలకు మించిన రుణాలను మంజూరు చేయవచ్చు.

అర్హత: స్వంత యాజమాన్యం, పార్టనర్ షిప్, ఉమ్మడి హిందూ కుంటుంబం, రిజిష్టర్డ్ కో-ఆపరేటివ్ సొసైటీ (లేదా) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఏవైనా సరే రాష్ట్ర ఆర్ధిక సంస్ధ నుండి రుణాలు పొందవచ్చును.
ఎలాంటి ప్రాజెక్టులకు ఆర్ధిక సహయం లభిస్తుంది?
1. వివిధ ఉత్పత్తుల తయారీ, నిలువ ఉంచడం ప్రాసెస్ చేయడం.
2. ఖనిజాలు, ఖనిజాల వెలికితీత, అభివృద్ధిపర్చుట.
3. హోటళ్ళు, రెస్టారెంట్లు.
4. ప్రయాణీకులను గానీ, ఉత్పత్తులను గానీ రోడ్డు ద్వారా / జలమార్గాల ద్వారా / వాయు మార్గాల ద్వారా లేదా రోప్‌వే లేదా లిప్ట్ లేదా రవాణా చేయడం.
5. విద్యుత్‌ను కానీ / మరే విధమైన శక్తిని కానీ ఉత్పత్తి చేయటం, పంపిణీ చేయడం.
6. యంత్రాలుకానీ, వాహనాలు కానీ, మరేవైనా రకానికి చెందిన మోటార్‌బోట్స్, వెసల్స్, ట్రైలర్స్, ట్రాక్టర్స్ వంటి వాటి నిర్వహణ, రిపేర్, టెస్టింగ్ మరియు సర్వీసింగ్.
7. యంత్రాల సహాయంతోనైనా లేక విద్యుత్ సహాయంతోనైనా ఏవైనా వస్తువుల ప్యాకింగ్, రిపేరింగ్, అసెంబ్లింగ్.
8. పారిశ్రామిక ప్రాంతాలను, పారిశ్రామిక ఎస్టేట్‌లను అభివృద్ధిపరచుట.
9. మత్స్య పరిశ్రమ, దానికి అవసరమయ్యే తీరప్రాంత సౌకర్యాలను కలుగజేయుట.
10. వే-బ్రిడ్జి సౌకర్యం కల్పించుట.
11. పరిశ్రమల కవసరమయ్యే ఇంజనీరింగ్, టెక్నికల్, పైనాన్షియల్, మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ లేదా ఇతర సేవలను సమకూర్చుట.
12. పాలిష్ చేయడం, ఫినిషింగ్, ఆయిలింగ్, వాషింగ్, పరిశుభ్రపర్చడం లేదా వస్తువు ఉపయోగాన్ని బట్టి అమ్మకం, రవాణా, డెలివరీ సౌకర్యాలు కల్పించడం.
13. వైద్య, ఆరోగ్య సంబంధ సేవలను అందించడం.
14. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ లింకేజ్, ఆడియో వీడియో కేబుల్ కమ్యూనికేషన్స్ సమకూర్చడం.
15. ఏదైనా పారిశ్రామిక వస్తువు లేదా అంశంపై రీసెర్చ్, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుట.
16. టూరిజంకు సంబంధించే ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, సెంటర్లు, రెస్టారెంట్లు, రవాణా సౌకర్యాలు, టూరిస్ట్ సర్వీస్ ఏజన్సీలు, ప్రయాణీకులకు గైడెన్సు, కౌన్సిలింగ్ అభివృద్ధిపరుచుట.
17. రోడ్ల మరమ్మత్తు, అభివృద్ధి, నిర్మాణం, రోడ్లు, బోర్‌వెల్ రిగ్గులు వేయటం.
19. అర్హులైన ప్రొఫెషనల్స్‌చే ఎకౌంటెన్సీ, మెడిసిన్, ఆర్క్టెక్చర్, ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రైజ్‌లను మొదలు పెట్టించడం.
20. ఫ్లోరీ కల్చర్.
21. టిష్యూకల్చర్, ఫిష్ కల్చర్, పౌల్ట్రీ, హేచ్చరీలు.
22. హోటల్ పరిశ్రమలో భాగంగా కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం.
పైన పేర్కొన్న జాబితాలో వాటికి దేనికైనా 'ఎస్.ఎఫ్.సి.' నుండి రుణ సాయం పొందవచ్చు.

Read more about: sfc loan business
English summary

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ ఏ వ్యాపారాల‌కు రుణాలిస్తుంది? | For what purpose state finance corporation can give loans?

Andhra Pradesh State Financial Corporation [APSFC] is a state level Development Financial Institution established in 1956 for promoting Small and Medium Scale(SMEs )industries in Andhra Pradesh under the provisions of the State Financial Corporation' (SFC) Act,1951.The corporation has many entrepreneur - friendly schemes to provide term loans,working capital term loans
Story first published: Thursday, July 13, 2017, 11:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X