English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఎస్‌బీఐ చార్జీలన్నీ జీఎస్టీ అమ‌లుతో పెరిగాయి. ఏవి ఎంత‌?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

జీఎస్టీ అమ‌లు త‌ర్వాత కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతున్నాయి. కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి. నిత్యావ‌స‌రాల్లో కొన్నింటిని మాత్రం జీఎస్టీ ప‌రిధి నుంచి తొల‌గించారు. జూన్ 1 నుంచి ఇదివ‌ర‌కే ఎస్‌బీఐ వివిధ చార్జీల‌ను స‌వ‌రించిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకు అందించే వివిధ సేవ‌ల‌కు ఖాతాదారులు సొంతంగా భారం వ‌హించాల్సిందే. జీఎస్టీ జులై 1 నుంచి ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఎస్‌బీఐ చార్జీల‌ను మ‌ళ్లీ స‌వ‌రించాల్సి వ‌చ్చింది. వాటి వివ‌రాలు...

ఎస్‌బీఐ బ‌డ్డీకి సంబంధించిన చార్జీలు

ఎస్‌బీఐ బ‌డ్డీకి సంబంధించిన చార్జీలు

ఇంత‌కుముందు ఆర్థిక సేవ‌లు 15% ప‌న్ను ప‌రిధిలో ఉండ‌గా జీఎస్టీ త‌ర్వాత 18% ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చాయి. దీంతో బ్యాంకులు అందించే సేవ‌లు కాస్త ప్రియ‌మ‌య్యాయి. ఎస్‌బీఐ పత్రికా ప్రక‌ట‌న ప్ర‌కారం ఎస్‌బీఐ బ‌డ్డీ యాప్ ఉప‌యోగించి ఏటీఎమ్ ద్వారా డ‌బ్బు విత్‌డ్రా చేస్తే ఇకపై రూ.25తో పాటు, జీఎస్టీ 18% చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్‌బీఐ బ‌డ్డీ నుంచి పొదుపు ఖాతాకు డ‌బ్బు బ‌దిలీ చేస్తే 3% చార్జీల‌తో పాటు, జీఎస్టీ అద‌నంగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఏటీఎమ్ కార్డు వాడ‌కం గురించి

ఏటీఎమ్ కార్డు వాడ‌కం గురించి

మెట్రో న‌గ‌రాల్లోని అంద‌రూ పొదుపు ఖాతాదారులు 8 ఉచిత ఏటీఎమ్ లావాదేవీల‌ను వాడుకోవ‌చ్చు. ఎస్‌బీఐ ఏటీఎమ్‌ల్లో 5 సార్లు, మిగ‌తా ఏటీఎమ్‌ల్లో 3 సార్లు ఏటీఎమ్ విత్‌డ్రాయ‌ల్స్ ఉచితం. అదే నాన్ మెట్రోల్లో అయితే 10 ఉచిత ఏటీఎమ్ లావాదేవీలు వాడుకునే వెసులుబాటు ఉంది.(5 ఎస్బీఐ, 5 ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల్లో). ప‌రిమితి దాటితే 20 రూపాయ‌ల చార్జీతో పాటు సేవా ప‌న్ను చెల్లించాల్సిందే.

పొదుపు ఖాతా విష‌యంలో

పొదుపు ఖాతా విష‌యంలో

బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్‌(సాధార‌ణ పొదుపు ఖాతా) విష‌యంలో 4 విత్‌డ్రాయ‌ల్స్ చేసేందుకు అవ‌కాశ‌మున్న‌ట్లు ఎస్బీఐ తెలిపింది. ఎందుకంటే ఇది పేద ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక బ్యాంకింగ్ సేవ‌లందించేందుకు ఉద్దేశించింది. ఈ త‌ర‌హా ఖాతాల‌కు ఎటువంటి వార్షిక నిర్వ‌హ‌ణ చార్జీలు ఉండ‌వు. అంతే కాకుండా ఈ ఖాతాలు క‌లిగిన వారంద‌రికీ ఏటీఎమ్ క‌మ్ డెబిట్ కార్డు ఉచితంగా అంద‌జేస్తారు. ఇవే కాకుండా 2017 జూన్ 1 నుంచి ఎస్‌బీఐ చాలా మార్పుల‌ను చేసింది. అవి తెలుసుకోండి.

ఆన్‌లైన్ లావాదేవీలు

ఆన్‌లైన్ లావాదేవీలు

రూ.1 ల‌క్ష‌లోపు ఐఎంపీఎస్ ద్వారా న‌గ‌దు బ‌దిలీ చేస్తే రూ.5 చార్జీ,జీఎస్టీ పడుతుంది. రూ.1 ల‌క్ష మొద‌లుకొని రూ.2 ల‌క్ష‌ల్లోపు న‌గ‌దు బ‌దిలీ చేస్తే రూ.15, జీఎస్టీ అద‌నం. రూ.2 ల‌క్ష‌ల పైన మ‌రియు రూ.5 ల‌క్ష‌ల్లోపు చేసే ఐఎంపీఎస్ బ‌దిలీల‌కు రూ.25, జీఎస్టీ అద‌నం.

చిరిగిపోయిన నోట్ల విష‌యంలో

చిరిగిపోయిన నోట్ల విష‌యంలో

చిరిగిపోయిన నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకోవ‌చ్చు. ఇది ఇంత‌కుముందు ఉచితం. ఎస్‌బీఐ ఈ విష‌యంలో కొన్ని ప‌రిమితులు విధించింది. 20 కంటే ఎక్కువ పాత‌, చిరిగిపోయిన నోట్ల‌ను మార్చుకోవాల‌నుకుంటే వాటి విలువ రూ.5వేలు దాటితే ఒక్కో నోటు మార్చేందుకు రూ.2, సేవా ప‌న్నును విధించనున్న‌ట్లు ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది.

చెక్కు పుస్త‌కాలు

చెక్కు పుస్త‌కాలు

జూన్ 1 నుంచి బేసిక్ పేవింగ్స్ బ్యాంకు ఖాతా క‌లిగిన వారి చెక్కు పుస్త‌కం సైతం చార్జీలు చెల్లించక త‌ప్ప‌దు. 10 లీఫ్లు క‌లిగిన చెక్కు పుస్త‌కానికి రూ.30తో పాటు, 18% జీఎస్టీ; అదే 25 లీఫ్‌లకు అయితే రూ.75, 18% జీఎస్టీ; 50 లీఫ్‌లు క‌లిగిన చెక్కు పుస్త‌కానికి రూ. 150తో పాటుగా జీఎస్టీ అద‌నంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీ తెలిపింది.

ఏటీఎమ్ కార్డు మీద చార్జీలు

ఏటీఎమ్ కార్డు మీద చార్జీలు

కేవ‌లం ఆర్థిక స్వావ‌లంబ‌న కోసం జారీ చేస్తున్న రూపే కార్డుల‌ను మాత్ర‌మే ఉచితంగా అందిస్తారు. జూన్ 1 నుంచి మిగిలిన అన్ని నూత‌న డెబిట్ కార్డుల జారీకి ఎస్‌బీఐ చార్జీలు వ‌సూలు చేస్తోంది. రుసుము ఖాతాను బ‌ట్టి మారుతూ ఉంటుంది. మీ ద‌గ్గ‌ర్లోని ఎస్‌బీఐ బ్రాంచీని సంప్ర‌దించి డెబిట్ కార్డు రుసుముల‌ను గురించి తెలుసుకోండి.

Read more about: sbi, banking, ఎస్‌బీఐ
English summary

After gst sbi adjusted charges for what service how much you have to pay

State Bank of India or SBI, the country's biggest lender, has revised service charges on ATM withdrawal for users of its mobile app "State Bank Buddy," and various other cash transactions, effective June 1. After the much awaited launch of GST or goods and services tax from July 1, the overall burden of these charges for SBI customers has increased further as a service tax of 15 per cent has been replaced with GST of 18 per cent.
Story first published: Monday, July 10, 2017, 10:19 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC