వైద్యం ఏటేటా ఎంతెంత ఖరీదవుతున్నదో అందరికీ తెలుసు. ఎందుకంటే చికిత్సల ఖర్చులు, మందుల రేట్లు ఏటేటా పెరుగుతూనే ఉంటాయి. అందుకు విరుగుడుగా చాలా మంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. ఒక
వైద్యం ఏటేటా ఎంతెంత ఖరీదవుతున్నదో అందరికీ తెలుసు. ఎందుకంటే చికిత్సల ఖర్చులు, మందుల రేట్లు ఏటేటా పెరుగుతూనే ఉంటాయి. అందుకు విరుగుడుగా చాలా మంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. ఒక పాలసీ తోడుగా ఉంటే ఎప్పుడైనా ఆసుపత్రి పాలయినప్పుడు విపరీతంగా వచ్చే ఖర్చులను తగ్గించుకునేందుకు వీలు పడుతుంది. పాలసీ తీసుకునేముందు హడావిడిగా ఎంతో కొంత ప్రీమియం చెల్లించేలా ప్రవర్తించకూడదు.

ఆరోగ్య బీమా పాలసీ గురించి సమీక్ష
చాలా మంది మొదట్లో ఏదో ఒక పాలసీ తీసుకుని ఏటా దాన్నే రెన్యువల్ చేయిస్తూ ఉంటారు. అప్పటి అవసరాల ఆధారంగా పాలసీ బాగానే ఉంటుంది. పాలసీని ప్రతి 3 ఏళ్లకోసారి సమీక్షించుకునే అవసరం ఇప్పుడు ఏర్పడింది. జీవితంలో ఇప్పటికి ప్రతి సంవత్సరం కొన్ని మార్పులు వస్తుంటాయి. మీరు ఉద్యోగం మారి ఉండొచ్చు, నివాసం ఉండే స్థలం మారి ఉండొచ్చు. ప్రతి చోటా వైద్య ఖర్చులు ఒకేలా ఉండవు. కాబట్టి అప్పుడప్పుడు పాలసీ సమీక్ష చేసుకుని అవసరాలకు తగ్గ పాలసీని ఎంచుకోవాలి. సంస్థ అందించే ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా సొంత పాలసీ అవసరమో లేదో చూసుకోవాలి.

రెన్యువబిలిటీ
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ముందుగా దాన్ని జీవితాంతం వర్తించేలా చేసుకునేందుకు వీలుందో లేదో తెలుసుకోవాలి. చాలా మంది ఇప్పుడు బాగానే ఆరోగ్యంగా ఉన్నాం కదా ఇప్పుడెందుకు పాలసీ అని భావిస్తారు. అయితే మనకు పాలసీ కావాలనుకున్నప్పుడు ఎక్కువ ప్రీమియం రేట్లు చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి రూ.5 లక్షల పాలసీకి ఇప్పుడు ప్రీమియం 5 వేలు అవుతుందనుకుంటే 45 ఏళ్ల వయసులో ఈ ప్రీమియం రూ.7 వేలకు పెరగొచ్చు.

ఇతర పాలసీలతో పోల్చి చూసుకోవాలి
ఇప్పుడు ఏది కొనాలన్నా యువత ముందు ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. ఆరోగ్య బీమా పాలసీ విషయంలో సైతం ముందు ఇంటర్నెట్లో బాగా పాలసీల గురించి తెలుసుకోవడం మంచిది. మీకు ఏది సరిపోతుందనేది మీరే తెలుసుకోవాలి. పాలసీ ఖర్చు, కలిగే ప్రయోజనాలు, గది అద్దె ఖర్చులు, సహ పరిమితి చెల్లింపు, అంబులెన్స్ కవరేజీ, ముందస్తు వ్యాధులు, వెయిటింగ్ పీరియడ్ ఆధారంగా పాలసీని ఎంచుకోవాలి.

గ్రూపు ఇన్సూరెన్స్ ఉంటే తీసుకోవడం మంచిదే
ఇప్పుడు చాలా కంపెనీలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తున్నాయి. మీకు వ్యక్తిగత పాలసీ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకు వర్తించే వెసులుబాటు ఉంటే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం సూచనీయం. అయితే మొత్తంగా చూస్తే ఉద్యోగం చేసే వాళ్లయినా, సొంత వ్యాపారులయినా సొంత పాలసీ ఉండటం మాత్రం ఈ రోజుల్లో మంచిది. ఉద్యోగులకు సంస్థ కల్పించే గ్రూప్ పాలసీ రెండో ప్రాధాన్యత కిందనే పరిగణించాలి. ఎందుకంటే మీరు ఉద్యోగం మారినా, పదవీ విరమణ చేసినా ఈ పాలసీ మీకు తోడుండదు.

కుటుంబానికి అంతటికీ ఒక పాలసీ
ఒకే ఫ్యామిలీ ప్లోటర్ ప్లాన్ ఉంటే ఒక్కొక్కరికి ఒక పాలసీ తీసుకునే బాధ ఉండదు. ఒకే దాని కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య ఖర్చులను కవర్ చేయవచ్చు. దీని వల్ల ప్రీమియం ఖర్చు తగ్గించినవారవుతారు. పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలను కుటుంబ సభ్యులందరి కోసం వాడుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications