నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ వస్తువులపై స్పాట్ ట్రేడింగ్ వీలు కల్పించే అధ్బుతమైన ప్లాట్ ఫామ్. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లి
నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ వస్తువులపై స్పాట్ ట్రేడింగ్ వీలు కల్పించే అధ్బుతమైన ప్లాట్ ఫామ్. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ రెండింటి జాయింట్ వెంచరే ఈ నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్. భారతదేశంలో ఉన్న నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్, మల్టీ కమోటిడీ ఎక్స్ఛేంజ్‌ల మాదిరిగానే ఈ ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ పని చేస్తుంది.

నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ లైవ్ ట్రేడింగ్‌ని మొట్టమొదటి సారి అక్టోబర్ 15, 2008లో ప్రారంభించింది. మొదటి సారి వెండి మరియు బంగారు కడ్డీలు దిగుమతి కోసం అహ్మదాబాద్, ముంబై వేదికగా పత్తి బేళ్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 52 వస్తువులను 16 రాష్ట్రాల్లో ఉన్న వివిధ రాజధానుల నుండి దిగుమతి చేసుకుంటుంది.

నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఎగుమతిదారులు వస్తువులు, రైతులు, దిగుమతిదారులు, ప్రాసెసర్లు మరియు వ్యాపారులు సేకరణ, నిల్వ, గిడ్డంగి రసీదులు ఫైనాన్సింగ్ మరియు మార్కెటింగ్ కోసం కస్టమ్ చేసిపెట్టిన పరిష్కారాలను అందిస్తుంది.
ఇన్వెస్టర్లు ఎటువంటి సమస్యలు లేకుండా సాధారణ పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడులు పెట్టడం చాలా మంచింది. ఇందులో ప్రతి వంద గ్రాముల వెండిని ఒక యూనిట్ అంటే ఒక షేర్‌గా పరిగణిస్తారు. మన సామర్ద్యాన్ని బట్టి ఎన్ని యూనిట్లు కావాలంటే అన్ని యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలు చేసిన తర్వాత మామూలు షేర్ల లాగే మన డీమ్యాట్ ఖాతాలోకి వస్తాయి. అంతేకాకుండా మామూలు షేర్ల మాదిరే వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. వెండి కొనాలంటే డీమ్యాట్‌లోని యూనిట్లును సరెండర్ చేస్తే వెండిని ఇస్తారు (కొన్ని షరతులకు లోబడి). కాబట్టి వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఒక ఉత్తమమైన సాధనం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications