ఎండోమెంట్ పాలసీ అంటే ఏమిటి?
ఎండోమెంట్ పాలసీ అంటే పెట్టుబడి, బీమా రక్షణ కలగలిసి ఉండే పాలసీ. బీమా హామీతో పాటు పెట్టుబడి మార్గంగా ఉపకరించేందుకు రూపొందించినవే ఈ తరహా పాలసీలు. పాలసీ కాలపరిమితి ఉన్నంతవరకూ రిస్క్ కవరేజీ ఉంటుంద
ఎండోమెంట్ పాలసీ అంటే పెట్టుబడి, బీమా రక్షణ కలగలిసి ఉండే పాలసీ. బీమా హామీతో పాటు పెట్టుబడి మార్గంగా ఉపకరించేందుకు రూపొందించినవే ఈ తరహా పాలసీలు. పాలసీ కాలపరిమితి ఉన్నంతవరకూ రిస్క్ కవరేజీ ఉంటుంది. పాలసీదారుడికి బీమా హామీ మొత్తంతో పాటు బోనస్‌ను (లేదా) పాలసీ కాలవ్యవధి ముగిసిన తర్వాత దశల వారీగా కొంత మొత్తాన్ని నిర్ణీత కాలం పాటు చెల్లించే సదుపాయం ఎండోమెంట్ పాలసీల్లో ఉంటుంది. పాలసీదారుడికి అనుకోకుండా ఏదైనా జరిగితే, బీమా హామీ మొత్తాన్ని అప్పటివరకూ జమ అయిన బోనస్‌తో కలిపి చెల్లిస్తారు. పాలసీ కాలవ్యవధి పూర్తయ్యేవరకు పాలసీదారుడు జీవించి ఉంటే చివర్లో బీమా హామీ మొత్తంతో పాటు బోనస్‌ను చెల్లిస్తారు. ఈ రకమైన పాలసీలు 7 ఏళ్ల నుంచి మొదలుకొని 30 ఏళ్ల కాలపరిమితి వరకూ ఉన్నాయి. పొదుపు, బీమా కల్పించడంతో పాటు పన్ను ఆదాకు కూడా ఇవి ఉపయోగపడతాయి. కేవలం బీమా కవరేజీ కాకుండా దీర్ఘకాలంలో డబ్బు రాబడి ఆశించేవారు ఇలాంటి వాటివైపు మొగ్గుచూపొచ్చు.

ఈ పధకాలు ప్రత్యేకంగా ధనాన్ని కూడబెట్టడం కోసం మరియు అదే సమయంలో భవిష్యత్తులో ఏదైనా అపాయం నుండి రక్షణ కోసం ఏర్పడ్డాయి. పాలసీ లక్షణం పై ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా భీమా పాలసీలు వార్షిక, అర్ధ వార్షిక మరియు త్రైమాసికంగా ప్రీమియం చెల్లించే విధాన పద్ధతిలో ఉంటాయి. ప్రీమియం చెల్లింపులో ఎప్పుడూ క్రమబద్ధంగా ఉండాలి. భీమా కంపెనీలు, ప్రీమియం చెల్లింపు కాలపరిమితి దాటిపోయాక కూడ కొంత వెసులుబాటు సమయం కేటాయిస్తాయి. మీరు ఈ గ్రేస్ పీరియడ్ సమయం లోపల చెల్లింపు చేయక పోయినట్లైతే మీ పాలసీ రద్దు అయిపోతుంది.


Click it and Unblock the Notifications