బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీలకు దేశంలో మూడు ప్రధాన పద్దతులను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బ్యాంకు ఖాతాదారులకు ఎక్కువగా నెఫ్ట్, ఐఎంపీఎస్ ఉపయోగపడుతుండగా ఆర్‌టీజీఎస్ మాత్రం పెద్ద
బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీలకు దేశంలో మూడు ప్రధాన పద్దతులను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బ్యాంకు ఖాతాదారులకు ఎక్కువగా నెఫ్ట్, ఐఎంపీఎస్ ఉపయోగపడుతుండగా ఆర్‌టీజీఎస్ మాత్రం పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసేవారి కోసం ఉద్దేశించింది. ఆర్‌టీజీఎస్ నగదు బదిలీలో కనీస మొత్తం రూ.2 లక్షల నుంచి మొదలుకొని రూ.10 లక్షల వరకూ బదిలీ చేయవచ్చు. ఇందులో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ చేసే బదిలీపై రూ.25తో పాటు సేవా పన్ను వసూలు చేస్తారు. అదే రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య చేసే బదిలీపై రూ.50తో పాటు సేవా పన్ను వసూలు చేస్తారు.