For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే: 92 పైస‌ల‌కే 10 ల‌క్ష‌ల‌ ఇన్సూరెన్స్‌

ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా అనుకోని కార‌ణాల‌తో దేశంలో రైలు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఒక‌వేళ ప్ర‌యాణికుల‌కు ఏమైనా జ‌రిగితే ఆ కుటుంబ స‌భ్యుల‌కు జ‌రిగే ఆర్థిక న‌ష్టం ఎవ‌రూ పూడ్చ‌లేరు. ఈ నేప‌థ

|

ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా అనుకోని కార‌ణాల‌తో దేశంలో రైలు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఒక‌వేళ ప్ర‌యాణికుల‌కు ఏమైనా జ‌రిగితే ఆ కుటుంబ స‌భ్యుల‌కు జ‌రిగే ఆర్థిక న‌ష్టం ఎవ‌రూ పూడ్చ‌లేరు. ఈ నేప‌థ్యంలో రైల్వే ఒక వినూత్న బీమాను గ‌తేడాది తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ ఆన్ లైన్ బుకింగ్ ద్వారా తీసుకున్న టికెట్లకు 92 పైసల ప్రీమియాన్ని వసూలు చేస్తున్నారు. ఈ కొత్త ప్రమాద బీమాలో భాగంగా, సబర్బన్ రైళ్లు మినహా మిగతా అన్ని రైళ్లలో ప్రయాణాలు జరిపే వారికి బీమా వర్తిస్తుందన్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షలు, అంగవికలురైతే రూ. 7.5 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్సకు రూ. 2 లక్షలు బీమాగా అందేలా బీమా పాల‌సీల‌ను రూపొందించారు.

 రైల్వే నుంచి ప్ర‌యాణికుల‌కు రూ.10 ల‌క్ష‌ల బీమా

దీనికి అదనంగా మృతదేహాలను ప్రమాదస్థలి నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు 10 వేల రూపాయ‌లను బీమా పాల‌సీ అందిస్తుంది. ఉగ్రవాద దాడులు, దోపిడీలు, దొంగతనాలు, రైలు ప్రమాదాలు తదితరాలన్నింటికీ బీమా వర్తిస్తుంది. కాగా, రైలు టికెట్ ను ర‌ద్దు చేస్తే మాత్రం ముందు వసూలు చేసిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇవ్వరు.

Read more about: insurance rail
English summary

రైల్వే: 92 పైస‌ల‌కే 10 ల‌క్ష‌ల‌ ఇన్సూరెన్స్‌ | Railway 10 lakh insurance for just 92 paise

As per reports, the IRCTC's action came three days after Finance Minister Arun Jaitley announced a free accident insurance cover of Rs 10 lakh for passengers who buy railway tickets online, in a bid to promote the cashless transaction post demonetisation of Rs 500 and Rs 1,000 currency notes.
Story first published: Monday, June 19, 2017, 13:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X