రెగ్యులర్ ప్లాన్‌లను డైరెక్ట్ ప్లాన్‌లుగా మార్చుకోవచ్చు. అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తులను నింపి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థకు సమర్పించాలి.
రెగ్యులర్ ప్లాన్‌లను డైరెక్ట్ ప్లాన్‌లుగా మార్చుకోవచ్చు. అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తులను నింపి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థకు సమర్పించాలి. మీరు పెట్టుబడి పెడుతున్న పథకం పేరు పక్కన డైరెక్ట్ అని స్పష్టంగా రాయాలి. ఏఆర్‌ఎన్(యాంఫీ రిజిస్ట్రేషన్ నంబర్) కోడ్‌ను కూడా రాయడం మర్చిపోకండి. మీ దరఖాస్తును పరిశీలించి మీ రెగ్యులర్ ప్లాన్‌లను డైరెక్ట్ ప్లాన్‌లుగా మార్చడానికి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థకు కనీసం పది రోజులు పడుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి మీకు వచ్చే స్టేట్‌మెంట్‌లో మీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు పక్కన డైరెక్ట్‌ప్లాన్ అని ఉంటుంది. ఇలా అయితే మీ ప్లాన్ రెగ్యులర్ నుంచి డైరెక్ట్‌కు మారినట్లు నిర్దారించుకోవచ్చు.

అన్ని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైరెక్ట్ ప్లాన్‌లుగా మార్చుకోవచ్చు. ఈటీఎఫ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్), లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఇతర స్కీమ్‌లకు ఆ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాతనే డైరెక్ట్ ప్లాన్‌లుగా మార్చుకునే వీలు ఉంటుంది. ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ను రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్‌లకు మార్చడానికి ప్రస్తుతం ఏ మ్యూచువల్ ఫండ్ ఎలాంటి ఎగ్జిట్ లోడ్‌ను వసూలు చేయడం లేదు.
ఎందుకైనా మంచిది మీరు మార్చాలనుకుంటున్న స్కీమ్‌లకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ సంస్థ ఏవైనా చార్జీలు వసూలు చేస్తుందో లేదో ముందుగానే తెలుసుకుంటే మంచిది. రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్‌లకు మారడమనేది మ్యూచువల్ ఫండ్ యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. అందుకని, ఇలా మారేటప్పుడు మీపై ఏమైనా మూలధన లాభాల పన్నులు పడతాయేమో అనే విషయం కూడా సరి చూసుకోవాలి.ఒకవేళ మీరు ప్రస్తుతం ఏదైనా రెగ్యులర్ ప్లాన్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, ఈ సిప్‌ను ఆపేయాలి. డైరెక్ట్ ప్లాన్‌లో కొత్త సిప్‌ను ప్రారంభించాలి.


Click it and Unblock the Notifications