For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబ‌డికి బంగారం కంటే ఉత్త‌మ‌మేనా?

నేరుగా బంగారంలో ఇన్వెస్ట్ చేయకుండా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీల షేర్లు కొనే ఫండ్స్‌ను గోల్డ్ ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఎప్పుడైనా ఎంత‌మొత్తంలోనైనా పెట్టుబ‌డి పెట్టేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌లు బాగా వీలు క‌ల

|

గోల్డ్ ఫండ్స్‌ను వాటి పెట్టుబడి విధానాన్నిబట్టి మూడు రకాలుగా విభజించవచ్చు. నేరుగా బంగారంలో ఇన్వెస్ట్ చేసే వాటిని గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటారు. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తంతో వివిధ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసే వాటిని ఈటీఎఫ్ ఫీడర్ ఫండ్స్ అంటారు. అసలు నేరుగా బంగారంలో ఇన్వెస్ట్ చేయకుండా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీల షేర్లు కొనే ఫండ్స్‌ను గోల్డ్ ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఎప్పుడైనా ఎంత‌మొత్తంలోనైనా పెట్టుబ‌డి పెట్టేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌లు బాగా వీలు క‌ల్పిస్తాయి. పెట్టుబ‌డి,రాబ‌డుల‌ పరంగా వెండి, బంగారాల్లో ఏ విధంగా పెట్టుబడి చేస్తే బాగుంటుందో ఈ వారం పరిశీలిద్దాం. బంగారంలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబ‌డిదారుల పోర్ట్‌ఫోలియోకు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసుకుందాం.

ప‌సిడిపై పెట్టుబ‌డికి ప‌లు మార్గాలు

ప‌సిడిపై పెట్టుబ‌డికి ప‌లు మార్గాలు

బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ కోసం బంగారాన్ని నేరుగా కొనడం కంటే ఈ-గోల్డ్(డీమ్యాట్) రూపంలో కొనడమే మేలని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బహిరంగ మార్కెట్ ధరతో పోలిస్తే బ్యాంకుల్లో లభించే బంగారం ధరలు 15 శాతం ప్రీమియంతో ఉంటాయి. దీనికి కారణం సర్టిఫికేషన్, ప్యాకింగ్ కారణమని బ్యాంకింగ్ అధికారులు పేర్కొంటున్నారు. పైగా వీటిని బ్యాంకులు తిరిగి కొనవు. అంతేకాకుండా వీటిని భద్రపర్చడమనేది మరో సమస్య. ఇలాంటి సమస్యలు లేకుండా పేపర్ రూపంలో (డీమ్యాట్) బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఫండ్స్, ఫ్యూచర్స్ అనే రెండు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో చార్జీలు రెండు శాతంలోపే ఉంటాయి.

గోల్డ్ ఈటీఎఫ్‌లు

గోల్డ్ ఈటీఎఫ్‌లు

మ్యూచువల్ ఫండ్ విధానంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనువైనవి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంతో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ఇన్వెస్ట్ చేసిన విలువకు సమానంగా యూనిట్లను కేటాయిస్తారు. ఇవి అందించే రాబడులు బహిరంగ మార్కెట్లో బంగారం ధరల కదలికలకు సమానంగా ఉంటాయి. ఈటీఎఫ్‌లు ఓపెన్-ఎండెడ్ ఫండ్స్ కావడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనవ‌చ్చు, అమ్ముకోవచ్చు. ఎస్‌బీఐ, రిలయన్స్, యూటీఐ, బెంచ్‌మార్క్ వంటి పది సంస్థలు గోల్డ్ ఈటీఎఫ్‌లను అందిస్తున్నాయి. ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డీ-మ్యాట్ అకౌంట్ ఉండాలి.

ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎలా ప‌నిచేస్తాయి?

ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎలా ప‌నిచేస్తాయి?

మ‌దుప‌ర్ల నుంచి సేక‌రించిన సొమ్మును గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ నిర్వాహ‌కులు బంగారంపై పెట్టుబ‌డి పెడ‌తారు. ఈ ఫండ్లు షేర్ల మాదిరిగానే దేశీయ స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతాయి. డిమాండ్‌,సర‌ఫ‌రా ఆధారంగా ధ‌ర‌ల్లో మార్పులు ఉంటాయి. ట్రేడింగ్ స‌మ‌యాల్లో ఎప్పుడైనా ఈ ఫండ్ల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు. మ‌న ఫండ్ విలువ బంగారం ధ‌ర‌ల క‌ద‌లిక‌ల ఆధారంగా మారుతూ ఉంటుంది. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లేదు. కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.5,000.

 గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబ‌డులు ఏ విధంగా ప్ర‌త్యేకం?

గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబ‌డులు ఏ విధంగా ప్ర‌త్యేకం?

గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఎలాంటి ప్రవేశ, అమ్మకపు చార్జీలు ఉండ‌వు. ఐసీఐసీఐ డెరైక్ట్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వంటి బ్రోకరేజ్ సంస్థల ద్వారా కొంటే 0.5-0.75 శాతం బ్రోకరేజ్ చెల్లిస్తే సరిపోతుంది. అలాగే నేరుగా బంగారాన్ని కొనుగోలు చేస్తే కొన్నప్పటి నుంచి మూడు సంవత్సరాలు దాటితేనే దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను వర్తిస్తుంది. కాని గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మాత్రం సంవత్సరం దాటితే చాలు. ఏడాదిలోపు వైదొలిగితే వారి వ్యక్తిగత ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను భారం పడుతుంది. అదే ఏడాది దాటితే ఇండెక్సేషన్ పరిగణనలోకి తీసుకోకపోతే లాభాలపై 10 శాతం, ఇండెక్సేషన్ లెక్కిస్తే 20% పన్ను భారం పడుతుంది.

ఈటీఎఫ్ ఫీడర్ ఫండ్స్

ఈటీఎఫ్ ఫీడర్ ఫండ్స్

డీ మ్యాట్ అకౌంట్ లేకుండా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి కోసం ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ ఫీడర్ ఫండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఫండ్-ఆఫ్-ఫండ్ కోవలోకి వస్తాయి. అంటే ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తంతో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేయకుండా.. బంగారంలో ఇన్వెస్ట్ చేసే గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్‌లో పెట్టుబడి చేస్తాయి. అంటే మీ తరఫున ఈ పథకాలు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిల్లో సిప్ విధానంలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.5,000. ప్రస్తుతం రిలయన్స్ గోల్డ్ సేవింగ్స్, కొటక్ గోల్డ్ ఫండ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ మధ్యనే ప్రవేశించాయి కాబట్టి వీటి పనితీరును అప్పుడే అంచనా వేయలేం.

ఈటీఎఫ్ ఫీడ‌ర్ ఫండ్ల వ‌ల్ల ప్రయోజనం:

ఈటీఎఫ్ ఫీడ‌ర్ ఫండ్ల వ‌ల్ల ప్రయోజనం:

వీటిలో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ఎటువంటి ఎంట్రీలోడ్(ప్రవేశ చార్జీ) లేదు. కాని సంవత్సరంలోపల వైదొలిగితే రెండు శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. మిగిలిన పన్ను ప్రయోజనాల విషయానికి వస్తే గోల్డ్ ఈటీఎఫ్ నిబంధనలే వర్తిస్తాయి. ఇక్క‌డ ఒక మాస్ట‌ర్ ఫండ్ బంగారానికి సంబంధించి ఉంటుంది. అందులో మ‌దుప‌ర్ల సొమ్మును పెట్టుబ‌డిగా పెడ‌తారు. వీటికి ఒక పెట్టుబ‌డి స‌ల‌హాదారు ఉంటారు. అన్ని పోర్ట్‌ఫోలియో పెట్టుబ‌డుల‌ను నిర్వ‌హించ‌డం, ట్రేడింగ్ వ్య‌వ‌హారాలు స‌ల‌హాదారు చేతుల మీదే జ‌రుగుతాయి.

యూనిట్ల నిర్వ‌హ‌ణ‌, డెలివ‌రీ

యూనిట్ల నిర్వ‌హ‌ణ‌, డెలివ‌రీ

ఫండ్ నిర్వాహ‌కులు ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా ప‌రిగ‌ణిస్తారు. కొన్ని ఫండ్ నిర్వ‌హ‌ణ సంస్థ‌లు పెట్టుబ‌డిదారుల‌ను ప్రోత్స‌హించేందుకు అర‌గ్రాము చొప్పున ఇచ్చే ప‌థ‌కాల‌ను సైతం అందుబాటులోకి తెచ్చాయి. స్వ‌చ్చ‌మైన బంగారం కొనుగోలు చేసి ఎంఎంటీసీ వంటి సంస్థ‌ల వ‌ద్ద భ‌ద్ర‌ప‌రుస్తారు. మ‌నం కొనుక్కున్న ప‌రిమాణం ఒక యూనిట్ గ్రాము అని భావిస్తే ఎన్ని యూనిట్లు కొనుగోలు చేస్తే అన్ని గ్రాముల బంగారం ఉంటుంది. క‌నీసం 10 గ్రాముల నుంచి డెలివ‌రీ తీసుకునే వీలు క‌ల్పిస్తున్నాయి. మ‌న వ‌ద్ద‌కు బంగారాన్ని చేర్చేందుకు అద‌నంగా డెలివ‌రీ చార్జీల‌ను తీసుకుంటారు.

Read more about: gold silver బంగారం
English summary

గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబ‌డికి బంగారం కంటే ఉత్త‌మ‌మేనా? | Gold ETFs the other way of investing in gold online

Another way of taking exposure to gold is gold ETFs, financial instruments that track the price of gold. "Gold ETFs are the same as mutual fund units where each unit is equivalent to one gram gold, though some funds give the option to invest in lower denominations of 0.5 gram as well. 
Story first published: Friday, May 5, 2017, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X