వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలకమైంది పన్ను ప్రణాళికే. పన్ను మినహాయింపు పొందుతూనే.. అధిక రాబడి ఆర్జించే పథకాలను ఎంచుకోవడం ఎప్పుడూ లాభదాయకమే. వేతన జీవులకు పన్ను కోతలు మొదలైన నేపథ్యంలో.. పన్ను భారం తగ
వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలకమైంది పన్ను ప్రణాళికే. పన్ను మినహాయింపు పొందుతూనే.. అధిక రాబడి ఆర్జించే పథకాలను ఎంచుకోవడం ఎప్పుడూ లాభదాయకమే. వేతన జీవులకు పన్ను కోతలు మొదలైన నేపథ్యంలో.. పన్ను భారం తగ్గించుకోవడానికి అందుబాటులో ఉన్న పథకాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. పన్ను తప్పించుకునేందుకు చాలా మంది చేసే పని హడావిడిగా ఏదో పాలసీ తీసుకోవడం, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం. అలా కాకుండా ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక ఉంటే మంచి మార్గాలను ఎంచుకుని ఒక పక్క పన్ను ఆదా చేసుకోవడంతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడులను సాధించవచ్చు. అలాంటి వాటిలో ఒక పెట్టుబడి మార్గం గురించి ఇక్కడ చూద్దాం.

ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు అంటే ఏమిటి?
దీర్ఘకాలంలో తమ పెట్టుబడులకు మంచి రాబడులు రావాలని ఆలోచించే వారు స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువగా లాభాలు ఎక్కడా సాధించలేరు. అయితే అందరూ ధైర్యం చేసి(రిస్క్ తీసుకుని) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టలేరు. అలాంటి వారికి ఫండ్లు, ఈఎల్ఎస్ఎస్, ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లు వంటివి ఉంటాయి. ఈ విధంగా ఈక్విటీ మార్కెట్లలో నేరుగా పెట్టుబడి పెట్టకుండా లాభాలను ఆర్జించే వారి కోసం ఉద్దేశించినవే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు(ఈఎల్ఎస్ఎస్). ఈ పథకానికి సంబంధించిన పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లోని వివిధ కంపెనీల షేర్లలో పెడతారు.

ఈఎల్ఎస్ఎస్ ఎందుకు?
ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.5 లక్షల పెట్టుబడుల వరకు పన్ను మినహాయింపులను పొందవచ్చు. పన్ను ఆదాయంలోంచి ఈ విభాగంలో సూచించిన సాధనాల్లో పెట్టుబడులను మినహాయంచవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాల బ్యాంక్ డిపాజిట్లు, స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు ఉంటాయి.

ఈఎల్ఎస్ఎస్ ఉపయోగాలు:
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే ఉంటాయి. దీర్ఘకాల పెట్టుబడుల్లో అతి తక్కువ లాక్ఇన్ పీరియడ్ ఉన్న ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు ఇవే. ప్రస్తుతం వీటికి 3 సంవత్సరాల లాకిన్ పీరియడ్ తప్పనిసరి. ఎఫ్‌డీ, పీపీఎప్, ఎన్ఎస్‌సీ వంటి వాటితో పోల్చి చూసినప్పుడు ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోనే రాబడులు ఎ్కువగా ఉంటాయి.

ఇందులో రుసుములు ఏముంటాయి?
- సాధారణ మ్యూచువల్ ఫండ్లలాగానే ఈఎల్ఎస్ఎస్‌లోనూ ప్రారంభ చార్జీలు ఉండవు.
- మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ వర్తిస్తుంది కాబట్టి పెట్టుబడులను 3ఏళ్ల వరకూ విత్‌డ్రా చేసుకోలేరు.
- ఆయా మ్యూచువల్ ఫండ్ సంస్థలను బట్టి ఫండ్ నిర్వహణ చార్జీలు ఉంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications