ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోటుపై సంతకం పెట్టాల్సి రావొచ్చు. తాను తీసుకున్న అప్పుకు ఇది సాక్ష్యంగా ఉంటుంది. అటువంటి ప్రామిసరీ నోటులో చిన్న చిన్న తప్పుల వల్ల
సులువుగా డబ్బు అప్పు పొందడం కోసం రుణ గ్రహీతలు ప్రామిసరీ నోటు రాసి ఇస్తారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోటుపై సంతకం పెట్టాల్సి రావొచ్చు. తాను తీసుకున్న అప్పుకు ఇది సాక్ష్యంగా ఉంటుంది. అటువంటి ప్రామిసరీ నోటులో చిన్న చిన్న తప్పుల వల్ల భవిష్యత్తులో రుణ దాతలు ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో దాని గురించి సమగ్రంగా తెలసుకుందాం.

ప్రామిసరీ నోటుకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు
1. రాతపూర్వకంగా ఉండాలి.
2. షరతులు లేకుండా ఉండాలి.
3. అప్పు తీసుకునే వారి పేరు స్పష్టంగా ఉండాలి. అంటే ప్రభుత్వ వ్యవహరాల్లో భాగంగా ఎలా ఉందో అలా ఉండేలా చూసుకోవాలి.
4. ఎవరి పేరు మీద రాయబడింది, ఎవరికి ఇవ్వాల్సింది రాయాలి.
5. ప్రామిసరీ నోటు రాసిన స్థల, తేదీలను పేర్కొనాలి.
6. అప్పు తీసుకున్న సొమ్ము అంకెల్లోనూ, అక్షరాల్లోనూ రాయాలి.
7. రెవెన్యూ స్టాంప్ అంటించి, సంతకం చేయాలి.
8. అడిగిన తక్షణం మీకు గానీ మీ అనుమతి పొందిన మరొకరికి గానీ సొమ్ము చెల్లించగల వాడను అనే భేషరతు నిర్వహణ ఉండేలా చూసుకోవాలి.
9. సాక్షుల వివరాలు ఉంటే మంచిది.
10. దీనికి అటెస్టేషన్ అవసరం లేదు.
11. నగదు ద్వారా ముట్టినదో, చెక్కుద్వారా ముట్టినదో రాయాల్సి ఉంటుంది.
12. ప్రామిసరీ నోటులో పోస్టాఫీసు జారీ చేసే రెవెన్యూ స్టాంప్‌లను అతికించాలి.
తీసుకున్న అప్పును తీర్చవలసిన సమయంలో తీర్చకపోతే, సివిల్ కోర్టులో డబ్బు వసూలు చేయడం కోసం కేసు వేయవచ్చును.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications