రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?

మార్కెట్లో అందుబాటులో ఉన్న పొదుపు సాధ‌నాల్లో అతి సాధార‌ణ‌మైన పెట్టుబడి ప‌థ‌కం ఆర్‌డీ(రిక‌రింగ్ డిపాజిట్). సంపాద‌న తొలి ద‌శల్లో ఏ పెట్టుబ‌డిపై స్ప‌ష్ట‌త లేన‌ప్పుడు ఎవ‌రైనా తొలిగా ఆర్‌డీని ప్రారంభించడం

మార్కెట్లో అందుబాటులో ఉన్న పొదుపు సాధ‌నాల్లో అతి సాధార‌ణ‌మైన పెట్టుబడి ప‌థ‌కం ఆర్‌డీ(రిక‌రింగ్ డిపాజిట్). సంపాద‌న తొలి ద‌శల్లో ఏ పెట్టుబ‌డిపై స్ప‌ష్ట‌త లేన‌ప్పుడు ఎవ‌రైనా తొలిగా ఆర్‌డీని ప్రారంభించడం మేలు. షేర్లు కొనాలంటే చాలా మంది న‌ష్ట‌భ‌యం త‌ట్టుకునే శ‌క్తి ఉండ‌దు. బంగారం రేట్ల‌లో హెచ్చుత‌గ్గులు ఉండ‌నే ఉంటాయి. మ‌రి భ‌విష్య‌త్తుకు భ‌రోసానిచ్చే పొదుపు మార్గాల్లో అనువైన‌ది ఏదంటే చాలా మంది చెప్పేది రిక‌రింగ్ డిపాజిట్‌. ఆర్‌డీ పెట్టుబ‌డి మార్గం, దాని ద్వారా ఎలాంటి లాభాలున్నాయో ఇక్క‌డ తెలుసుకుందాం.

1. రిక‌రింగ్ డిపాజిట్ ప్రాథ‌మిక ఉద్దేశం

1. రిక‌రింగ్ డిపాజిట్ ప్రాథ‌మిక ఉద్దేశం

ఓ క్రమ పద్ధతిలో నగదును దాచుకునేందుకు బ్యాంకులు అందించే పెట్టుబడి సాధనాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఈ రికరింగ్ డిపాజిట్లలో నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ వార్షికానికి ఒక‌సారి నగదుని చెల్లించవచ్చు. త‌పాలా కార్యాల‌యాలు, బ్యాంకులు లేదా చిట్ ఫండ్స్ లాంటి సంస్ధలను మీరు రికరింగ్ డిపాజిట్లను పెట్టుబడి పెట్టేందుకు ఎంచుకోవచ్చు. వీటిల్లో ఎక్కడైతే అత్యధికంగా వడ్డీ వస్తుందో వాటిల్లో ఈ రికరింగ్ డిపాజిట్లను తీసుకుంటే మంచిదని ఆర్ధిక నిపుణులు తెలియజేస్తున్నారు.

2. వ‌డ్డీలు ఎలా ఉంటాయి?

2. వ‌డ్డీలు ఎలా ఉంటాయి?

అన్ని బ్యాంకుల్లో కూడా రికరింగ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ సమానంగానే ఉంటుంది. కాగా, ప్రైవేట్ బ్యాంకులైన యస్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్‌ లాంటివి రికరింగ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు దీర్ఘ‌కాల‌ రికరింగ్ డిపాజిట్లపై 6.25-6.95 శాతం మ‌ధ్య వడ్డీని అందిస్తున్నాయి. యస్ బ్యాంకు దీర్ఘ‌కాల ఆర్‌డీల‌పై 7 శాతంపైనే వ‌డ్డీని ఇస్తున్న‌ది. ముందుగా రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వినియోగదారులు బ్యాంకులు అందించే వడ్డీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

3. ఉద్యోగులైతే వేత‌న ఖాతా ఉన్న బ్యాంకులో ఆర్‌డీ తెర‌వ‌డం మంచిది

3. ఉద్యోగులైతే వేత‌న ఖాతా ఉన్న బ్యాంకులో ఆర్‌డీ తెర‌వ‌డం మంచిది

మీరు ఖాతా కలిగిన బ్యాంకులోనే రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరవండి. ఇలా చేయడం వల్ల మీరు వాయిదాల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకులు ఆటోమేటిక్‌గా మీ ఖాతా నుంచి డెబిట్ చేసుకుంటాయి. మీ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ పూర్తైన తర్వాత ఆటోమెటిక్‌గా నగదు మొత్తాన్ని మీ ఖాతాలోకి జమ చేస్తాయి. సాధార‌ణంగా ఉద్యోగం మానేసిన త‌ర్వాత వేత‌న ఖాతాలు పొదుపు ఖాతాలుగా మార‌తాయి. అలా కాక‌పోతే ఆర్‌డీ మిన‌హాయించ‌బ‌డే ఖాతాను కొత్త దానికి మార్చుకోవ‌చ్చు.

4. ఆర్డీ ఎలా ప‌నిచేస్తుంది?

4. ఆర్డీ ఎలా ప‌నిచేస్తుంది?

డీల్‌4లోన్స్ వెబ్‌సైట్ ప్ర‌కారం చూస్తే మీరు ఆర్‌డీని క‌నీస సొమ్ము రూ.10 నుంచి ప్రారంభించ‌వ‌చ్చు. ఇది బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటుంది. పోస్టాఫీసుల్లో రూ.10 నుంచి మొద‌ల‌వుతుంది. ప్ర‌తి నెలా ఎంత పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చ‌నే దానికి పోస్టాఫీసుల్లో గ‌రిష్ట ప‌రిమితి లేదు. 5 గ‌ణాంకాల్లో ఎంతైనా ప్ర‌తి నెలా జ‌మ చేయొచ్చు. ఐసీఐసీఐ ఐవిష్ పేరుతో ఫ్లెక్సీ ఆర్‌డీని అందిస్తోంది. ఇందులో మీరు చెల్లింపులు చేయ‌నిదానికి ఎటువంటి పెనాల్టీలు ఉండ‌క‌పోవ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయిన‌ప్పుడు నేరుగా ఆర్‌డీ ఖాతాను తెర‌వొచ్చు.

5. కాల వ్య‌వ‌ధి

5. కాల వ్య‌వ‌ధి

3 నెల‌ల నుంచి మొద‌లుకొని 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి కలిగిన ఆర్డీల‌ను బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 1-3 నెల‌ల లాక్ఇన్ పీరియ‌డ్‌ను విధిస్తున్నాయి. మీరు పెట్టుబ‌డిని ప్రారంభించేట‌ప్పుడే ఆర్‌డీ ఖాతాకు సంబంధించి గ‌రిష్ట కాల‌ప‌రిమితిని మీ ఇష్టానికి అనుగుణంగా నిర్ణ‌యించుకోవ‌చ్చు.

 6. బ్యాంకుల్లో క‌నీస మొత్తం

6. బ్యాంకుల్లో క‌నీస మొత్తం

బ్యాంకుల్లో కనీసం రూ. 100తో ఖాతా తెరవొచ్చు. కనీస వ్యవధి ఆరు నెలల నుంచి 5, 10 ఏళ్ళు వరకూ పథకం ఎంచుకోవచ్చు. ప్ర‌తి నెలా నిర్ణీత మొత్తంతో ఆర్డీని కొన‌సాగిస్తారు. ఇది దాదాపు ఈఎంఐల్లానే చెల్లిస్తారు. అన్ని బ్యాంకులు ఈసీఎస్ డెబిట్ ద్వారా ఖాతాలో నుంచి నిర్ణీత తేదీక‌ల్లా ఖాతాలో నుంచి సొమ్మును మిన‌హాయించే సౌక‌ర్యాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి.

7.చెల్లింపుల్లో జాగ్ర‌త్తలు

7.చెల్లింపుల్లో జాగ్ర‌త్తలు

స‌రైన స‌మ‌యంలో చెల్లింపులు చేయ‌ని రిక‌రింగ్ డిపాజిట్ల‌కు జ‌రిమానా విధిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ప్ర‌తినెలా 10వ తేదీన రూ.4000 ఆర్‌డీ చెల్లిస్తార‌ని అనుకుందాం. 10 వ తేదీ నాటికి మీరు నెల‌వారీ మొత్తాన్ని చెల్లించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే జ‌రిమానా విధిస్తారు.

8. ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయ‌ల్‌

8. ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయ‌ల్‌

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో మీ సొమ్మును గ‌డువుకు ముందే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. చాలా మంది ఇత‌ర సాధనాల్లో పెట్టుబ‌డి పెడుతున్న‌ప్పుడు ముందుగా ఏ సొమ్మును అత్య‌వ‌సరాల‌కు వాడుకోవాల‌ని ఆలోచించిన‌ప్పుడు ఆర్‌డీ వైపే మొగ్గుచూపుతారు. అయితే బ్యాంకులు అందించే వ‌డ్డీపై పెనాల్టీని విధిస్తాయి. లాక్ ఇన్ పీరియ‌డ్ ఆధారంగా ఈ పెనాల్టీలు ఉంటాయి. లాక్‌-ఇన్ పీరియ‌డ్ దాటిన త‌ర్వాత విత్‌డ్రా చేసే సొమ్ముకు ఎటువంటి పెనాల్టీ చెల్లించ‌న‌క్క‌ర్లేదు. నెల‌లోపు రిక‌రింగ్ డిపాజిట్‌ను ర‌ద్దు చేసిన‌ప్పుడు ఎటువంటి వ‌డ్డీ ద‌క్క‌క‌పోవ‌చ్చు.

9. ఆర్‌డీపై రుణం

9. ఆర్‌డీపై రుణం

కొన్ని బ్యాంకులు రిక‌రింగ్ డిపాజిట్ హామీగా రుణాన్ని అందిస్తున్నాయి. డిపాజిట్ విలువ‌లో 75 నుంచి 90 శాతం వ‌ర‌కూ సొమ్మును రుణంగా పొంద‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ 90 % వ‌రకూ అనుమ‌తిస్తుంది. ఈ త‌ర‌హా రుణాల‌కు రిక‌రింగ్ డిపాజిట్‌పై వ‌చ్చే వ‌డ్డీ కంటే అద‌నంగా మ‌రో 0.50% వ‌డ్డీని విధిస్తారు.

10. ఏది ఉత్త‌మం?

10. ఏది ఉత్త‌మం?

ఉదాహరణకు ఏదైనా జాతీయ బ్యాంక్‌లో నెలకు రూ. 100 చొప్పున ఐదేళ్ళకు రికరింగ్‌ ఖాతా ప్రారంభిస్తే 7.75 శాతం వడ్డీ ప్రకారం లెక్కకడితే కాలపరిమితి తర్వాత అందుకునే మొత్తం రూ. 73, 376. 5 ఏళ్ల‌లో చెల్లించిన మొత్తం రూ. 6000. దీనికి వడ్డీరూపంలో అందిన ప్రయోజనం 13,376 ఉంటుంది. బ్యాంకు, పోస్టాఫీసుల‌ను పోల్చి చూస్తే ఆర్‌డీల‌కు పోస్టాఫీసులే మేలు. ఎందుకంటే పోస్టాఫీసులో నెలకు రూ. 10 నుంచి వేలల్లో మీరు పెట్టుబడులు పెట్టొచ్చు. చెల్లింపుల పద్ధతి సైతం ఇక్కడ సులభం. ముఖ్యంగా గ్రామీణస్థాయి పోస్టాఫీసుల్లోనూ రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాలను ప్రారంభించుకునే వెసులుబాటు ఉంది.

11. నామినీ

11. నామినీ

ఖాతా తెరిచే సమయంలో ఉమ్మడి నామినేషన్లు ఇవ్వడం మాత్రం మరిచిపోవద్దు. అంటే ఖాతా ప్రారంభించిన వ్యక్తితోపాటు అతని భాగస్వామి లేదా పిల్లలు, ఇతర కుటుంబసభ్యుల్ని నామినీలుగా చూపించవచ్చు. అనుకోని పరిస్థితుల్లో, ఖాతాదారుడు జీవించిలేని పక్షంలో ఖాతా నామినీ కొనసాగించవచ్చు. లేదా సొమ్మును ఎవరికి చెల్లించాలి? అనే దానికి అధికారికంగా నామినీ వివరాలు ఖాతాలో పొందుపరచాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+