వివాహిత మహిళ పాన్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా?
సరళకి పెళ్లి కావడంతో ఇంటి పేరు మారి పోయింది. దీంతో సరళ తన భర్త ఇంటి పేరుని తన పాన్ కార్డులో మార్పు చేయాలని అనుకుంది. పాన్ కార్డులో సరళ తన ఇంటి పేరుని ఏవిధంగా మార్పు చేసుకుందో తెలుసుకుందాం.
మీరు పాన్ కార్డుని కలిగి ఉన్నారా... ఐతే పాన్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలని అనుకుంటే అది ఇప్పుడు మరింత సులభం. దీనికి మీకు ఒక ఉదాహారణ. సరళ అనే అమ్మాయి చదువుకునే రోజుల్లో పాన్ కార్డుకి అప్లై చేసింది. ఆ తర్వాత సరళకి పెళ్లి కావడంతో ఇంటి పేరు మారి పోయింది. దీంతో సరళ తన భర్త ఇంటి పేరుని తన పాన్ కార్డులో మార్పు చేయాలని అనుకుంది. పాన్ కార్డులో సరళ తన ఇంటి పేరుని ఏవిధంగా మార్పు చేసుకుందో తెలుసుకుందాం.
సాధారణంగా ఆడవారికి పెళ్లి కాగానే వారి ఇంటి పేరు మారిపోతుంది. కొన్ని కొన్ని ముఖ్యమైన పత్రాల్లో వారి భర్త ఇంటి పేరే వ్రాయాల్సి వస్తుంది. అటువంటి వాటిల్లో పాన్ కార్డు ఒకటి. ఇందు కోసం వారి చేయాల్సిందల్లా పాన్ కార్డు ఫామ్‌తో పాటు కొన్ని పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. జత చేయాల్సిన పత్రాలు:
* మ్యారేజి సర్టిఫికేట్
* మ్యారేజి ఇన్విటేషన్ కార్డు
పైన తెలిపిన పత్రాల యొక్క జిరాక్స్ కాపీలను గెజిటేడెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించి... మీ భర్త పేరు కలిగిన వ్యక్తిగత గుర్తింపుతో పాటు ఒక పాస్ పోర్ట్ కాపీ ఉంటే సరిపోతుంది. ఎవరైతే అప్లికేషన్ ఫామ్‌ని ఇవ్వదలచుకున్నారో వారు అప్లికేషన్‌లో ఎడమవైపున ఉన్న change/correction బాక్సును టిక్ చేయాలి. సంతకాన్ని కూడా మార్పు చేయాలనుకుంటే అవకాశం ఉంది.
అలాగే భాగస్వామ్యం సంస్థలు తమ యొక్క పాన్ కార్డులో మార్పులు చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డులో తప్పనిసరిగా మార్పులు చేయాలనుకుంటేనే మార్పులు చేయించడం మంచింది. ఎందుకంటే మీరు ఒకసారి ఫామ్‌ను పూర్తి చేస్తే ఆ సమాచారంలో మీకు కొత్త పాన్ కార్డు వస్తుంది. పాన్ కార్డు గురించిన 6 ముఖ్య విషయాలు



Click it and Unblock the Notifications