ప్రభుత్వ ఉద్యోగులకు జీవితాంతం పింఛను వచ్చేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. కానీ చాలా ప్రయివేటు కంపెనీల్లో పదవీ విరమణ తర్వాత కచ్చితమైన పింఛను ఏర్పాట్లు ఉండకపోవచ్చు. ఒక నిర్ణీత వయస
ప్రభుత్వ ఉద్యోగులకు జీవితాంతం పింఛను వచ్చేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. కానీ చాలా ప్రయివేటు కంపెనీల్లో పదవీ విరమణ తర్వాత కచ్చితమైన పింఛను ఏర్పాట్లు ఉండకపోవచ్చు. ఒక నిర్ణీత వయసు తర్వాత ఉద్యోగం మానేస్తే అతనికి నెలవారీ వేతనం, ఇతర ప్రయోజనాలు అందకపోవచ్చు. ఉద్యోగి అప్పటి వరకూ చేసిన పొదుపు, పెట్టుబడులపైన ఆధారపడాల్సి రావొచ్చు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ లేదా పెన్షన్ ఆధారిత బీమా పాలసీలు అలాంటి వారికి ఆధారమవుతాయి.

పింఛను పాలసీల్లో ఎండోమెంట్, యూనిట్ లింక్డ్ పాలసీలు అనే రెండు రకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఇతర పాలసీల్లా కాకుండా ఉద్యోగం మానేసిన తర్వాత ఉపయోగపడే విధంగా ఇవి పనిచేస్తాయి. రిటైర్మెంట్ పాలసీల్లో సాధారణంగా రెండు దశలు ఉంటాయి. పాలసీ గడువు వరకు ప్రీమియం చెల్లిస్తూ నిధిని సమకూర్చుకోవడం. రెండో దశ గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తాన్ని ఐఆర్డీఏ నిర్దేశించిన యాన్యుటీ పథకాలలో పెట్టుబడి పెట్టడం. దానిపై నెల నెలా వడ్డీ పెన్షన్ రూపంలో వస్తుంది. పాలసీ గడువు తీరిన తర్వాత సమకూరిన నిధి నుంచి 30 నుంచి 40 శాతం వరకే వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కచ్చితంగా ఏదేనీ పెన్షన్ యాన్యుటీ ఫథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ పాలసీల కంటే యూనిట్ ఆధారిత పాలసీల్లో ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications