స్టాక్ మార్కెట్‌పై ప‌ట్టు కోసం స్టాక్ ఎడ్జ్ యాప్‌

‘స్టాక్ ఎడ్జ్' అనేది ఇండియన్ మార్కెట్లకు చెందిన ఒక హై-కస్టమైజ్‌డ్ ఫైనాన్షియల్ యాప్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ యాప్ సాయంతో ప్రధానంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్

'స్టాక్ ఎడ్జ్' అనేది ఇండియన్ మార్కెట్లకు చెందిన ఒక హై-కస్టమైజ్‌డ్ ఫైనాన్షియల్ యాప్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ యాప్ సాయంతో ప్రధానంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. విశ్లేషణలు, అలర్ట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలతో కూడిన ఈ యాప్.. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల లావాదేవీలకు సంబంధించి సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి తోడ్పాటునందిస్తుంది. 'స్టాక్ ఎడ్జ్' యాప్‌ను యాపిల్ యాప్ స్టోర్‌, గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Stock Analytics At Your Fingertips by STOCK EDGE

ఈ యాప్ ద్వారా కలిగే ప్ర‌యోజ‌నాలు:
* వినియోగ‌దారు సులువుగా అవ‌గాహ‌న చేసుకోగ‌ల‌ ఇంటర్‌ఫేస్.
* ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ షేర్ల‌ను ట్రాక్ చేయొచ్చు.
* వాచ్ లిస్ట్‌కు స్టాక్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో మల్టిపుల్ వాచ్ లిస్ట్‌లను క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.
* ప్రైస్ టార్గెట్స్‌ను సెట్ చేసుకొని, మెసేజ్ అలర్ట్స్‌ను పొందొచ్చు.
* బల్క్/బ్లాక్ డీల్స్, ఎఫ్‌ఐఐ కార్యకలాపాలు సహా పలు రంగాల స్టాక్స్ పనితీరు ఎలా ఉందో గమనించవచ్చు.
* మార్కెట్ వార్తలు, అప్‌డేట్స్, కంపెనీ ఫలితాలు, ఒప్పందాలు వంటి మొద‌లైన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు పొంద‌వ‌చ్చు.
* స్టాక్స్ హెచ్చుతగ్గులను ఇన్ఫోగ్రాఫిక్స్ సాయంతో స‌చిత్రంగా(విజువ‌ల్ ప్రెజెంటేష‌న్‌తో) చూడొచ్చు.
* స్కాన్ విభాగంలోని టెక్నికల్, ప్రైజ్, వ్యాల్యుమ్ అండ్ డెలివరీ, ఫ్యూచర్ వంటి పలు రకాల ఆప్షన్ల ద్వారా స్టాక్స్ కదలికలను నిశితంగా గమనించొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+