వేతనంలో ఈపీఎఫ్ వాటా లెక్కింపు ఎలా?
సాధారణంగా ఉద్యోగాలు చేసే వారి వద్ద నుండి వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి నెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వారి జీతం నుండి కొంత సొమ్ము మినహాయిస్తుంది. దీనిని ఉద్యోగి వాటా(Employee Contribut
సాధారణంగా ఉద్యోగాలు చేసే వారి వద్ద నుండి వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి నెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వారి జీతం నుండి కొంత సొమ్ము మినహాయిస్తుంది. దీనిని ఉద్యోగి వాటా(Employee Contribution) అంటారు. అదే మీరు పని చేసే కంపెనీ నుండి కూడా కొంత మొత్తాన్ని మీ ప్రావిడెంట్ ఫండ్‌కు జత చేయడం జరుగుతుంది. దీనిని యజమాని చందా (Employer Contribution) సూచిస్తారు. ఈ ఈపీఎఫ్‌ను లెక్కించడం ఎలా అనేది ఈ కథనంలో ప్రత్యేకంగా అందిస్తున్నాం.

EPF= Employee (12% of salary + DA) + Employer (12% + DA)
గతంలో ఉద్యోగి చెల్లించే జీతంలో Basic + DA రెండూ కలిసి ఉండేవి. ఐతే కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం జీతంలో basic + DA + allowances మూడు కలిగి ఉన్నాయి.
ఉదాహరణ:
రవి బేసిక్ జీతం రూ. 30,000
నెలకు ఇతర అలవెన్సులు రూ. 5,000
నెలకు మెడికల్ అలవెన్సు రూ. 5,000
పాత నిబంధనల ప్రకారం గనుక ఈపీఎఫ్ లెక్కిస్తే రవి యొక్క బేసిక్ జీతం రూ. 30,000 కాబట్టి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ Rs 30,000*12/100= Rs 3,600గా ఉండనుంది.
సవరించిన కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ మరియు ఇతరాలు అన్నింటిని కలిపి బేసిక్ జీతంలో కలిపి లెక్కిస్తారు.
Rs 40,000*12/100= Rs 4,800
తెలుగు.గుడ్‌రిటర్న్స్.ఇన్


Click it and Unblock the Notifications