ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించే చట్టబద్ధమైన లెక్కా పత్రాన్ని బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. పార్లమెంటు అధ్యక్షుడైన రాష్ట్రపతి ఆమోదం తర్వాతే బడ్జెట్ తుదిరూపు సంతరించుకుంటుంది. అలాంటి బడ
ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రక్రియను సామాన్యుల నుంచి తలపండిన ఆర్థిక వేత్తల దాకా అందరూ ఆసక్తిగా గమనిస్తారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ ఏదో విధంగా ప్రభావితం చేస్తుంది.
ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించే చట్టబద్ధమైన లెక్కా పత్రాన్ని బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. పార్లమెంటు అధ్యక్షుడైన రాష్ట్రపతి ఆమోదం తర్వాతే బడ్జెట్ తుదిరూపు సంతరించుకుంటుంది. అలాంటి బడ్జెట్ గురించి పలు కీలకాంశాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఏ బడ్జెట్‌కైనా ముఖ్యమైన విషయాలు ఆదాయం, ఖర్చులే. అవి కాకుండా ఇంకా ఏయే అంశాలకు ప్రాధాన్యత ఉంటుందో ఇక్కడ చదవండి
1. ఆర్థిక శాఖ దేశంలోని వివిధ శాఖలను సంప్రదించి వాటి అవసరాలకు అనుగుణంగా లెక్కలు వేసి దేశ ఆర్థిక స్థితి ఆధారంగా కేటాయింపులను చేస్తుంది.
2. బడ్జెట్‌కు సంబంధించిన సర్కులర్‌ను మునుపటి ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేస్తారు. అప్పటి నుంచి బడ్జెట్ తయారీ ప్రక్రియ మొదలైనట్లు లెక్క.
3. సార్వత్రిక ఎన్నికలు జరిగే సంవత్సరాల్లో బడ్జెట్ను రెండు సార్లు ప్రవేశపెడతారు. ఒకటి కొన్ని నెలల ఖర్చులు తాత్కాలికంగా నిర్వహించుకునేందుకు కాగా, మరో ఫుల్ టైమ్ బడ్జెట్‌ను ఎన్నికైన ప్రభుత్వం ప్రవేశపెడతాయి. ఇలా ఎందుకు చేస్తారంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తర్వాతి కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అధికారం ఉండదు.
4. బడ్జెట్ సైకిల్ 12 నెలల పాటు కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి మరుసటి ఏడాది మార్చి 31 దాకా ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తే, ఆ కాలానికి బడ్జెట్ లెక్కలు తయారుచేస్తారు.
5. ప్రభుత్వ ఆర్థిక ఖాతాను కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్‌గా వర్గీకరిస్తారు.
6. కాగ్ సలహా మేరకు ప్రెసిడెంట్ అంగీకరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లు ఉండాలి. ఇది రాజ్యాంగం నిర్దేశించిన మేరకు అలా కొనసాగుతోంది.
7. సవరించిన అంచనాలను ఏడాది మధ్యలో ప్రవేశపెట్టే వీలుంటుంది. వ్యయాల ధోరణి, కొత్త సేవలను ప్రవేశపెట్టేందుకు అయ్యే ఖర్చులు, కేటాయింపుల్లో మార్పుచేర్పుల ఆధారంగా బడ్జెట్ సవరణలను ప్రతిపాదిస్తారు.
8. ప్రతి ఏడాది బడ్జెట్ ముద్రణా ప్రక్రియ హల్వా వేడుకతో మొదలవుతుంది. ఇందులో ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులు అంతా పాల్గొంటారు. ఒకసారి బడ్జెట్ ముద్రణా ప్రక్రియ మొదలైన తర్వాత వారు నార్త్ బ్లాక్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ వారు బయటకు వెళ్లేందుకు అనమతించరు.
9. బడ్జెట్లో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని రెండు రకాల ఖర్చులు ఉంటాయి. మొదటిది ఉత్పాదక వ్యయాలకు సంబంధించింది కాగా, రెండోది వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, ఉద్యోగుల వేతనాలు మొదలైన వాటికి సంబంధించినది.
10. బడ్జెట్ ప్రసంగంతో మొదలుపెట్టి ఆర్థిక మంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన లెక్కలన్నీ బడ్జెట్ ప్రతుల ద్వారా వాస్తవంగా ఉన్నాయా లేదా రూఢీ పరుచుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications