ఫండ్ ట్రాన్స్‌ఫర్ కోసం ఫోన్‌పేను ఉపయోగించడం ఎలా?
ఫోన్‌పే అనే యాప్ ద్వారా బ్యాంకు వివరాలు లేకుండానే, వినియోగదారుల యూనిక్ ఐడెంటిటీ, మొబెల్ ఫోన్ నంబర్ లేదా ఇతర వర్చువల్ చెల్లింపుల చిరునామా ద్వారా లావాదేవీలకు అవకాశముంటుంది.
ఈ కామర్స్ రంగానికి చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులు సమీర్ నిగమ్, రాహుల్ చారి సత్వర మొబైల్ చెల్లింపుల కోసం ఫోన్‌పే సంస్థను స్థాపించారు. వీరు సహ స్థాపకులుగా ఉన్న ఈ సంస్థ దేశంలో మొదటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌కు శ్రీకారం చుట్టింది. ఫోన్‌పే అనే యాప్ ద్వారా బ్యాంకు వివరాలు లేకుండానే, వినియోగదారుల యూనిక్ ఐడెంటిటీ, మొబెల్ ఫోన్ నంబర్ లేదా ఇతర వర్చువల్ చెల్లింపుల చిరునామా ద్వారా లావాదేవీలకు అవకాశముంటుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?
మొదట ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత మీ బ్యాంకు ఖాతాలను ఈ యాప్‌లో జమ చేసుకోవాలి. సత్వర బ్యాంకు ఖాతా లావాదేవీలను యూపీఐ ద్వారా జరపవచ్చు. ఇందుకోసం మీరు మొబైల్ నంబరును ఉపయోగించి వర్చువల్ పేమెంట్ అడ్రస్‌ను క్రియేట్ చేసుకోవాలి.

ఈ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర మొబైల్ వ్యాలెట్లలాగే దీన్ని ఉపయోగించుకుని ఆన్‌లైన్ లావాదేవీలను క్షణాల్లో జరపుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు డబ్బు పంపడమే కాక, మీ స్నేహితులను సొమ్ము కోసం(రిక్వెస్ట్) అభ్యర్థించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మనీ, మైంత్రా క్యాష్‌బ్యాక్ స్థానంలో ఫోన్‌పే వచ్చేసింది. కాబట్టి ఫ్లిప్‌కార్ట్, మైంత్రా వెబ్‌సైట్లకు సంబంధించిన రీఫండ్లన్నీ ఫోన్‌పే ద్వారానే జరుగుతున్నాయి.
మీ వ్యాలెట్ బ్యాలెన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖర్చుపెట్టుకోవచ్చు. వ్యాలెట్‌నుంచి మీ బ్యాంకు ఖాతాకు పంపించుకోవచ్చు.

ఫోన్‌పే యాప్‌లో మీరు చేయగలిగే పనులు
- మీ కాంటాక్ట్ జాబితాలోని వారికి డబ్బు పంపొచ్చు,వారి నుంచి డబ్బును అభ్యర్థించవచ్చు.
- ఏ ప్రీపెయిడ్ మొబైల్, డేటా కార్డు, డీటీహెచ్ కనెక్షన్‌లకు రీచార్జీ చేసుకోవచ్చు.
- యుటిలిటీ బిల్లు చెల్లింపులు జరపొచ్చు.
- స్నేహితులతో బిల్లును పంచుకోవచ్చు.
- ఫ్లిప్‌కార్ట్‌తో వేగవంతమైన షాపింగ్ చేయవచ్చు.

ఇందులో త్వరలో రాబోయే ఫీచర్లు
- మైంత్రా, జబాంగ్ రిటైల్ వెబ్‌సైట్లతో పాటు, ఇతర ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో వస్తువులు కొనుక్కోవచ్చు.
- ఒక్కో లావాదేవీలో రూ. 1 నుంచి మొదలుకొని రూ. 1 లక్ష వరకూ పంపుకోవచ్చు
- భాగస్వామ్య వ్యాపార సంస్థల నుంచి రీఫండ్లన్నీ సత్వరమే పొందే సదుపాయం
- కార్డులు, బ్యాంకు ఖాతాలను అనుసంధానించడం ద్వారా చెల్లింపులు జరిపే వీలు
- ఏదైనా బిల్లులో కొంచెం శాతాన్ని చెల్లించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు.

ఫండ్స్ ట్రాన్స్‌ఫర్
ఒక స్వైప్ ద్వారా మీ ఫోన్‌పే వ్యాలెట్లో ఉన్న డబ్బును మీ బ్యాంకు ఖాతాలోకి ఎటువంటి చార్జీలు లేకుండా పంపుకోవచ్చు. మీ బంధుమిత్రుల డెబిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు
వ్యాలెట్ ద్వారా డబ్బు వెంటనే పంపవచ్చు. అయితే అవి యూపీఐ ఎనేబుల్‌డ్ అయి ఉండాలి. మర్చంట్ పేమెంట్ల కోసం సైతం ఫోన్‌పేను ఉపయోగించుకోవచ్చు.

ప్రాంతీయ భాషల్లో
వినియోగదారులు ఆంగ్లం, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో సైతం లావాదేవీలు జరుపుకోవచ్చు. తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఉంది. భవిష్యత్తులో మరిన్ని భాషలకు విస్తరించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications