ప్రధానమంత్రి ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో దేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోంది. రూ.500, రూ. 1000 నోట్లు రద్దు చేసి నెల రోజులు గడిచినా వ్యవస్థలో తగినంత నగదు ప్రవాహం ల
ప్రధానమంత్రి ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో దేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోంది. రూ.500, రూ. 1000 నోట్లు రద్దు చేసి నెల రోజులు గడిచినా వ్యవస్థలో తగినంత నగదు ప్రవాహం లేదు. పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్‌లు వాడే వాళ్లకు కాస్త ఇబ్బందులు తక్కువే. ఎందుకంటే వాళ్లంతా మొబైల్ యాప్‌లు, వ్యాలెట్లు వాడేందుకు అలవాటు పడి ఉంటారు. అయితే మిగిలిన వాళ్ల పరిస్థితేంటి? అందుకోసమే ఆర్‌బీఐ ఫీచర్ ఫోన్ల కోసం యూఎస్ఎస్‌డీని ప్రవేశపెట్టింది. దాని వాడకం ఇక్కడ తెలుసుకుందాం. యూపీఐ అంటే ఏమిటి? దీన్ని వాడటం ఎలా?

యూఎస్ఎస్‌డీ(నెట్ లేకుండా మొబైల్ బ్యాంకింగ్) ఎలా?
* బ్యాంక్ ఖాతాను మొబైల్ నంబరుకు అనుసంధానించాలి
* బ్యాంకు నుంచి ఎంఎంఐడీని, ఎంపిన్‌ను పొందాలి
* మీ మొబైల్ హ్యాండ్‌సెట్ నుంచి *99#ను నొక్కండి
* బ్యాంకు పేరు 3అక్షరాలు లేదా ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లోని 4అక్షరాలు ఎంటర్ చేయాలి.
ఉదా: ఎస్‌బీఐ, ఏఎన్‌బీ (ఆంధ్రాబ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లోని 4 అక్షరాలు:ANDB
వివిధ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంక్ షార్ట్ కోడ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
* అప్పుడు ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి
* ఫండ్ ట్రాన్స్‌ఫర్, బ్యాలెన్స్ ఎంక్వైరీ నుంచి అవసరమైన దాన్ని ఎంచుకోవాలి.
* లబ్దిదారు మొబైల్ నంబరు, ఎంఎంఐడీ, సొమ్ము ఎంత అనే వివరాలు రాయాలి
* తర్వాత ఎంపిన్, మీ మొబైల్ నంబరు చివరి 4 అంకెలను నమోదు చేయాలి
* ఇంత కంటే సులువైన విధానాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.
ఈ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందు కోసం నిర్దేశించిన షార్ట్ కోడ్స్ ను మొబైల్ కీప్యాడ్ లో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగుకోసం *99*24# అని టైప్ చేయాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications