ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ ఖ‌నిజాలు విస్తారంగా ఉన్నాయి?

ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ ఖనిజాలు ఉన్నాయి? దేశంలో ఉన్న ముఖ్యమైన ఖనిజాల విస్తరణ. వాటి ఉత్పత్తుల గురించి వివరాలిలా ఉన్నాయి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోకి జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిషా,ఏపీ

దేశంలో ఉన్న ముఖ్యమైన ఖనిజాల విస్తరణ. వాటి ఉత్పత్తుల గురించి వివరాలిలా ఉన్నాయి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోకి జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అనేక ఖనిజ నిక్షేపాలకు, వాటి ఉత్పత్తికి చాలా ముఖ్యమైనవి.

దేశంలో విస్తరించి ఉన్న ముఖ్యమైన ఖనిజ సంపదను కింద తెలిపిన 8 ప్రధాన మేఖలలు (Belts) గా గుర్తించవచ్చు. అవి:

1. దామోదర్ లోయ ప్రాంతం :

1. దామోదర్ లోయ ప్రాంతం :

ఈ మేఖలలో నేలబొగ్గు, ఇనుపధాతువు, మాంగనీస్, అభ్రకం, డోలమైట్, చైనా క్లే, క్రోమైట్, ఫాస్ఫేట్, బాక్సైట్, రాగి, సున్నపురాయి ఎక్కువగా ఉన్నాయి. దామోదర్ నది ప్రాంతం ఎక్కువగా వెస్ట్బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ కొన్ని చోట్ల విస్తరించి ఉన్న ప్రాంతాన్ని దామోదర్ లోయ ప్రాంతంగా వ్యవహరిస్తారు.

2. మధ్య భారతదేశం లేదా మధ్యప్రదేశ్-మహారాష్ట్ర మేఖల :

2. మధ్య భారతదేశం లేదా మధ్యప్రదేశ్-మహారాష్ట్ర మేఖల :

ఇక్కడ మాంగనీసు, బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్ ఇనుము, రాగి, క్రోమైట్ ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో రత్నగిరి మైన్స్ ఉండగా; మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుందర్ ప్రాజెక్టు ఉంది.

3. పూర్వపు ఆంధ్రప్రదేశ్లోని దక్కన్ భూభాగం :

3. పూర్వపు ఆంధ్రప్రదేశ్లోని దక్కన్ భూభాగం :

ఈ ప్రాంతంలో బొగ్గు, అభ్రకం, బైరైటీస్, ఆస్బెస్టాస్, డోలమైట్, సున్నపురాయి, గ్రాఫైట్, ఇనుపధాతు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. 2011 నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 100 నుంచి 110 మిలియన్ టన్నులు పారిశ్రామిక ఖనిజాలు, 200 మిలియన్ల డెమైన్షనల్ స్టోన్ (ఫ్లోరింగ్కు వినియోగించే రాయి), భవన నిర్మాణ మెటీరియల్ ఉత్పత్తి అయ్యింది.బైరేట్స్, పాలరాయి ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.

.

రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే ఖనిజాల విలువ దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఖనిజాల విలువలో 15 శాతంగా ఉంది. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది.

4. కర్ణాటక ప్రాంతం :

4. కర్ణాటక ప్రాంతం :

ఈ ప్రాంతంలో బంగారం, ఇనుము, క్రోమైట్, మాంగనీస్, ఆస్బెస్టాస్, క్వార్ట్జ్, సిలికా ఎక్కువగా ఉన్నాయి.

5. తమిళనాడు ప్రాంతం :

5. తమిళనాడు ప్రాంతం :

ఇక్కడ బొగ్గు (లిగ్నైట్), సున్నపురాయి, జిప్సం, మాంగనీస్, చైనా క్లే, బాక్సైట్, ఇనుపధాతువు ఉన్నాయి.

6. కేరళ ప్రాంతం :

6. కేరళ ప్రాంతం :

బాక్సైట్, ఇనుపధాతువు, గ్రాఫైట్, అభ్రకం, బంగారం, సున్నపురాయి వంటి ఖనిజాలు ఉన్నాయి.

7. మధ్య రాజస్థాన్, గుజరాత్ మేఖల :

7. మధ్య రాజస్థాన్, గుజరాత్ మేఖల :

ఈ మేఖలలో రాగి, సీసం, జింక్, వెండి, యురేనియం, బంగారం, డోలమైట్, మాంగనీస్, స్టియటైట్, పాలరాయి, ఆస్బెస్టాస్, బొగ్గు, జిప్సం, విలువైన రాళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.

8. హిమాలయ ప్రాంతం :

8. హిమాలయ ప్రాంతం :

రాగి, సీసం, జింక్, ఆంటిమొని, నికెల్, కోబాల్ట్, టంగ్స్టన్, బంగారం, వెండి, ఇతర విలువైన రాళ్లు లభిస్తున్నాయి.

మైనింగ్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏంటి?

మైనింగ్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏంటి?

ఆర్థికవ్యవస్థలో మైనింగ్ ద్వారా సైతం భారత్కు బాగా ఆదాయం వస్తోంది. మైనింగ్ పరిశ్రమ ద్వారా జీడీపీకి 2 నుంచి 3 శాతం రాబడి వస్తుండగా, పరిశ్రమల రంగం మొత్తంలో చూస్తే దీని వాటా 10 నుంచి 11% వరకూ ఉండొచ్చు. చిన్న స్థాయిలో జరిగే మైనింగ్ సైతం ఖనిజ ఉత్పత్తిలో 6 శాతం కంటే ఎక్కువ ఉందంటే ఈ రంగం ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. మైనింగ్ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2012 నాటికి మైకా ఉత్పత్తిలో దేశం ప్రథమ స్థానంలోనూ, ఐనుప ధాతువు ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది. బాక్సైట్ విషయంలో ప్రపంచంలో టాప్5లో ఉంది. 2010 సంవత్సరం నాటికి మన దేశ మైనింగ్ పరిశ్రమ విలువ 106.4 బిలియన్ డాలర్లు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+