For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఏదైనా స్కిల్ ఉందా? అయితే ప్ర‌భుత్వం రుణ‌మిస్తుంది. ప్ర‌య‌త్నించండి!

దేశంలో వివిధ వ్య‌క్తులు నైపుణ్యాన్ని అభివృద్ది చేసుకునేందుకు భార‌త ప్రభుత్వం నైపుణ్యాభివృద్ది ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని ప్ర‌కారం అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల‌కు బ్యాంకులు రుణ స‌దుపాయాన్ని క‌ల్పిస్త

|

దేశంలో వివిధ వ్య‌క్తులు నైపుణ్యాన్ని అభివృద్ది చేసుకునేందుకు భార‌త ప్రభుత్వం నైపుణ్యాభివృద్ది ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని ప్ర‌కారం అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల‌కు బ్యాంకులు రుణ స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. భార‌తీయ బ్యాంకుల స‌మాఖ్య‌లో ఉన్న అన్ని బ్యాంకుల‌తో పాటు, ఆర్‌బీఐ సూచించిన బ్యాంకులు ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి. దీని గురించిన మ‌రింత స‌మాచారం కోసం ఈ క‌థ‌నాన్ని చ‌ద‌వండి.

అర్హ‌త‌:

అర్హ‌త‌:

పారిశ్రామిక శిక్ష‌ణా కేంద్రాలు, పాలిటెక్నిక్ సంస్థ‌లు, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఎడ్యుకేష‌న్ బోర్డుల గుర్తింపు పొందిన శిక్ష‌ణా సంస్థ‌లు,కేంద్ర నైపుణ్యాభివృద్ది కార్పొరేష‌న్‌తో భాగ‌స్వామ్యం క‌లిగిన శిక్ష‌ణా కేంద్రాలలో శిక్ష‌ణ పొందుతున్న అభ్య‌ర్థులు ఈ రుణం పొందేందుకు అర్హులు.

రుణం ప‌రిధిలోకి వ‌చ్చే ఖ‌ర్చులు:

రుణం ప‌రిధిలోకి వ‌చ్చే ఖ‌ర్చులు:

  • ట్యూష‌న్ / కోర్సు ఫీజు

  • ప‌రీక్ష రుసుము, గ్రంథాల‌య రుసుము, ప్ర‌యోగ‌శాల రుసుము, కాష‌న్ డిపాజిట్‌, పుస్త‌కాల ఖ‌ర్చులు

  • ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వ‌స‌తి కోసం అయ్యే ఖ‌ర్చులు

  • కోర్సుకు అవ‌స‌ర‌మయ్యే ఇత‌ర వ‌స్తువుల ఖ‌ర్చులు
రుణ మొత్తం:

రుణ మొత్తం:

రూ. ఐదు వేల నుంచి మొద‌లుకొని రూ. ల‌క్షా యాభై వేల వ‌ర‌కూ ఈ ప‌థ‌కం కింద రుణం మంజూరు చేస్తారు.

ఈ త‌ర‌హా రుణాల‌పై ఎటువంటి మార్జిన్ ఉండ‌దు. అంటే మొత్తం రుణాన్ని బ్యాంకే మంజూరు చేస్తుంది.

ఈ రుణాల‌కు ఎటువంటి పూచీక‌త్తు అవ‌స‌రం లేదు.

వ‌డ్డీ, ఇత‌ర రుసుములు:

వ‌డ్డీ, ఇత‌ర రుసుములు:

ఈ రుణాల‌కు వ‌సూలు చేసే వ‌డ్డీ రేటు బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటుంది. ప్ర‌స్తుతం ఇది 11 నుంచి 12 శాతం మ‌ధ్య ఉంది. నైపుణ్యాభివృద్ది రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము ఉండ‌దు.

తిరిగి చెల్లింపు:

తిరిగి చెల్లింపు:

రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు త‌గినంత గ‌డువు ఇస్తారు.

సంవ‌త్స‌రం లోపు కోర్సుల‌కు - కోర్సు పూర్తి చేసిన 6 నెల‌ల వ‌ర‌కూ, సంవ‌త్స‌రం పైబ‌డిన కోర్సుల‌కు - కోర్సు పూర్తి చేసిన 12 నెల‌ల మార‌టోరియం పీరియ‌డ్ ఉంటుంది. ఈ కాలంలో సాధార‌ణ వ‌డ్డీని వ‌సూలు చేస్తారు.

రుణ చెల్లింపున‌కు గ‌డువు

రుణ చెల్లింపున‌కు గ‌డువు

రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు తీసుకున్న మొత్తం ఆధారంగా గ‌డువు ఇస్తారు.

రూ. 50 వేల వ‌ర‌కూ - 3 సంవ‌త్స‌రాలు

రూ. 50 వేల నుంచి రూ. ల‌క్ష వ‌ర‌కూ - 5 సంవ‌త్స‌రాలు

రూ. ల‌క్ష పైన - 7 సంవ‌త్స‌రాలు

ముంద‌స్తు చెల్లింపు:

ముంద‌స్తు చెల్లింపు:

రుణ గ్ర‌హీత ఎటువంటి ముంద‌స్తు రుసుములు లేకుండా రుణాన్ని తిరిగి చెల్లించ‌వ‌చ్చు. ప్ర‌మాదం / మ‌ర‌ణం / వైక‌ల్యం కార‌ణంగా విద్యార్థి కోర్సు పూర్తిచేయ‌లేకపోతే శిక్ష‌ణా సంస్థ నుంచి మిగిలిన శిక్ష‌ణా కాలానికి సంబంధించిన సొమ్మును ప్రొరేటా రీయింబ‌ర్స్‌మెంట్ ప‌ద్ద‌తిలో వెన‌క్కి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

అధిక వివ‌రాల కోసం ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి. ఇక్క‌డ క్లిక్ చేయండి

బ్యాంకులు అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ప‌రిమితి మేర‌కు రుణాన్ని మంజూరు చేస్తాయి. దీని ద్వారా నైపుణ్యాన్ని అభివృద్ది ప‌రుచుకొని స‌రైన ఉపాధిని పొంద‌వ‌చ్చు. కోర్సు ద్వారా స్వ‌యం ఉపాధి / ఉద్యోగం పొందిన విద్యార్థులు వీలైనంత త్వ‌ర‌గా రుణాన్ని తీర్చివేస్తే మంచిది.

Read more about: loan banking
English summary

మీకు ఏదైనా స్కిల్ ఉందా? అయితే ప్ర‌భుత్వం రుణ‌మిస్తుంది. ప్ర‌య‌త్నించండి! | how to get skill development loan in India

Any Indian National who has secured admission in a course run by Industrial Training Institutes (ITIs), Polytechnics or in a school recognised by Central or State education Boards or in a college affiliated to recognised university, training partners affiliated to National Skill Development Corporation (NSDC) Sector Skill Councils, State Skill Mission, State Skill Corporation can avail loan for the purpose.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X