నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ప్రాముఖ్యత పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పేటీఎమ్ యాప్, వెబ్‌సైట్లలో రైలు టిక్కెట్లు సైతం బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీని ద్వారా రైల
నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ప్రాముఖ్యత పెరిగిన సంగతి తెలిసిందే. మొబైల్ వ్యాలెట్ పేటీఎమ్ అయితే చిన్న చిన్న దుకాణాల్లో సైతం వాడటం మొదలుపెట్టారు. ఈ వ్యాలెట్లో డబ్బులుంటే చాలా చోట్ల డెబిట్,క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లేకుండానే నగదు రహిత లావాదేవీలను పూర్తిచేయవచ్చు. మొబైల్, డీటీహెచ్ రీచార్జీ, డేటా కార్డు, మెట్రో కార్డు రీచార్జీ, మొబైల్ బిల్లు పేమెంట్, మూవీ బుకింగ్, బస్సు టిక్కెట్ల కొనుగోలు వంటివన్నీ ఒకేచోట చేసుకోవచ్చు. ప్రస్తుతం పేటీఎమ్ యాప్, వెబ్‌సైట్లలో రైలు టిక్కెట్లు సైతం బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీని ద్వారా రైలు టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

పేటీఎమ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండిలా...
*పేటీఎమ్ డ్రాప్ డౌన్ జాబితా నుంచి ట్రయిన్‌ను ఎంచుకోండి.
*ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణించాలనుకుంటున్నారో ఆ స్టేషన్లను ఎంటర్ చేయండి
*డిపార్చర్(ప్రయాణ) తేదీని ఎంచుకోండి
*ఇప్పుడు ట్రైన్ రన్నింగ్ షెడ్యూల్ వస్తుంది.
*మీరు ప్రయాణించాలనుకుంటున్న రైలును ఎంపిక చేసుకోండి
*ఇది ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది.
*మీకు ఇదివరకే ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో అకౌంట్ ఉంటే పర్వాలేదు.
*లేకపోతే ఐఆర్‌సీటీసీ ఖాతాను క్రియేట్ చేసుకోండి.
*బోర్డింగ్ పాయింట్, ప్రయాణికుల వివరాలను నమోదు చేయండి
*ఇప్పుడు ప్రోసీడ్ టు బుక్(Proceed to Book) ఆప్షన్‌పై క్లిక్ చేయండి
*ప్రొసీడ్ టు పే క్లిక్ చేసే ముందు మీ దగ్గర ఏవైనా ప్రోమోకోడ్లు ఉంటే ఉపయోగించుకోవచ్చు.

ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసేటప్పుడు పేటీఎమ్ ద్వారా చెల్లింపులు
ఒకసారి బుకింగ్ ఐఆర్‌సీటీసీ నుంచి పేటీఎమ్‌కు రీడైరెక్ట్ అయిన తర్వాత పేటీఎమ్ డీఫాల్ట్ పేమెంట్ మోడ్ ఉండదు. చెల్లింపులు చేసేటప్పుడు పేమెంట్ మోడ్ కోసం పేటీఎమ్ వ్యాలెట్‌ను ఎంచుకోవాలి.

పేటీఎమ్ ద్వారా టిక్కెట్ల క్యాన్సిలేషన్
మధ్యాహ్నం 12 గంటల కంటే ముందు స్టార్ట్ అయ్యే ట్రైన్ల చార్టింగ్ ముందు రోజు రాత్రే పూర్తవుతుంది. టిక్కెట్ల క్యాన్సిలేషన్ కోసం ఈ విధంగా చేయాలి
* పేటీఎమ్ వ్యాలెట్‌లో లాగిన్ అవ్వండి. ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.
* యువర్ ఆర్డర్స్‌లో బుకింగ్‌ను సెలక్ట్ చేయండి
* ఎవరి పేరు మీద బుక్ చేసిన టిక్కెట్లను క్యాన్సిల్ చేయాలో దాన్ని ఎంచుకోండి
* క్యాన్సిల్ బటన్‌పై క్లిక్ చేయండి. ఒక్కసారి క్యాన్సిల్‌పై క్లిక్ చేస్తే టిక్కెట్ రద్దు అయిపోతుందని గుర్తుంచుకోండి.
* ఆన్‌లైన్‌లో క్యాన్సిలేషన్ కన్ఫర్మేషన్ మీకు వస్తుంది.
రీఫండ్ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.

నియమ నిబంధనలు
ప్రస్తుతం ఉదయం 8గం.ల నుంచి 12 గం.ల వరకూ ఐఆర్‌సీటీసీ అన్ని ఐఆర్‌సీటీసీ ప్రీపెయిడ్ కార్డు, వ్యాలెట్ ఆప్షన్లను రద్దు చేసింది. ప్రయాణికులు మధ్యాహ్నం 12 గం.ల తర్వాత పేటీఎమ్ వ్యాలెట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

మీ వ్యాలెట్లో డబ్బు లేదా?
మీ పేటీఎమ్ వ్యాలెట్లో తగినంత డబ్బు లేకపోతే, మొదట వ్యాలెట్లో డబ్బు జమ చేయండి. తర్వాత ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేయండి. పేటీఎమ్ ద్వారా రైలు టిక్కెట్ల బుకింగ్ సులభం, సురక్షితం.

మీరు ట్రైన్ మిస్ అయితే ఎలా?
చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ-టికెట్‌ను క్యాన్సిల్ చేయలేరు. టీడీఆర్ రిక్వెస్ట్‌ను ఆన్‌లైన్‌లో పంపవచ్చు, దాని తర్వాత రీఫంఢ్ రిక్వెస్ట్‌ను ట్రాక్ చేయవచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ ఖాతాలో లాగిన్ అయి మై ట్రాన్సాక్షన్స్‌లోకి వెళ్లాలి.
మీరు మీ ట్రైన్‌ను క్యాచ్ చేయలేకపోతే పంపే రిక్వెస్ట్‌నే టీడీఆర్ రిక్వెస్ట్ అంటారు. "[email protected]" ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయడం ద్వారా టీడీఆర్ ఫైల్ చేయవచ్చు. ఇందులో పీఎన్ఆర్ నంబరు, ట్రయిన్ నంబరు, మీ పేరు తప్పకుండా ఇవ్వాలి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications