కేవైసీతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా? ఈ-కేవైసీ చేసుకోండి

ప్ర‌స్తుత సాంకేతిక యుగంలో బ్యాంకు, ట్రేడింగ్‌ ఖాతా తెరవాలన్నా, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలన్నా, బీమా పొందాలన్నా ‘మీ ఖాతాదారును తెలుసుకోండి' (కేవైసీ) పత్రాలను సమర్పించడం తప్పనిసరి అయ్యింది.ఇల

ప్ర‌స్తుత సాంకేతిక యుగంలో బ్యాంకు, ట్రేడింగ్‌ ఖాతా తెరవాలన్నా, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలన్నా, బీమా పొందాలన్నా 'మీ ఖాతాదారును తెలుసుకోండి' (కేవైసీ) పత్రాలను సమర్పించడం తప్పనిసరి అయ్యింది.
ఇలా ప్రతి దానికీ కేవైసీ పత్రాలు నింపడం దాన్ని సమర్పించడం వినియోగదారులకు చికాకు కలిగించే విషయమే. కేవైసీ ఫారాలను స్వీకరించే సంస్థలకు సైతం ఈ పత్రాలను భద్రపర్చుకొని ఉంచుకోవడం పెద్ద భారమే అవుతూ వస్తోంది. దీనికి పరిష్కార మార్గంగా ఈ-కేవైసీ విధానాన్ని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది.
ఈ-కేవైసీ అనే ప్రక్రియ కేవైసీ పత్రాలను సమర్పించడం లాంటిదే. కాకపోతే ఇది కాగితరహితంగా ఉండి కేవైసీ స్వీకరించే సంస్థలకు తక్షణమే ఖాతాదారు వివరాలను నమోదు చేసే విధానానికి సహకరిస్తుంది. ఆధార్‌ కార్డు కలిగి ఉన్న వ్యక్తి కేవలం తన ఆధార్‌కార్డు సంఖ్యను తెలియపర్చి, బయోమెట్రిక్‌ పరికరంలో వేలిముద్రలను నమోదుచేయడం ద్వారా ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఎలాంటి కాగితాలు, ఫొటోలు, జిరాక్సు పత్రాలు పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

కేవైసీతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా? ఈ-కేవైసీ చేసుకోండి

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ-కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఆధార్‌ కార్డును కేవైసీ పత్రాల్లో గుర్తింపు, చిరునామా పత్రాలుగా గుర్తిస్తున్నారు. ఆధార్‌కార్డులోని విశిష్ట సంఖ్యను పేర్కొనడం ద్వారా ఆధార్‌కార్డులోని వివరాలే ఈ-కేవైసీలోకి నమోదవుతాయి.

ఆధార్ కార్డులో న‌మోద‌యి ఉండే వివ‌రాలు:
* వ్యక్తి పూర్తి పేరు
* పుట్టిన తేదీ, లింగము
* ఆధార్‌ విశిష్ట సంఖ్య
* ఫొటో
* పూర్తి చిరునామా
* మొబైల్‌ నెంబరు
* ఈ-మెయిల్‌ ఐడీ (కలిగి ఉన్నట్టయితే)

ప్రస్తుత నియ‌మ‌నిబంధ‌న‌ల‌ ప్రకారం 'మీ ఖాతాదారును తెలుసుకోండి' (కేవైసీ) స్వీకరించే ఏ సంస్థకైనా ఈ వివరాలు సరిపోతాయి.

యూఐడీఏఐ జారీ చేసే ఈ-కేవైసీ సేవ‌ల‌ను పొందేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి.

ఖాతాదారు ఏం చేయాల్సి ఉంటుంది:
* కేవైసీ స్వీకరించే సంబంధిత సంస్థకు తన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు ఖాతాదారు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
* ఇదెలా అంటే.. బయోమెట్రిక్‌ విధానం అంటే వేలిముద్రల ఆధారంగా ఖాతాదారు కేవైసీని నమోదు చేయించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక బయోమెట్రిక్‌ పరికరాలను సంబంధిత సంస్థలు ఏర్పాటు చేసుకుంటాయి.
* ఖాతాదారు వారి వద్దకు వెళ్లి ఆధార్‌ సంఖ్యను చెప్పి, బయోమెట్రిక్‌ను నమోదు చేయాలి. వివరాలన్నీ సరిపోల్చి చూసుకున్నాక ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

* మరో విధానంలో ఆధార్‌కార్డులో రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబరుకు 'వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌' చేరుతుంది. ఆధార్‌కార్డు నెంబరు, ఓటీపీ నమోదు చేశాక ఆధార్‌ వివరాలన్నీ తెరపై ప్రత్యక్షమవుతాయి. ఈ వివరాలను సరిచూసుకొని మనం కేవైసీ అందించే సంస్థతో అప్‌డేట్‌ చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+