ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను తెరవండిలా...
ఒకటి కంటే ఎక్కువ బీమా పాలసీలను కొనుగోలు చేసి ఉండి, పాలసీ పత్రాలను జాగ్రత్త పరుచుకోవడం ఒక్కోసారి కష్టమైన పనే. అందుకే ఈ-ఇన్సూరెన్స్ వచ్చింది. ఇది ఒక ఆన్‌లైన్ అకౌంట్. దీని ద్వారా మీ పాలసీలను ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఐఆర్‌డీఏ ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రిపాజిటరీ వ్యవస్థ ద్వారా పాలసీదారులకు పేపర్ కష్టాలు తప్పాయి. అంతే కాకుండా పాలసీలకు సంబంధించి పారదర్శకత పెరుగుతుంది. ఈ-ఇన్సూరెన్స్ ఖాతా తెరవడం ద్వారా పాలసీదారుడు లైఫ్, జనరల్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఒకే దగ్గర భద్రపరుచుకోవచ్చు. అంతే కాకుండా మీ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఎక్కడైనా తెరిచి చూసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలను సైతం చూడవచ్చు.

దేశంలో మూడు ఇన్సూరెన్స్ రిపాజిటరీలు ఉన్నాయి.
అవి: సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ లిమిటెడ్(సీఐఆర్‌ఎల్)
నేషనల్ ఇన్సూరెన్స్-పాలసీ రిపాజిటరీ(ఎన్ఐఆర్)
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌హెచ్‌సీఐఎల్)
ఖాతాదారుల సౌకర్యాన్ని బట్టి ఇందులో ఏదో ఒక రిపాజిటరీని ఎంచుకోవచ్చు.
ఈ-ఇన్సూరెన్స్ ఖాతా తెరవడం ఎలా?
- మొదట ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెనింగ్ ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి
- ఫారంను నింపాలి
- దాని తర్వాత సంబంధిత రిపాజిటరీకి ఆ ఫారాన్ని పంపాలి
- రిపాజిటరీ ఈ-అకౌంట్ నంబరును జనరేట్ చేసి బీమా సంస్థకు పంపుతుంది.
- బీమా సంస్థ మీకు అప్‌డేట్ ఇస్తుంది.
- దాని తర్వాత ఈ-పోర్టల్‌లో పాలసీ అప్‌లోడ్ గురించిన సమాచారం అప్‌డేట్ అవుతుంది.
గమనిక: అయితే ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ ఫారం సబ్‌మిట్ చేయాలంటే మీకు పాన్ లేదా ఆధార్ ఉండాలి.
Read in English: How To Open e-Insurance Account (eIA)?


Click it and Unblock the Notifications