పేటీఎమ్ వ్యాలెట్ పరిమితిని పెంచుకోవాలనుకుంటున్నారా?
వ్యక్తిగత, చిరునామా గుర్తింపు తనిఖీ ద్వారా పేటీఎమ్ వినియోగదారులు లావాదేవీ పరిమితిని రూ. 1 లక్ష వరకూ పెంచుకోవచ్చు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం వ్యక్తుల కేవైసీ వెరిఫికేషన్ పూర్తికాకపోతే నెలకు రూ. 10 వేల వరకూ వ్యాలెట్ లావాదేవీలను వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పేటీఎమ్ అనేది ఒక వ్యాలెట్. దీని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా రీచార్జీ మొదలుకొని బస్సు టిక్కెట్ల బుకింగ్ వరకూ అన్నింటినీ చేసుకోవచ్చు. డెబిట్ / క‌్రెడిట్ కార్డు లేదా నెట్‌బ్యాంకింగ్ వాడే చాలా అవసరాలకు బదులుగా పేటీఎమ్‌ను ఉపయోగించుకోవచ్చు.
మీ పేటీఎమ్ వ్యాలెట్ పరిమితిని ఎందుకు పెంచుకోవాలి?
కేవైసీ వెరిఫికేషన్ పూర్తయితే రూ. 1 లక్ష వరకూ పరిమితిని పెంచుకోవచ్చు. ఇది జరిగితే క్యాష్‌బ్యాక్‌లు రావడంలో ఆలస్యం జరగదు. ఈ రకమైన ఖాతా ఉపయోగించుకునే వారికి ప్రత్యేకమైన ఆఫర్లను సైతం పొందే వీలుంది.
పరిమితిని ఎలా పెంచుకోవాలి?
మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో పేటీఎమ్ ఖాతాలో లాగిన్ అవండి.
తర్వాత వ్యాలెట్ అప్‌గ్రేడ్‌లోకి వెళ్లాలి.
దగ్గర్లో ఉన్న కేవైసీ కేంద్రానికి వెళ్లి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదా ఏజెంట్‌కు అపాయింట్‌మెంట్‌కు ఇవ్వొచ్చు.
ఇందుకోసం schedule an appointment or walk-in to nearest KYC center ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.
అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయాలంటే మీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది.
కేవైసీ కేంద్రానికి వెళ్లాలనుకుంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్లలో ఏదో ఒకదాన్ని తీసుకెళ్లాలి.
తర్వాత కేవైసీ ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది.
ఆర్‌బీఐ అనుమతించిన కేవైసీ సంబంధిత పత్రాలను సిద్దంగా ఉంచుకోండి.

ఆర్‌బీఐ అనుమతించిన పత్రాలు (ఇందులో ఏదో ఒకటి)
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్టు
- ఓటరు గుర్తింపు కార్డు
- డ్రైవింగ్ లెసెన్సు
- ఉపాధి హామీ గుర్తింపు కార్డు
* మీరు రూ. 50 వేల కంటే మించిన లావాదేవీలను ఒకేసారి జరపాలనుకుంటే కేవైసీతో పాటు పాన్‌కార్డును ఇవ్వాల్సి ఉంటుంది.
* పేటీఎమ్ కార్యాలయాలకు పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు వెళ్లొచ్చు.
* వెరిఫికేషన్ కోసం పైన తెలిపిన పత్రాలతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలను తీసుకెళ్లాలి.


Click it and Unblock the Notifications