ప్రస్తుత గజిబిజి జీవితంలో అన్నీ వేగంగా జరిగిపోవాలి. ఈ క్రమంలోనే మనం నెట్‌బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్నాం. ప్రతిదీ ఆన్‌లైన్లో జరిగి పోతూ ఉంటే సమయం ఆదా అవుతుంది. అయితే మీరు ఎంత మాత్రం అప్రమత్తంగా ఉన్నారు? బ‌్యాంకులు సాధ్యమైనంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరి మీ వైపు నుంచి మీరేం చేస్తున్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తల ద్వారా మీరు సురక్షితంగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాల నుంచి దూరంగా ఉండేందుకు ఈ విధంగా చేయండి

1.పాస్‌వర్డ్‌ను అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి
మొదట పాస్‌వర్డ్ సెట్ చేసుకునేటప్పుడే మంచి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. దీంతో పాటు నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను అప్పుడప్పుడు మార్చుకోవడం మంచిది. అలాగే ఏటీఎమ్ పిన్‌ను కూడా. నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను, ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను ఒకటే ఉంచుకోకపోవడం మంచిది.

2. పబ్లిక్ కంప్యూటర్లలో ఆన్‌లైన్ లావాదేవీలు చేయకుండా ప్రయత్నించండి
సాధ్యమైనంత వరకూ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ ఉన్నచోట, నెట్ సెంటర్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయి లావాదేవీలు జరపడాన్ని నియంత్రించుకోవడం ఉత్తమం. మీ పర్సనల్ లేదా ఆఫీస్ కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌ల్లో ఇవి చేసుకునేందుకు ప్రయత్నించండి.

3. మ్యూచువల్ ఫండ్ సిప్
మ్యూచువల్ ఫండ్ సిప్‌లను పెట్టేటప్పుడు మనుషులు లావాదేవీల్లో ఏమిచేసేందుకు లేకుండా మొత్తం ఆటోమేటిక్ ఉండేలా చూడండి. ఫండ్ హౌస్ వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూసే ఫండ్ స్థితిగతులు మొత్తం ఆటోమేటిక్‌గా ఉంటాయి కాబట్టి ఏదైనా తప్పున్నట్లు గుర్తిస్తే వెంటనే ఫండ్ హౌస్ దృష్టికి తీసుకెళ్లవచ్చు.

4. మోసపూరిత మెయిల్స్ పట్ల అప్రమత్తత పాటించండి
మీ బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా వచ్చే మోసపూరిత మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ విధమైన మెయిల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ వివరాలను తస్కరిస్తారు. ఈమెయిల్‌లో వచ్చే బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంక్ లింక్‌లపై ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని క్లిక్ చేయండి. అసలు ఈ తరహా మెయిల్స్ పంపే లింక్‌లపై క్లిక్ చేయకపోవడమే మీ ఆర్థిక లావాదేవీలకు మంచిది.

5. హెచ్‌టీటీపీఎస్ ఉందా లేదా?
ఏదైనా డబ్బుకు సంబంధించిన లావాదేవీ జరిపేటప్పుడు ఆ వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ లో హెచ్‌టీటీపీఎస్ ఉందా లేదా చూసుకోవాలి.

6. ఎప్పుడూ పని పూర్తవగానే లాగవుట్ చేయాలి
బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి పని పూర్తయిన తర్వాత లాగవుట్ చేయడం మరిచిపోవద్దు. లాగవుట్ చేయకుండా విండోను మూసివేయవద్దు.

7. యాంటీ వైరస్
పిషింగ్, మాల్‌వేర్, మోసపూరిత పేజీల నుంచి కాపాడేలా మంచి యాంటీ వైరస్ సిస్టమ్‌లో ఉంచుకోవాలి. క్విక్‌హీల్ ఇంటర్నెట్ సెక్యూరిటీ మీ నెట్‌బ్యాంకింగ్ కార్యకలాపాలను సులువుగా సురక్షితంగా జరిగేలా చూస్తుంది. మీకు వీలైతే దీన్ని ప్రయత్నించవచ్చు.

ఎస్ఎంఎస్ అలర్ట్స్
అన్నిరకాల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి మొబైల్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వచ్చే ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ రెండు బ్యాంకు ఖాతాలు ఉండి ఉంటే రెండు మొబైల్ నంబర్లు ఉన్నవారు ఒక్కో నంబరును ఒక్కో ఖాతాకు లింక్ చేయవచ్చు. ఆన్‌లైన్ మోసాల్లో ఒక్కసారే అంత డబ్బును కాజేయలేరు కనుక అలర్ట్స్ సదుపాయం ఉంటే మొదటే హుషారుపడి మోసాన్ని అరికట్టవచ్చు.


Click it and Unblock the Notifications